తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూతో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. జన సంచారం తక్కువగా ఉండే రాత్రి సమయంలో కర్ఫ్యూ పెట్టి ఏం లాభమని పశ్నించారు. ఈ నిర్ణయం కరోనా వ్యాప్తిని ఎలా అడ్డుకోగలదో అర్థం కావట్లేదన్నారు. కరోనా కట్టడికి పగటి పూట కర్ఫ్యూ విధించాలని సూచించారు. కనీసం 144. సెక్షన్ విధించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. …
Read More »తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు..!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఏటా వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా కారణంగా సామూహికంగా జరుపుకోలేక పోతున్నామని పేర్కొన్నారు. భద్రాచలంలో రాములోరి కల్యాణాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులు టీవీల ద్వారా వీక్షించాలని కోరారు.
Read More »తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీ రామనవమి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో శుద్ధ నవమి నాడు ప్రతిఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావం చేత సామూహికంగా జరుపుకోలేక పోతున్నామన్నారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో పరిమిత సంఖ్యలో దేవాలయ పూజారులు అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న రాములవారి కళ్యాణమహోత్సవాన్ని ఆన్ లైన్ ప్రసారాల ద్వారా సీతారామభక్తులందరూ దర్శించుకోవాలని సిఎం కోరారు. లోక …
Read More »గ్రేటర్ పరిధిలో భారీగా కరోనా కేసులు
గ్రేటర్ పరిధిలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.GHMCలో గడచిన 24 గంటల్లో మరో 793 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 91,563 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »తెలంగాణలో కర్ఫ్యూ.. ఎప్పటి నుండి అంటే..?
ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాష్ర్టంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ …
Read More »దమ్ముంటే ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురా : మంత్రి కేటీఆర్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇల్లంతకుంట మండలం కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.బండి సంజయ్‌ను సూటిగా అడుగుతున్నా.. ఈ రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్‌కు ప్రత్యేకంగా ఒక్క పైసా అయినా తెచ్చారా? మతం పేరుతో రెచ్చగొట్టడం, చిల్లర రాజకీయం చేయడం సరికాదు. దమ్ముంటే అభివృద్ధిలో తమతో పోటీ …
Read More »తెలంగాణలో నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ ‘371డి’లోని (1) (2) క్లాజ్‌ల కింద దాఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి.. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్-2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీచేసిన …
Read More »తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలిసారి కేసుల సంఖ్య 5వేలు దాటేసింది. తెలంగాణ వ్యాప్తంగా శనివారం 1,29,637 టెస్టులు నిర్వహించగా.. 5,093 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 3,51,424కు పెరిగింది. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మరణాలు కూడా అత్యధికంగా నమోదయ్యాయి. గత ఏడాది జూన్ 7, జూలై 31, ఆగస్టు …
Read More »టీఆర్ఎస్ సీనియర్ నేత మృతి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ముషీరాబాద్ టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, హెచ్‌ఎంఎస్ కార్మిక సంఘం నాయకుడు బల్లవీరస్వామి(75) అనారోగ్యంతో తన నివాసంలో ఆదివారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ సుప్రియానవీన్‌గౌడ్, టీఆర్‌ఎస్ యువజన విభాగం నగర నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ భక్తియార్, నాయకులు వీరస్వామి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబానికి …
Read More »కరోనా వాక్సిన్ తీసుకున్న మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ ఆర్టీసీ వర్క్ షాప్ ఆస్పత్రిలోని వాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు… వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మొదటి డోస్ టీకా తీసుకున్నారు..కరోనా వాక్సినేషన్ పట్ల ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీకా కేంద్రంలో ఉన్న సదుపాయాలు, టీకా సరఫరాలపై అధికారులతో చర్చించి నిరంతరం …
Read More »