ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ఖానపురం రోడ్ లో రూ.3.75 కోట్లతో నిర్మించిన రెండు వైపులా డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్, నూతన బ్రిడ్జి, సైడ్ డ్రైన్ ను మేయర్ పాపాలాల్ గారితో కలిసి ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నడూ లేని విధిగా కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సుందర నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని …
Read More »తెలంగాణలో రైతుబంధు మార్గదర్శకాలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సాయం విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వారం, పది రోజుల్లోనే ఈ నగదును రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందుకనుగుణంగా మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ.5వేలు చొప్పున రైతుబంధు సాయం అందించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో జనవరి …
Read More »తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 269 కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5,675కు చేరుకుంది. తాజాగా మరో నలుగురు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 192కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు 3,071మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రల్లో 2,412మంది చికిత్స పొందుతున్నారు. …
Read More »సంతోశ్ బాబు కుటుంబానికి అండగా ఉంటాం
భారత – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని… ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా …
Read More »పదిరోజుల్లో 50వేల మందికి కరోనా పరీక్షలు
కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టుదిట్టంగా కట్టడిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు. ప్రైవేటు ల్యాబ్‌లు, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు …
Read More »జలపుష్పాలకు అడ్డా తెలంగాణ
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జలకళ ఉట్టిపడుతున్నది. గోదావరి జలాలను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, గొలుసు చెరువులను నింపుతుండటంతో రైతులు ఆనంద పరవశం చెందుతున్నారు. నిండు వేసవి రోజుల్లో ఎన్నో చెరువులు మత్తడి దుంకుతుండటంతో గ్రామీణ ప్రజల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. గోదావరి జలాలతో ఒక్క రైతులే కాకుండా మత్స్యకారులు కూడా ఎంతో లాభపడుతున్నారు. రిజర్వాయర్లు, చెరువులు సమృద్ధిగా నీటితో …
Read More »మంత్రి సత్యావతి రాథోడ్ గొప్ప మనస్సు
ఆమె సహజంగానే దయామయి. ఎవరినీ నొప్పించని తత్వం. ఎవరైనా బాధపడితే చూడలేని మనస్తత్వం. అలాంటామె కళ్ల ముందు రోడ్డు మీద ఒక వాహనదారుడు అపస్మారక స్థితిలో పడిపోయి కనిపిస్తే ఇక ఆ స్పందన ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. నిజంగా నేడు ఈ సందర్భమే ఎదురైంది. మహబూబాబాద్ నుంచి హైదరాబాద్‌కు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వస్తుండగా మహబూబాబాద్ జిల్లా ఆలేరు దగ్గర …
Read More »తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ఎలాంటి పరీక్షలూ నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పదో తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …
Read More »అందరికీ కరోన టెస్టులు ఎలా సాధ్యం
కరోనా రోగుల చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వ ఆస్పత్రులకు ఉందని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌పై అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు. రోగులకు చికిత్స, సదుపాయాలపై …
Read More »తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ లక్షణాలు ఉన్న కరోనా పాజిటివ్ పేషెంట్లు ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరోనా పేషంట్లకు జిల్లాల్లోనే చికిత్స, జిల్లా కేంద్రాల్లో ఐసోలేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. హోంక్వారంటైన్‌లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. ప్రజల్లో ఉన్న భయం వారిని ఆస్పత్రి నుంచి బయటికి రానివ్వడం లేదన్నారు. ఇంట్లో ప్రత్యేక గది లేనివారు ఆస్పత్రిలోనే ఉండాలని కోరుకుంటున్నారని, …
Read More »