తెలంగాణలోని పల్లెల్లో సరైన చికిత్స అందకపోవడం, కిట్ల కొరతతో టెస్టులు జరగకపోవడంతో కరోనా తీవ్రతరం అవుతోంది. ప్రాణాలూ కోల్పోతున్నారు. జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్లో నెలరోజుల్లో 20 మంది మరణించగా, 200 మందికి పైగా కరోనా సోకింది. నిర్మల్ జిల్లా కడెం మండలం పాతమద్దిపడగలో 20 రోజుల్లో 10 మంది కరోనాకు బలయ్యారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో ఇటీవల 150 మందికి కరోనా సోకగా, ఏడుగురు మరణించారు.
Read More »ఆక్సిజన్ సిలిండర్లను అందించడానికి మేఘా ముందుకు
కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దాంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నిమ్స్, అపోలో, సరోజినిదేవి వంటి ఆస్పత్రుల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఆక్సిజన్ అందించమని అభ్యర్థనలు వచ్చాయి.. వచ్చిందే తడవుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజన్ సిలిండర్లను …
Read More »పుట్ట మధు అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీఛైర్మన్ పుట్టా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని భీమవరంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ నుంచి పుట్టా మధు కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన సతీమణి.. కొవిడ్ నుంచి కోలుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మధు అరెస్ట్ అయ్యారు. ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేశారనేది పోలీసులు …
Read More »తెలంగాణలో రెండు వారాల్లోనే లక్షకు పైగా కేసులు
తెలంగాణలో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోంది.రాష్ట్రంలో గడచిన రెండు వారాల్లోనే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా టెస్టుల నిర్వహణ మరో పెద్ద సమస్యగా మారింది. టెస్టులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. కిట్ల కొరతే ఇందుకు కారణమని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. దీంతో లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. టెస్ట్ జరగకపోవడంతో అందరితో కలిసి ఉంటున్నారు.. దీంతో వైరస్ ఇతరులకు వ్యాపిస్తోంది.
Read More »18ఏళ్ల పైబడినవారికి ఎప్పుడంటే టీకా.?
తెలంగాణలో కొవిడ్ టీకాలలో రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. 18ఏళ్లు దాటినవారు మరికొన్ని రోజులు ఆగాల్సివస్తోంది. ఈ నెల 15 వరకు స్లాట్ బుకింగ్ ఉండదని, తర్వాత పరిస్థితుల్ని బట్టీ నిర్ణయిస్తామని వైద్యారోగ్యశాఖ చెప్పింది. ఆర్డర్ చేసినన్ని డోసులు వస్తే 18ఏళ్ల వారికి టీకాలు ఇవ్వనున్నారు. ఇక నేటి నుంచి రెండో డోసు కోసం స్లాట్ బుకింగ్తో సంబంధం లేకుండా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లవచ్చు.
Read More »తెలంగాణలో ఈ నెల 15 వరకు కొవిడ్ టీకా మొదటి డోసు నిలిపివేత
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ టీకా రెండో డోసు మాత్రమే ఇవ్వాలని ఆరోగ్యశాఖ నిర్ణయంఈ నెల 15 వరకు కొవిడ్ టీకా మొదటి డోసు ఆపేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఉంది.రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారు.మొదటి డోసు వ్యాక్సినేషన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Read More »తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల బెడ్స్ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
కరోనా రోజురోజుకు మరింత కర్కషంగా వ్యవహరిస్తున్నది. వైరస్ సోకినవాళ్లలో కొద్దిమంది రోజుల వ్యవధిలోనే దవాఖానల్లో చేరాల్సి వస్తున్నది. మెరుగైన చికిత్స, ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం అవుతున్నాయి. ఏ దవాఖానలో బెడ్స్ ఖాళీగా ఉన్నాయి ? ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడికివెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంటున్నది. ఈ నేపథ్యంలో బెడ్స్ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, వివరాలు ప్రభుత్వ దవాఖానలు టిమ్స్, గచ్చిబౌలి – 9494902900 గాంధీ హాస్పిటల్ – 9392249569, …
Read More »కరోనా వేవ్ తీవ్రతపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా రెండోవేవ్ తీవ్రత మే 15 తర్వాత తగ్గొచ్చని రిపోర్టులు సూచిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా నిరోధానికి ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అటు ప్రధానితో ఫోన్లో మాట్లాడిన సీఎం.. తెలంగాణకు రోజుకు 500 టన్నుల ఆక్సిజన్ కావాలని కోరారు. రోజువారీగా 2 లక్షల నుంచి 2.5లక్షల కరోనా టీకాలను సరఫరా చేయాలన్నారు. రెప్రెసివిర్ ఇంజక్షన్ల సంఖ్యను రోజుకు 25 వేలకు పెంచాలని …
Read More »మాజీ మంత్రి ఈటలతో మాజీ ఎంపీ భేటీ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే,సీనియర్ నేత,మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరి ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిన్న రాత్రి ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ‘నేను రాజకీయాల గురించి మాట్లాడేందుకు రాలేదు. ఈటల సతీమణి జమునా రెడ్డి నా సమీప బంధువు. ఈటల ఏ నిర్ణయం …
Read More »తెలంగాణ సర్కారు మరో సంచలన నిర్ణయం – ఏకంగా ఇంటికే..?
తెలంగాణలో కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావద్దని సీఎం కేసీఆర్ కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు, ఎఎన్ఎం ల ద్వారా ఇంటింటికీ అందజేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు.రాష్ట్రంలో లాక్ డౌన్ ఎందుకు విధంచగూడదనే విషయం గురించి సీఎం లోతైన …
Read More »