తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆ పార్టీ శ్రేణులకు,ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ నెల పదిహేడో తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కో మొక్క నాటుదాం అని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు హరితహారం అంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు. సీఎం కేసీఆర్ పుట్టినరోజున ఈచ్ …
Read More »తెలంగాణలో గ్రామీణ న్యాయాలయాలు
తెలంగాణ రాష్ట్రంలో 55 గ్రామీణ న్యాయాలయాల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గ్రామ న్యాయాలయాల చట్టం- 2008 ప్రకారం 55 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలనాఅనుమతులిచ్చింది. ఇందులోభాగంగా 55 మంది జూనియర్ సివిల్ జడ్జిస్థాయి జుడిషియల్ అధికారులను గ్రామ న్యాయాధికారిగా నియమిస్తారు. కోర్టుల నిర్వహణకు 220 మంది హెడ్‌క్లర్కులు, జూనియర్ అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్లు, అటెండర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు. ఈ మేరకు నూతన పోస్టుల మంజూరుకు …
Read More »రైతు బంధు నిధులు విడుదల…!
తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. రైతు బంధు నిధులను విడుదల చేసింది. రైతు బంధు ద్వారా 42.42 లక్షల మంది రైతులు లబ్ది పొందతనున్నారు. ఇప్పటికే 35.92 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులను జమ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రైతుల పెట్టుబడి మొత్తం వారి …
Read More »మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ
రాష్ట్రంలో చెరువులు చిరునవ్వులు చిందిస్తున్నాయి. మిషన్ కాకతీయ ఫలితాలు మొదలైనప్పటినుంచి చెరువుల కింద ఏయేటికాయేడు సాగువిస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. గత మూడేండ్లుగా 15 లక్షల ఎకరాలతో సాగు విస్తీర్ణం స్థిరంగా కొనసాగింది. తాజా నీటిసంవత్సరంలో ప్రాజెక్టుల నీళ్లు కూడా తోడవటంతో అదనంగా పది లక్షల ఎకరాలకు జీవం పోసినట్లయింది. దీంతో చినుకు పడకున్నా చెరువుల కింద ఏటా రెండు పంటలు పండించుకొనే బంగారు భవిష్యత్తు సమీపంలో ఉన్నదనే భరోసా రైతాంగంలో …
Read More »సహకార సంఘ ఎన్నికలలో గులాబీ జెండా ఎగరాలి
వర్థన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేయాలని వర్థన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పిలుపునిచ్చారు. వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట పీఏసీఎస్ ఎన్నికలల్లో పోటీచేసే అభ్యర్ధులు, మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్థన్నపేటలోని సహకార సోసైటీలో అన్నింటిని ఏకగ్రీవం అయ్యేవిధంగా చూడాలని, …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కౌసల్య
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అమీర్ పేటలోని సారథి స్టూడియోలో మొక్కలు నాటిన సినిమా నటి కౌసల్య . ఈ సందర్భంగా కౌసల్య గారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే అవకాశం నాకు లభించడం సంతోషకరమని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశాన్ని పచ్చదనంగా …
Read More »సీఎం కేసీఆర్ రెండో సోదరి భర్త కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సోదరి భర్త పర్వతనేని రాజేశ్వర్‌రావు(84) శనివారం ఉదయం కన్నుమూశారు. అల్వాల్ మంగాపురిలో రాజేశ్వర్‌రావు పార్థివదేహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ ఓదార్చారు. రాజేశ్వర్‌రావు మృతి వార్త తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు.. ఉదయమే మంగాపురికి చేరుకున్నారు. రాజేశ్వర్‌రావు పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇవాళ సాయంత్రం అల్వాల్‌లోనే రాజేశ్వర్‌రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Read More »మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కామారెడ్డి కలెక్టర్ భేటీ
కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఇటీవల నియామకమైన ఐఎఎస్ డా.శరత్ శనివారం మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నూతన కలెక్టర్ శరత్ ను అభినందించారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు,కొత్త స్కీమ్ లు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ కు …
Read More »పుణె మహిళ మగశిశువుకు జన్మ.. కేసీఆర్ కిట్ అందజేత..
మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ మహిళ మేడారంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జాతరకు మూడురోజుల క్రితం చవాన్ శివాని, గోవిందర్ కుటుంబం మేడారం చేరుకొన్నారు. గర్భిణి అయిన శివానితో కలిసి కుటుంబసభ్యులు గురువారం ఉదయం వనదేవతలను దర్శించుకొన్నారు. అంతలోనే నొప్పులురావడంతో శివానీని దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు శివానీకి సాధారణ ప్రసవం చేశారు. ఉదయం 11.48 గంటలకు శివానీ మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువు మూడున్నర కిలోల బరువుతో ఆరోగ్యంగా జన్మించాడు. …
Read More »వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్
మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిద్ద రాజులను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్రం తరపున సీఎం చీర, సారాను సమర్పించారు. …
Read More »