అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలు అభిమానాన్ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజల గుండెల్లో కారు.. గులాబీ జెండా.. కేసీఆర్ మాత్రమే ఉన్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సోమవారం రాత్రి ఖమ్మం నగరంలోని త్రీ టౌన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వందల కోట్ల రూపాయలతో ఖమ్మం నగరాన్ని ఆధునీకరించామని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, పార్క్‌ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలతో …
Read More »మంత్రి పువ్వాడ అగ్రహాం
తెలంగాణలో ఖమ్మం అభివృద్ధిలో రోల్ మోడల్‌గా ఉండాలని.. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువస్తూ తపన పడుతుంటే మండల సమావేశానికి రావడానికి సర్పంచ్‌లకు, ప్రజాప్రతినిధులకు తీరిక లేదా అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో బాధ్యతో గెలిపించి గ్రామాభివృద్ధి చేయాలని బాధ్యతలు అప్పగిస్తే నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ఆయన మండిపడ్డారు. సోమవారం జిల్లాలోని రఘునాధపాలెం మండలం సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య …
Read More »బీజేపీ నేతలపై మంత్రి వేముల ఫైర్
ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొందరు స్థాయికి మించి సీఎంపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. మా సహనాన్ని పరిక్షించొద్దు. మీ వైఖరి మార్చుకోకుంటే టీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో మిమ్మల్ని అడ్డుకుంటారని బీజేపీ పార్టీని హెచ్చరించారు. …
Read More »ఈ నెల 7న తెలంగాణ వ్యాప్తంగా డ్రై రన్
దేశంలో 2 కరోనా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సన్నాహంగా ఈ నెల 7న డైరన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే MBNR, HYD జిల్లాల్లోని 7 కేంద్రాల్లో డ్రైరన్ పూర్తి కాగా.. ఆ సందర్భంగా ఎదురైన సమస్యలు సవాళ్లను పరిష్కరించనున్నారు. వెయ్యికిపైగా సెంటర్లలో ఆ రోజున ఉ.9 నుంచి సా.5 వరకు డమ్మీ వ్యాక్సినేషన్ చేస్తారు.
Read More »తెలంగాణలో సంక్రాంతి సందర్భంగా 4980 అదనపు బస్సులు
తెలంగాణలో సంక్రాంతి పండుగ సందర్భంగా 4980 అదనపు బస్సులు నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ బీ వరప్రసాద్ తెలిపారు. ఎంజీబీఎస్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 14 వరకు స్పెషల్ బస్సులను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు 3,380.. ఆంధ్రప్రదేశ్‌కు 1600ల బస్సులు నడిపేందుకు ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు. తిరుగు ప్రయాణానికి ముందస్తుగానే సీట్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్టు చెప్పారు. ఈ …
Read More »రైతుకు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన రైతు నల్ల నాగేశ్వర్‌రెడ్డికి ఫోన్ చేశారు. ఏం పంట పండిస్తున్నావని ఆరా తీశారు. రైతుతో శుక్రవారం సీఎం కేసీఆర్ సాగించిన ఫోన్ సంభాషణ ఇలా.. సీఎం కేసీఆర్: జహీరాబాద్ ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో ఆలుగడ్డ పంట సాగు చేస్తున్నరు? రైతు నాగేశ్వర్‌రెడ్డి: సార్! గతంలో 2500 ఎకరాల నుంచి 3000 ఎకరాల వరకు …
Read More »జనవరి 8 వరకు రైతుబంధు
తెలంగాణలో అర్హులైన రైతులందరికీ ఈనెల 8వ తేదీ వరకు రైతుబంధు సాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు రైతుబంధు కింద 48.75 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.4,079 కోట్లు జమ చేసినట్లు వెల్లడించింది. ఈనెల 8వ తేదీ వరకల్లా 60.88 లక్షల మంది పట్టాదారులకు రైతుబంధు సాయం అందజేస్తామని పేర్కొంది.
Read More »తెలంగాణ రాష్ట్ర రైతు బంధు పథకం రెండోరోజు 1,125 కోట్లు
తెలంగాణలో రైతుబంధు సాయం పంపిణీ వేగంగా కొనసాగుతున్నది. రెండోరోజు రెండెకరాల వరకు భూమి కలిగిన పట్టాదారులు 14.69 లక్షల మంది ఖాతాల్లో రూ. 1,125.31 కోట్లు జమచేశారు. తొలిరోజు ఎకరంలోపు భూమిఉన్న 16.04 లక్షల మంది రైతులకు రూ.494.11 కోట్లు అందజేసిన విషయం తెలిసిందే. రెండ్రోజుల్లో మొత్తం 30.73 లక్షల మంది పట్టాదారులకు రూ.1,619.42 కోట్లు పంపిణీ చేసింది. బుధవారం మూడెకరాల భూమి గల పట్టాదారుల ఖాతాల్లో రైతుబంధు సాయం …
Read More »మంత్రి కేటీఆర్‌కు మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు
తెలంగాణ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం మున్సిపల్ పరిధిలో సీసీ, బీటీ రోడ్ల అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ నెల 7న కేటీఆర్ ఖమ్మంలో ఐటీ హబ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఖమ్మం మున్సిపల్‌లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరుచేయాలని కేటీఆర్‌కు పువ్వాడ విజ్ఞప్తిచేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా …
Read More »రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధన ఎత్తివేత…
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లకు ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనను ఎత్తివేసింది. రిజిస్ట్రేషన్ల కోసం ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతినిచ్చింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలగాయి. రిజిస్ట్రేషన్ అయిన వాటికి రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని ప్రభుత్వం తెలిపింది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని కొత్త …
Read More »