సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రూ.1200 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు మర్కూక్ మండలం ఎర్రవల్లి నుంచి సీఎం కేసీఆర్ బయల్దేరుతారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేట శివారులో ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.20 గంటలకు పొన్నాలలో కొత్తగా నిర్మించిన తెలంగాణ భవన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 11.40 గంటలకు మిట్టపల్లిలో నూతనంగా నిర్మించిన …
Read More »హైదరాబాద్ చేరుకున్న 64 దేశాల రాయబారులు
మరికాసేపట్లో శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీకి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం చేరుకోనుంది. వీరు రెండు గ్రూపులుగా విడిపోయి.. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ సంస్థలను సందర్శించి కోవిడ్ టీకాలపై చర్చించనున్నారు. టీకాల తయారీపై ఫోటో ఎగ్జిబిషన్‌ను ఈ బృందాలు తిలకించనున్నాయి. టీకాల పురోగతిని తెలుసుకున్న అనంతరం శాస్ర్తవేత్తలతో రాయబారులు, హైకమిషనర్లు భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు రాయబారులు, హైకమిషనర్లు ఢిల్లీ బయల్దేరనున్నారు. విదేశీ ప్రతినిధుల రాక నేపథ్యంలో రాష్ట్ర …
Read More »ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం లేఖ రాశారు. పార్లమెంట్ కొత్త భవన సముదాయానికి ఈ నెల 10న ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తుండటం గర్వకారణంగా ఉందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు దేశ సార్వభౌమత్వానికి గర్వకారణమని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టును ఎప్పుడో చేపట్టాల్సి ఉండే.. ప్రస్తుతమున్న …
Read More »GHMC Results Update-నేరెడ్‌మెట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
గ‌్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో నిలిచిన నేరెడ్‌మెట్ ఫలితం వెల్లడి అయింది. నేరెడ్‌మెట్ 136వ డివిజన్‌లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం 56కు చేరింది. నిలిచిపోయిన నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. బుధవారం ఉదయం 8 గంటలకు ఆ డివిజన్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. సైనిక్‌పురిలోని …
Read More »రైతులు టెర్రరిస్టులు కాదు-మంత్రి కేటీఆర్
వ‌్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భారత్ బంద్‌లో పాల్గొంటున్నారు. షాద్‌నగర్ వద్ద బూర్గుల టోల్‌గేట్ వద్ద టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు భారత్ బంద్‌లో పాల్గొన్నారు. రైతులు టెర్రరిస్టులు కాదు అనే ప్లకార్డును కేటీఆర్ ప్రదర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం …
Read More »కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకం
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకమని, ఆ చట్టాల వల్ల రైతులకు భారీ నష్టం కలుగుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవి. వీటి ద్వారా రైతన్నలకు లాభం జరగకపోగా భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఈ చట్టాలను వ్యతిరేకిస్తోంది. నూతన చట్టంలో ‘మద్దతు ధర’ అన్న …
Read More »భారత్ బంద్‌లో ఎమ్మెల్సీ కవిత
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్‌లో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. కామారెడ్డి జిల్లా టెక్రియల్ చౌరస్తా వద్ద నిర్వహించిన రైతుల ధర్నాలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ కవిత.. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బ్లాక్ బెలూన్స్‌ను …
Read More »పదో తరగతి విద్యార్థులకు శుభవార్త
కొవిడ్ నేపథ్యంలో పదో తరగతిలో ఇప్పటికే 70 శాతం మేరకే సిలబస్‌ను ఆన్‌లైన్‌లో బోధిస్తున్న పాఠశాలలు మిగిలిన 30 శాతాన్ని యాక్టివిటీ బేస్డ్ కార్యకలాపాలకు కేటాయిస్తున్నాయి. ఇక పరీక్షలను కూడా కుదించి, అవి రాసే సమయాన్ని కూడా తగ్గించాలని విద్యాశాఖ భావిస్తున్నది. ఆన్‌లైన్/డిజిటల్ క్లాసులకు అనుగుణంగానే పదో తరగతి పరీక్షలను 11 నుంచి ఆరుకు తగ్గించే అవకాశాలను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు చొప్పున, …
Read More »తెలంగాణలో జోరుగా భారత్‌బంద్
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్‌బంద్ తెలంగాణలో కొనసాగుతోంది. బంద్‌కు అధికార టీఆర్‌ఎస్ పార్టీతో పాటు వామపక్షాలు మద్దతు తెలిపాయి. భారత్‌బంద్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలోని ఆర్‌టీసీ బస్‌లు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారు జాము నుంచే డిపోల ఎదుట టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు నిరసన తెలిపారు. ఉమ్మడి నల్గొండ రైతుల సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ …
Read More »భారత్ బంద్ లో పాల్గొనండి -మంత్రి తలసాని పిలుపు
రైతులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా.. రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద సనత్‌నగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే బంద్‌కు …
Read More »