తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో TTDC భవనంలో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఖమ్మం నగరంలోని 3టౌన్ రైతు బజార్, హోల్ సేల్ మరియు రిటైల్ మార్కెట్ ల సమస్యలు, DRDA పక్కన ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, కాటన్ కొనుగోలు, సీసీఐ కొనుగోలు కేంద్రాల తనిఖి, రానున్న మిర్చి …
Read More »రౌండప్ -2019 : ఏప్రిల్ లో తెలంగాణ విశేషాలు
ఏప్రిల్ 4న హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ఆర్ సింగ్ చౌహన్ నియామకం ఏప్రిల్ 12న సాహితీవేత్త శ్రీరమణకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారం ఏప్రిల్ 15న హైకోర్టులో తొలి మహిళా జస్టిస్ గా గండికోట శ్రీదేవి నియామకం ఏప్రిల్ 20న ఘనంగా హైకోర్టు శతాబ్ధి ఉత్సవాలు ఏప్రిల్ 24న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మొదటి ట్రయల్ ఏప్రిల్ 29న రాష్ట్ర సాహిత్య అకాడమీ 2019 పురస్కారాల ప్రకటన
Read More »మల్లన్న దయతో తెలంగాణ అభివృద్ధి
సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రెండు రిజర్వాయర్లకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నామకరణం చేశారని మంత్రి హరీశ్ తెలిపారు. మల్లన్నను దర్శించుకుని ఆ తరువాత కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం భక్తుల ఆనవాయితీ అన్నారు. మల్లన్న దేవుడు, కొండపోచమ్మ అమ్మవారు భక్తులను ఎలా చల్లగ చూస్తున్నారో, రేపు మల్లన్నసాగర్ కొండపోచమ్మసాగర్ వచ్చే నీళ్లు రైతులను చల్లగా చూస్తాయన్నారు. గోదావరి జలాలు కాళేశ్వరం విగ్రహాన్ని అభిషేకం చేసుకుని మల్లన్న …
Read More »పచ్చదనానికి అమితమైన ప్రాధాన్యత
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాకముందు గ్రామాలను, చిన్న చిన్న పట్టణాలను పట్టించుకునేనాథుడే లేడన్నారు. సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో పారిశుద్ధ్యానికి, పచ్చదనానికి అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు. గ్రామాల్లోని వాడవాడలకు, పట్టణంలోని ప్రతి డివిజన్‌లకు ప్రత్యేక నిధులు కేటాయించి పారిశుద్ధ్య పనులు, సీసీ రోడ్ల నిర్మాణానికి పాటుపడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రంగారెడ్డి డివిజన్ పరిధిలోని మారుతీ …
Read More »హైదరాబాద్ లో దారుణం..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని మేడ్చల్ మల్కాజీగిరి జిల్లాలో జగద్గిరిగుట్టలో నల్లగొండ జిల్లా ఆలేరు బొమ్మలూరుకు చెందిన మహేశ్వరి (28) జగద్గిరిగుట్టకు చెందిన వెంకటేష్ గౌడ్ తో పదేళ్ల కిందట వివాహాం జరిగింది. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తుతూ .. తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహేశ్వరి నిన్న శనివారం ఉదయం ఇంట్లో సీలింగ్ …
Read More »2 లక్షల మందికి రైతు బీమా
తెలంగాణలో రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం నడిరోడ్డున పడకూడదు.. ఆ రైతు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం రైతు బీమా. ఈ పథకం కింద రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది . ఈ నేపథ్యంలో రైతు బీమా పథకం కింద అర్హులైన రైతుల సంఖ్య భారీగా పెరగనున్నది. ప్రస్తుత ఆర్థిక …
Read More »2019 రౌండప్-ఫిబ్రవరిలో తెలంగాణ విశేషాలు
ఈ ఏడాదిలో ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విశేషాలు ఏమిటో తెలుసుకుందాము. ఫిబ్రవరి 4న మేలైన పట్టు ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఫిబ్రవరి7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రెండు రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు హైదరాబాద్ …
Read More »2020లో తెలంగాణలో సెలవులు ఇవే…!
2020 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెలవుల లిస్టు విడుదల చేసింది. ఈ మేరకు జీవో నెంబరు 2745ను విడుదల చేసింది. రంజాన్, బక్రీద్, మోహరం తదితర పండుగలు చంద్రుడు కనబడే తేదీని బట్టి స్వల్ప మార్పులు ఉంటాయని జీవోలో తెలిపింది. మొత్తం 17 సాధారణ సెలవులు ప్రకటించింది. వీటిల్లో రిపబ్లిక్, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి, మొహరం, దసరా ఆదివారాల్లో రాగా, దీపావళి రెండో శనివారం వచ్చింది. సాధారణ …
Read More »త్వరలో కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంహా నిర్మించిన ఐటీ టవర్ ను ఈ నెల ముప్పై తారీఖున ఐటీ,పరిశ్ర్తమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తారు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఐటీ టవర్ నిర్మాణపనులను పరిశీలించిన మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ” ఐటీ టవర్ లో స్థానికులకే ఉపాధి అవకాశాలను కల్పిస్తామని “అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతోనే …
Read More »తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు కొత్త రంగులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి దేశ రాజధాని మహానగరం ఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలుకు సరికొత్త రంగులను సంతరించుకోనున్నది. బొగ్గు ఉత్పత్తిలో నంబర్ వన్ గా నిలిచిన సింగరేణి ప్రకటనలు రైలు బోగీలపై కన్పించనున్నాయి. కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే అల్విన్,జనరల్ మేనేజర్ ఆంటోనిరాజా ,రైల్వే అధికారులు నిన్న శుక్రవారం ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు వీడ్కోలు పలికారు. …
Read More »