Home / Tag Archives: telanganacmo (page 343)

Tag Archives: telanganacmo

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానలో కవిత కరోనా టీకా మొదటి డోసు వేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరు టీకా తీసుకోవాలని కోరారు. ఇటీవల కవిత భర్త అనిల్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆమెతోపాటు కుటుంబ సభ్యులంతా …

Read More »

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖలో 10వేల ఉద్యోగ ఖాళీలు

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ శాఖల్లో 10వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తేల్చారు అధికారులు ఇందులో గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులు 7వేలకు మించి ఉన్నాయి. త్వరలో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న సర్కార్ నిర్ణయం మేరకు ఖాళీలను గుర్తించి వివరాలు సిద్ధం చేశారు. ఇక రాష్ట్రంలో వైద్య, పంచాయతీ గురుకుల, పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆయా శాఖల పరిధిలో.. మిగతా శాఖల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు

Read More »

తెలంగాణలో భారీగా కరోనా కేసులు

తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయి తాజాగా.. రాష్ట్రంలో 535 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,06,339 కి చేరింది. తాజాగా మరో ముగ్గురు కొవిడ్ తో మరణించారు. మొత్తం మరణాలు 1688కి పెరిగాయి. మరో 278 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక యాక్టివ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మార్చి ఒకటో తేదీకి రాష్ట్రంలో 1907 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. నేటికి ఆ సంఖ్య 4,495కి పెరిగింది.

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్  హోళీ పండుగ శుభాకాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్  హోళీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే, క‌రోనా వైర‌స్ మళ్లీ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ప్ర‌జ‌లు వీధుల్లో గుంపులుగా చేరకుండా ఎవ‌రి ఇండ్ల‌లో వారే ప్ర‌శాంతంగా పండుగ చేసుకోవాల‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో గుమిగూడ‌టంవ‌ల్ల క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత వేగంగా ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. అంద‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ వైర‌స్ క‌ట్ట‌డిలో త‌మ వంతు …

Read More »

తెలంగాణలో భారీగా అదనపు కలెక్టర్ల బదిలీ..

తెలంగాణ రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. కరీంనగర్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నరసింహారెడ్డిని మేడ్చల్‌ మల్కాజిగిరికి ట్రాన్స్‌ఫర్‌ చేసింది. మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌గా ఉన్న కే విద్యాసాగర్‌ను బదిలీ చేసింది. ఆయనను రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. జీ. రమేశ్‌ను మెదక్‌, మోహన్‌ రావును సూర్యాపేట అదనపు కలెక్టర్లుగా నియమించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌ పీ.రాంబాబును నిర్మల్‌కు బదిలీ …

Read More »

గ్రేటర్ హైదరాబాద్ కు మళ్లీ పాతరోజులు వస్తాయా..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాద్  పరిధిలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది గడిచిన 24 గంటల్లో మరో 142 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 82,438 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సామాజిక దూరం పాటించి, మాస్క్ ధరించాలని అధికారులు తెలియజేశారు

Read More »

తెలంగాణలో తగ్గని కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి గతరాత్రి గం.8 వరకు కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,804కు చేరింది. ఇక నిన్న కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,685కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 247 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 4241 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 58 029 కరోనా పరీక్షలు నిర్వహించారు…

Read More »

జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల‌కు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ర్టంలోని జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. సెక్ర‌ట‌రీల ప‌ట్ల మ‌రోసారి సీఎం కేసీఆర్ గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. అంద‌రి ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ఈ ఏప్రిల్ నుంచే రెగ్యుల‌ర్ జీతాలు ఇస్తామ‌న్నారు.శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. క‌డుపులు నింపినోళ్లం.. క‌డుపు కొట్టినోళ్లం కాదు.. పంచాయ‌తీరాజ్ చ‌ట్టాన్ని ప‌టిష్టంగా చేయ‌డం వ‌ల్లే గ్రామాలు బాగు చెందుతున్నాయి. హ‌రిత‌హారంలో నాటిన …

Read More »

తెలంగాణలో లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ

‌తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధిస్తారని వస్తున్న వార్తలపై తెలంగాణ  ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు శాస‌న‌స‌భ వేదిక‌గా క్లారిటీచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్డౌన్ విధించం అని ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. లాక్‌డౌన్ అనేది పెట్టం. ప‌రిశ్ర‌మ‌ల మూసివేత ఉండ‌దు. ఇప్ప‌టికే చాలా దెబ్బ‌తిన్నాం. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తే క‌రోనాను …

Read More »

ఎమ్మెల్సీ కవిత భర్తకు కరోనా

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన ఆరోగ్యంగా, హోంక్వారంటైన్‌లో ఉన్నారని సతీమణి కవిత బుధవారం ట్విట్టర్‌ ద్వారావెల్లడించారు. తనతోపాటు కుటుంబసభ్యులు క్వారంటైన్‌లో ఉన్నామని చెప్పారు. ఈ కారణంగా ఎవరినీ కలవలేమని, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనలేనని స్పష్టంచేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat