నారాయణపేట జిల్లా కేంద్రంలో రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును కేటీఆర్ ప్రారంభించారు. సమీకృత మార్కెట్‌కు, అమరవీరుల స్మారక పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కలెక్టర్ హరిచందనతో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Read More »ఎమ్మెల్యే వివేకానంద్ ను కలిసిన సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని అంగడిపేట్ పేట్ బషీరాబాద్ కు చెందిన సోషల్ వెల్ఫేర్అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కుమ్మరి సురేష్, వైస్ ప్రెసిడెంట్ కుమ్మరి శ్రీకాంత్, జెనరల్ సెక్రెటరీ కుమ్మరి ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ వేముల క్రిస్టోఫర్, ట్రెజరర్ …
Read More »నాటిన ప్రతి మొక్కను సంరక్షించడమే లక్ష్యం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6, 10, 12, 13వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో ప్రజలు తప్పక మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. …
Read More »IITA లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వివిధ వర్గాల వారిని ప్రత్యేకంగా ఆకర్షిస్తు అందరిని భాగస్వామ్యం చేస్తోంది.శనివారం రోజు మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (IITA) ఆవరణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గారు, ఇంటలిజెన్స్ ఐజి ప్రభాకర్ రావు గారు, …
Read More »సీఎం కేసీఆర్‌కు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ ఆహ్వానం
ఈ నెల 13వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలకు సతీసమేతంగా హాజరుకావాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన ట్రస్టీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందించింది. శుక్రవారం ప్రగతిభవన్‌లో దేవస్థాన ట్రస్టీ ఫౌండర్ కె.సాయిబాబ గౌడ్, ఈవో అన్నపూర్ణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వానించారు. సీఎంకు ఆహ్వానం పలికిన వారిలో ఆలయ అర్చకులు, ట్రస్టుబోర్డు సభ్యులు తదితరులున్నారు. 12వ …
Read More »రైతుగా మారిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
వరి వేదజల్లే సాగు పద్దతితో రైతులకు అనేక లాభాలు ఉన్నాయని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో రైతు రాయగారి శ్రీనివాస్ చెందిన వరి వెదజల్లే సాగును పరిశీలించేందుకు వచ్చిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రైతుగా మారి పోలంలో వరి వేదజల్లే విత్తనాలు పోశారు. పోలం చూట్టు కలియతిరిగి మొలక వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన …
Read More »నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 (యాభై వేలు) ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సిఎం ఆదేశించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ …
Read More »మంత్రి కేటీఆర్‌తో కైటెక్స్ కంపెనీ ప్రతినిధులు భేటీ
ప్రగతి భవన్‌లో రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో కైటెక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశం అయ్యారు. కేరళకు చెందిన ప్రముఖ వస్ర్త వ్యాపార సంస్థ కైటెక్స్.. రాష్ర్టంలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఈ సందర్భంగా జౌళి రంగంలో పెట్టుబడుల యోచనపై మంత్రితో ఆ బృందం చర్చించింది. పారిశ్రామిక విధానాలు, జౌళి రంగంలో అవకాశాలను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ …
Read More »ఖమ్మం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు రంగం సిద్ధం
తెలంగాణలో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మొత్తం 157 ఎకరాల్లో భూ సేకరణ పూర్తి చేసి టీఎస్ఐఐసీకి అప్పగించింది. ఇందులో రైస్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఏటికేడు పెరుగుతోన్న ధాన్యం దిగుబడులకు అవసరమైన రవాణా, మిల్లింగ్ కష్టాలు తీరనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు భూ సేకరణ పూర్తిఖమ్మం జిల్లాకు కేటాయించిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు కసరత్తు శరవేగంగా సాగుతోంది. …
Read More »కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు
కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు మళ్లీ తెలంగాణలోకి వస్తున్నారని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనషులకు కాంగ్రెస్‌లోకి పంపి రాష్ర్టంలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని తెలిపారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే.. ఆంధ్రాబాబు అని చంద్రబాబును ప్రజలు తరిమేశారు అని గుర్తు చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో తన వాళ్లకు …
Read More »