Home / Tag Archives: telanganacmo (page 396)

Tag Archives: telanganacmo

అక్రమ నిర్మాణాలతోనే వరంగల్ కు ముంపు సమస్య

వరంగల్ అర్బన్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్, సహచర మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి వరంగల్ నగరాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో దిగారు. అక్కడి నుంచి నయీం నగర్, కేయూ 100ఫీ ట్ రోడ్ మొదలైన వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. …

Read More »

ప్రగతి భవన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాద్లోని ప్రగతి భవన్‌లో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు, అధికారులతో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారి చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఆయన వెంట పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ …

Read More »

రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ

రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాలు  ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ జిల్లాకే కాక తెలంగాణకే తలమానికం అని పేర్కొన్నారు. అనంతరం శంకర్ పల్లి మండలంలోని మొకీల చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను మంత్రి ఎగురవేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ …

Read More »

జలవనరుల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని సాగునీటి వసతులు పెరిగాయని సీఎం అన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపు హౌజులు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిందని సీఎం అన్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జల …

Read More »

ప్రయివేట్ ఆసుపత్రులకు తెలంగాణ సర్కారు కీలక ఆదేశాలు

కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని పేర్కొంది. పీపీఈ కిట్లు, మందుల ధరలు ఆసుపత్రిలో డిస్ ప్లే చేయాలంది. డిశ్చార్జ్ సమయంలో పూర్తి వివరాలతో బిల్లు ఇవ్వాలి నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Read More »

మొక్కలు నాటిన GWMC కమిషనర్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖులలో ఉధృతంగా పచ్చదనం పెంపొందించడానికి ఉద్యమంలా సాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ ను వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి పమేలా సత్పతి స్వీకరిస్తూ బుధవారం వరంగల్ వడ్డేపల్లి లోని గ్రీన్ లెగసీ పార్క్ ప్రాంగణంలో మొక్కలు నాటి, వాటి సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకున్నారు. మొక్కలు నాటిన అనంతరం కమిషనర్ పమేలా సత్పతి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధీ జన్మంతు, …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సునీత

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది.ఒకరి నుండి మరొకరికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ సెలెబ్రిటీలు తమవంతుగా మొక్కలు నాటుతున్నారు. సినీనటి సునీత మనోహర్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి సంజీవయ్య పార్క్ లో మూడు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా లోరా అమ్ము మాట్లాడుతూ… గౌరవ ఎంపీ సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అపూర్వమైనదని ఈ …

Read More »

తెలంగాణాలో మళ్ళీ భారీగా కరోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ పంజా విసురుతోంది… కాస్త త‌గ్గిన‌ట్టుగానే అనిపించిన క‌రోనా వైర‌స్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 1,897 కేసులు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి.. ఇదే స‌మ‌యంలో 9 మంది మృతి చెందారు.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 84,544కు చేర‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన‌వారి సంఖ్య …

Read More »

మరో 26 బస్తీ దవాఖానాలు

ఈనెల 14వ తేదీన ఉదయం 9.30 గంటలకు నగరంలో మరో 26 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. పేద ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసేందుకే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. జీహెచ్ంఎంసీ పరిధిలో 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రస్తుతం 170 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్యం అందుతోందని ఆయన …

Read More »

నాగార్జున సాగర్ లో జలకళ

 నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు … ప్రస్తుత నీటిమట్టం 562.10 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 40,259 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 6,816 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 237.3032 టీఎంసీలుగా ఉంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat