ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు. విదేశాల్లోని భారతీయులంతా విమానాశ్రయాల్లోనే ఉండిపోయినట్లు సమాచారం అందుతోందని కేటీఆర్ తెలిపారు. మనీలా, రోమ్, సింగపూర్, కౌలాలంపూర్ విమానాశ్రయాల్లో ఉన్నట్లు సందేశాలు వచ్చాయి. వారందరినీ స్వస్థలాలకు పంపించేలా ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ ప్రధాని మోదీకి వినతి చేశారు.
Read More »తెలంగాణలోనే తొలిసారి
తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంటిఇంటికెళ్లి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇండోనేషియా నుండి కరీంనగర్ కు వచ్చిన పదకొండు మంది ప్రచారకుల్లో ఏడుగురికి కరోనా పాజిటీవ్ అని తేలడంతో అధికారులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి రామగుండం వచ్చిన సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్లో వాళ్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఎస్ 9 బోగీలో ఉన్నవాళ్లందరూ పరీక్షలు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. అటు నగరంలో 144సెక్షన్ …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకి ఘన స్వాగతం
తెలంగాణ లో కామారెడ్డి జిల్లా టేక్రియాల్ క్రాస్ రోడ్డులో మాజీ ఎంపీ కవితకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు నిజామాబాద్‌కు బయలుదేరిన కవితకు దారిపొడవునా టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందల్వాయి వద్ద కూడా పార్టీ శ్రేణులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కవిత …
Read More »తెలంగాణలో మరో కరోనా కేసు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదైంది. బ్రిటన్ దేశం నుండి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు రీపోర్ట్ వచ్చిందని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇప్పటికే ఐదు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక వ్యక్తి కోలుకుని గాంధీ ఆస్పత్రి నుండి డిశార్జి అయ్యాడు.
Read More »తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు నౌకరి కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ,ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 5,091 అధ్యాపక ఖాళీలు ఉన్నాయి. అయితే మొత్తంగా 404 ప్రభుత్వ ,ఎయిడెడ్ కళాశాలలకు గాను 6,008 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 3,728 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారు. 1,497మంది గెస్ట్ లెక్చరర్స్ గా పని చేస్తున్నారు. 150మంది మినిమం టైం స్కేల్ లెక్చరర్స్ …
Read More »మంత్రి కేటీఆర్ పై కేంద్ర మంత్రి ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయంలో మూడో జరిగిన‘వింగ్స్ ఇండియా-2020’కార్యక్రమానికి సంబంధించి మినిస్టీరియల్ ప్లీనరీలో హర్దీప్‌సింగ్‌పూరి పాల్గొన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పూరి ప్రశంసల జల్లు కురిపించారు. కేటీఆర్‌ను యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్‌గా అభివర్ణించారు. నవభారత నిర్మాణానికి కేటీఆర్ ప్రతినిధిగా నిలుస్తారని కొనియాడారు. ‘వింగ్స్ ఇండియా’ నిర్వహణకు మంత్రి కేటీఆర్, ఆయన అధికారుల బృందం తమకు ఎంతగానో …
Read More »సోషల్ మీడియాలో అతి చేస్తే చర్యలు తప్పవు-సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు. ఎవరు భయపడాల్సినవసరం లేదు. ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో మాత్రమే ఈ వైరస్ సోకుతుంది. ఇక్కడున్నవారికి అది సోకకుండా ఉండేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” సోషల్‌మీడియాలో కొందరు అతిగాళ్లు కరోనా వైరస్ గురించి తమ ఇష్టారీతిన ప్రచారంచేస్తున్నారని, అలాంటివారిపై కఠినచర్యలు తీసుకొంటామని సీఎం హెచ్చరించారు. వారిని …
Read More »మార్చి 31 వరకు అన్ని మూసివేయాలి
తెలంగాణ రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మార్చి 31 వరకు మూసివేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు.నిన్న శనివారం సాయంత్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” ఈ నిర్ణయం శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందన్నారు. ఈ నిర్ణయాన్ని ఎవరు అధిగమించినా కఠినంగా వ్యవహరిస్తామని, ఆ విద్యాసంస్థ గుర్తింపు కూడా రద్దుచేస్తామని హెచ్చరించారు. వీటితోపాటు కోచింగ్‌సెంటర్లు, సమ్మర్‌క్యాంపులు మూసివేయాలని చెప్పారు. విద్యాసంస్థలను మూసివేసినప్పటికీ, …
Read More »తెలంగాణలో స్కూళ్లు, థియేటర్లు,మాల్స్ బంద్?
దేశంలోకరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సర్కార్.. పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసివేయనున్నారు.అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. …
Read More »సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం
కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హైలెవల్ కమిటీ చర్చిస్తోంది. రాష్ట్రంలో ఈ వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై హైలెవల్ కమిటీ సుదీర్ఘంగా చర్చిస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక హైలెవల్ కమిటీ చర్చించిన అంశాలను రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చిస్తుందన్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై …
Read More »