కరోనా వచ్చి, డబ్బులు లేక, ఇబ్బందులు ఉన్నా, మన జీఎస్టీ ఇవ్వకపోయినా ఉన్నంతలో పేదలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా బీజేపీ అడ్డుపడిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరదల భారిన పడి ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేస్తుంటే చిల్లర రాజకీయం చేసి అడ్డుపడిన బీజేపీ తీరు అమ్మ పెట్టదు.. అడుక్కొని తీననీయదు అన్నట్లుగా ఉందని సీఎం అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ …
Read More »నూటికి నూరుశాతం విజయం మనదే-సీఎం కేసీఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయం తమదేనని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం ముగిసింది. భేటీ ప్రారంభంలో ఇటీవల మరణించిన పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి సీఎం నివాళి అర్పించారు. అంతా కాసేపు మౌనం పాటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ …
Read More »జీహెచ్‌ఎంసీలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సర్కిళ్ల వారీగా ఆర్వోలు నోటీసు విడుదల చేశారు. అన్ని జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు దాఖలు చేయొచ్చు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 21 నామినేషన్ల పరిశీలన. …
Read More »తెలంగాణలో మరో వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్న మహీంద్రా సంస్థ
తెలంగాణకి మరో పెట్టుబడి రానున్నది. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా జహీరాబాద్లో తన అతి పెద్ద ట్రాక్టర్ తయారీ కేంద్రాన్ని కలిగి ఉన్నది. ఇక్కడ వంద కోట్ల రూపాయల అదనపు పెట్టుబడి పెట్టనున్నట్లు మహీంద్రా గ్రూప్ ఈ రోజు ప్రకటించింది. మహీంద్రా తన కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ కి సంబంధించి ఈ అదనపు పెట్టుబడి వినియోగించనున్నట్లు తెలిపింది. జహీరాబాద్ లో ఉన్న తన ట్రాక్టర్ల తయారీ యూనిట్ వద్ద …
Read More »హైదరాబాద్ మరింత సురక్షితంగా, భద్రంగా : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగంరంలోని బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం మరో రెండు, మూడు నెలల్లో పూర్తి అవుతుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నిర్మాణం పూర్తితో హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా, మరింత భద్రంగా మారనున్నట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ నేడు పరిశీలించారు. హోంమంత్రి మహమూద్ అలీ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మేయర్ …
Read More »జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు మోగిన నగారా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని మసబ్ ట్యాంక్‌లో 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్ విడుదల చేశారు. బుధవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 24న ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ …
Read More »నేడే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మంగళవారం ఉదయం 10.30గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి మీడియా సమావేశం నిర్వహించనుండగా.. ఈ సందర్భంగా ఆయన నోటిఫికేషన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కోసం ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం …
Read More »అధునాతన హంగులతో.. పేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్య..
సిద్ధిపేట జిల్లాలో మరో నాలుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాల నిర్మాణాలకు ₹14 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు గారు తెలిపారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ దిశగా జిల్లాలో మండలానికి ఒక కస్తూర్బా బాలికల పాఠశాలలను మంజూరు చేసుకున్నామని చెప్పారు.16 పాఠశాలలకు స్వంత భవనాలు ఉన్నాయ్.. 6 పాఠశాలలకు స్వంత భవనాలు లేక విద్యార్థులకు …
Read More »టీఎస్ బీపాస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేయడానికి రూపొందించిన టీఎస్ బీపాస్ వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. దీంతో రాష్ట్రంలో టీఎస్‌బీపాస్ నేటినుంచి అమల్లోకి వచ్చింది. పట్టణప్రాంతాల్లో భవన నిర్మాణం, లేఅవుట్లకు సులభతరంగా, వేగంగా అనుమతులివ్వడం కోసం ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం రూపొందించింది. దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారు. నిర్దేశించిన గడువులోగా అనుమతులు, …
Read More »తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారి కరోనా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య మూడింతలు పెరిగింది. నిన్న కొత్తగా 502 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 1539 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,57,876కు చేరింది. ఇందులో 2,42,084 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కరోనా కేసుల్లో 14,385 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 11,948 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో …
Read More »