తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్లు. లాంఛనంగా ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు , CS సోమేశ్ గారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్నివాల్ వాహనాలు మంజూరు చేసింది. ఆర్టీఏ శాఖ ద్వారా కొనుగోలు చేసిన ఆయా వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు ప్రగతి భవన్ లో ప్రభుత్వ కార్యదర్శి …
Read More »కరోనా పోరులో ముందుండి సేవలందించిన ప్రతి ఒక్కళ్ళు యోధులే-TRS పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి
కరోనా పోరులో ముందుండి సేవలందించిన ప్రతి ఒక్కళ్ళు యోధులేనని TRS పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి అన్నారు.శనివారం ఆరాం ఘర్ X రోడ్డు వద్ద పరివార్ ధాబా లోని బ్యాన్క్వెట్ హాల్ లో జరిగిన ఫార్మసీ రంగానికి చెందిన కోవిడ్ వారియర్స్ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో పనిచేసే వారు , ఫార్మసీ …
Read More »కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలి
కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలి అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ను విదేశాల నుంచి దిగుమతి కి చర్యలు చేపట్టాలి. కోవిడ్ 19 చికిత్సకు సంబంధించిన మందులు, ఇతర సామగ్రిపై జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన పన్నుల సిఫారసులకు మద్ధతు. 44 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు. ################# దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి ప్రాణాలు …
Read More »తెలంగాణలో కొత్తగా 1,707 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,493 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,00,318కి పెరిగాయి. వీరిలో 5,74,103 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇంకా 22,759 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు మొత్తం 3,456 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా …
Read More »రేపు యాదాద్రికి ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ.. రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణతోపాటు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్ కూడా యాదాద్రికి వెళ్తారు. యాదాద్రీశుని దేవాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం పునఃనిర్మిస్తున్న విషయం తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ నిన్న …
Read More »జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం కొనసాగుతున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ అత్యవసర వస్తువులు, బ్లాక్ ఫంగస్ మందులపై పన్ను రేట్ల తగ్గింపు, ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు …
Read More »ఈటల రాజీనామాకు ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరతారని ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మొదట.. నగరంలోని గన్‌పార్క్ దగ్గర రేపు అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి …
Read More »ఐటీలో తెలంగాణ దేశానికి ఆదర్శం
కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచి పురోగతి సాధించామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ విధానాలు, సమష్టి కృషితోనే ఇది సాధ్యమయ్యిందన్నారు. సీఎం దార్శనికతతో దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతున్నామని చెప్పారు. నగరంలోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో పరిశ్రమలు, ఐటీ శాఖ వార్షిక నివేదికలను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారదర్శకత కోసం వార్షిక నివేదికలు విడుదల చేస్తున్నామని …
Read More »డయాగ్నస్టిక్ హబ్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి ఐకే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలతో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాలలో రూ. 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంందించే …
Read More »తెలంగాణలో కొత్తగా 1,813 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్‌తో మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మరో 1,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,301 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 1,29,896 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
Read More »