తెలంగాణలో టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) నోటిఫికేషన్ తేదీ ఖరారు అయింది. వచ్చే నెల మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ ముమ్మరం చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే. మే 7 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు, మే 12 నుంచి 14 …
Read More »ఎంసెట్ పరీక్షలకు హాజరై విద్యార్థులకు శుభవార్త
తెలంగాణలో మే 7న ఎంసెట్ పరీక్ష జరగనున్న సంగతి విదితమే. అయితే ఈ పరీక్షలకు హజరై విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్లో ఇంటర్ ఫస్టియర్ 70% సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. సెకండియర్లో 100% సిలబస్ చదవాల్సిందేనని పేర్కొన్నారు. 2021-22లో కరోనా కారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 70% సిలబస్తో పరీక్షలు రాశారని.. ఎంసెట్లో కూడా అదే సిలబస్ ఉంటుందన్నారు.
Read More »తెలంగాణలో నేటినుంచి ఎంసెట్, ఐసెట్, ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో నేటినుంచి ఎంసెట్, ఐసెట్, ఈసెట్ దరఖాస్తుల స్వీకరించనున్నారు. అభ్యర్థులు సొంత నంబర్లు, ఈమెయిల్ మాత్రమే ఇవ్వాలని కన్వీనర్లు పేర్కొన్నారు. దరఖాస్తుల్లో తప్పులు లేకుండా చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. సమీప కేంద్రాలలో దరఖాస్తులు త్వరగా సమర్పించాలని అధికారుల సూచించారు.
Read More »టీఎస్ ఎంసెట్ గడువు పెంపు
తెలంగాణలో ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 18 వరకు గడువు ఉండగా.. దీనిని పొడిగిస్తూ పరీక్ష నిర్వహణ సంస్థ జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువులోపు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎంసెట్ కన్వీనర్, జేఎన్‌టీయూ రెక్టార్ ఆచార్య గోవర్ధన్ తెలిపారు. కాగా, సోమవారం …
Read More »నేటి నుంచి తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ, వెటర్నరీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్ష ఈ నెల 9 నుంచి 14 వరకు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. అదేవిధంగా పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్‌ఎంసెట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఈరోజు నుంచి హాల్‌టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు.
Read More »