Home / Tag Archives: telanganacmo (page 360)

Tag Archives: telanganacmo

బీజేపీకి మంత్రి కేటీఆర్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడులను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఏ మాత్రం చోటు లేదన్నారు. బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టులో కొనసాగుతున్న ఎత్తిపోతలు

తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లింక్‌-1 పరిధిలోని కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో 5 పంపులతో 10,500 క్యూసెక్కుల నీటిని సరస్వతి బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. సరస్వతి పంపుహౌస్‌లో 4 మోటర్ల ద్వారా 11,720 క్యూసెక్కుల నీటిని పార్వతి బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. పార్వతి పంపుహౌస్‌లో ఆరు మోటర్ల ద్వారా 12,610 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లిలోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడినుంచి నంది రిజర్వాయర్‌కు.. ఇక్కడి మూడు మోటర్లతో 9,450 క్యూసెక్కుల నీటిని …

Read More »

తెలంగాణలో రేషన్ పంపిణీలో సరికొత్త విధానం

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి రేషన్‌ బియ్యం పంపిణీలో  కొత్తవిధానం అమల్లోకి వస్తున్నది. బయోమెట్రిక్‌ విధానానికి బదులుగా ఓటీపీ ఆధారంగా రేషన్‌బియ్యం పంపిణీ చేయనున్నారు. కార్డుదారుల ఫోన్‌ నంబర్‌ ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరికానున్నది. అయితే ఇందులో కార్డు ఎవరి పేరు మీదైతే ఉంటుందో వారి ఫోన్‌ నంబరు మాత్రమే ఆధార్‌కు అనుసంధానం ఉండాల్సిన అవసరం లేదు. కార్డులో సభ్యులుగా ఉన్నటువంటి ఎవరిదైనా సరే ఫోన్‌ నంబర్‌ ఆధార్‌తో అనుసంధానం ఉంటే …

Read More »

డీ రాజాకు ఎమ్మెల్సీ కవిత పరామర్శ

ఇటీవల అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజాను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. నగరంలో జరుగుతున్న పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో పాల్గొన్న ఆయన నిన్న స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే పార్టీ నాయకులు ఆయన్ను కోఠీలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో దవాఖానలో చికిత్స పొంతుదున్న ఆయనను ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఉదయం పరామర్శించారు. చికిత్స గురించి వైద్యులతో …

Read More »

ఆరోగ్య తెలంగాణ వైపు రాష్ట్రం వడివడిగా అడుగులు

తెలంగాణ రాష్ట్రంలో మాతా, శిశు మరణాల రేటు తగ్గుదలలో దేశంలోనే  మొదటి స్థానంలో ఉందని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఇది కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాల ద్వారానే సాధ్యమయ్యిందని చెప్పారు. మహబూబాబాద్‌ జిల్లా ఏరియా దవాఖానలో పల్స్‌ పోలియో చుక్కల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లాలో 46 కేంద్రాల ద్వారా సుమారు 75 వేల మందికి పోలియో చుక్కలు వేస్తున్నామని చెప్పారు. బంగారు తెలంగాణ కావాలంటే …

Read More »

తెలంగాణలో రేపటి నుండి బడి గంట

కరోనా నేపథ్యంలో మూతబడిన విద్యాసంస్థలు 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 9 ఆపై తరగతులకు ప్రత్యక్షబోధనకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌తోపాటు వృత్తివిద్యా కళాశాలలన్నీ తెరుచుకోబోతున్నాయి. మొత్తంగా 30 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశాలున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు 70శాతానికి పైగా తల్లిదండ్రులు సమ్మతి పత్రాలు సమర్పించినట్టు అధికారులు చెప్తున్నారు. సమ్మతి …

Read More »

తెలంగాణ అసెంబ్లీలో మ‌హాత్ముడికి ఘ‌న నివాళులు

తెలంగాణ అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోని మ‌హాత్మాగాంధీ విగ్ర‌హానికి పూల‌మాల వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. మ‌హ్మాతుడి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన వారిలో శాస‌న‌స‌భ‌ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, మండ‌లి ‌చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి గారు, హోంమంత్రి మ‌హముద్ అలీ గారు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ గారు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత‌ మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు గారు, నేతి …

Read More »

చిన్నారి వైద్యానికి మంత్రి కేటీఆర్ భరోసా

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి  ఔదార్యాన్ని చాటుకున్నారు. చావుబతుకుల్లో ఉన్న చిన్నారి వైద్యం కోసం ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌కు వారం రోజుల క్రితమే స్పందించిన ఆయన, సీఎం సహాయ నిధి నుంచి శుక్రవారం రూ.3.50 లక్షల ఆర్థికసాయం అందించారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని చిన్నబోనాలకు చెందిన వ్యవసాయ కూలీ కాశెట్టి అనిల్‌-సౌమ్య దంపతుల రెండున్నరేళ్ల కూతురు ఆద్యశ్రీ కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నది. ఒక్కగానొక్క …

Read More »

తెలంగాణలో కొత్తగా 186కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి గం.8 వరకు కొత్తగా 186 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,306కు చేరింది. ఇక నిన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,598కు పెరిగింది. ఇప్పటివరకు 2,90,354 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 2,354 యాక్టివ్ కేసులున్నాయి

Read More »

గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. గాంధీ అహింస సత్యాగ్రహం దీక్షల ద్వారా స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఉరకలెత్తించారని కీర్తించారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఎప్పటికైనా సత్యానిదే అంతిమ విజయమని గాంధీ జీవితం చాటి చెప్తుందని అన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat