Home / Tag Archives: telanganacmo (page 283)

Tag Archives: telanganacmo

నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంపై సీఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రాల జ‌ల్లు కురిపించారు. సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో ఇచ్చిన హామీల‌ను త‌ప్ప‌కుండా నెర‌వేర్చుతాన‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్న‌ట్లు సీఎం ప్ర‌క‌టించారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ‌ అభివృద్ధిపై హాలియా మార్కెట్‌యార్డులో సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో అద్భుత‌మైన విజ‌యాన్నిచ్చి ముందుకు న‌డిపించినందుకు …

Read More »

హాలి‌యాకు చేరుకున్న‌ సీఎం కేసీ‌ఆర్‌

నాగా‌ర్జు‌న‌సా‌గర్‌ నియో‌జ‌క‌వర్గ కేంద్రం హాలి‌యాకు సీఎం కేసీఆర్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు చేరుకున్నారు. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో కేసీఆర్ సాగ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. హాలియాకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా టీఆర్ఎస్ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. హాలియా మార్కె‌ట్‌‌యా‌ర్డులో ప్రజా‌ప్ర‌తి‌ని‌ధులు, అధి‌కా‌రు‌లతో లిఫ్ట్‌ పథ‌కాల పనుల పురో‌గ‌తిపై కేసీఆర్ సమీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ముఖ్యంగా నెల్లి‌కల్‌, ఇతర …

Read More »

తెలంగాణ రైతాంగానికి శుభవార్త

బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై రైతుల రుణమాఫీపై చర్చించింది. ఈ నెల 15వ తేదీ నుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి, నెలాఖరు కల్లా పూర్తిచేయాలని వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. తాజా నిర్ణయంతో దాదాపు ఆరు లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారు. …

Read More »

ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కనున్నది. గవర్నర్‌కోటాలో ఇటీవల ఖాళీఅయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును ఖరారుచేస్తూ ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర క్యాబినెట్‌ తీర్మానించింది. ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు చేసింది. ఆమోదం కోసం సంబంధిత ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపింది. గవర్నర్‌ ఆమోదం తెలిపాక కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామాచేసి గతనెల 21న సీఎం కేసీఆర్‌ సమక్షంలో …

Read More »

ఈ నెల 16 నుంచి దళితబంధు అమలు

దళితబంధు పథకాన్ని ఈ నెల 16 నుంచి అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. దళితులను పెట్టుబడిదారులుగా అభివృద్ధిచేయడం కోసం ప్రతి జిల్లాలో ‘సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ప్రైజ్‌’ ఏర్పాటుచేయాలని తీర్మానించింది. ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆరు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రజాసంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. దళిత బంధు …

Read More »

వెనక్కి తగ్గిన బండి సంజయ్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయుదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 9 నుంచి పాదయాత్ర చేయబోతున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. దీంతో జాతీయ పార్టీ ప్రత్యేక అనుమతి ఇస్తేనే షెడ్యూల్ ప్రకారం పాదయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.  మరోవైపు పార్లమెంట్ సమావేశాల తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో …

Read More »

తెలంగాణలో ఏడేండ్లలో..15,000 పరిశ్రమలు

తెలంగాణ రాష్ట్రంలో సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం ఉండటంతో ఆర్థికాభివృద్ధి శరవేగంగా సాగుతున్నదని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఏడేండ్లుగా పల్లెలు, పట్టణాలు సమతుల అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల అనుకూల విధానాల వల్ల 15 వేల పరిశ్రమలకు పైగా రాష్ర్టానికి వచ్చాయని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామికీకరణ సమానస్థాయిలో శరవేగంగా దూసుకుపోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమర్థ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం ఉన్నందు వల్లనే ఇది …

Read More »

జంటనగరాల్లో వైభవంగా బోనాల వేడుకలు

జంటనగరాల్లో బోనాల వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నగరంలోని ఏ వీధిలో చూసినా బోనాల సందడే కనిపిస్తున్నది. భాగ్యనగరంలోనే వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు కనుల పండువలా సాగుతున్నాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారన బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు. గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో కేవలం ఇండ్ల వద్దనే మొక్కులు చెల్లించారు. ఈసారి వైరస్‌ ఉధృతి కాస్త …

Read More »

సీఎం కేసీఆర్‌ పాలనలో గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి బాటలు

సీఎం కేసీఆర్‌ పాలనలో గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి బాటలు పడ్డాయని అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి, ఓయూ జేసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాంయాదవ్‌ అన్నారు. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలోనే యాదవులకు మంచి రోజులు వచ్చాయన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్‌ మండలం అంబాలలో యాదవ మహాసభ గ్రామ అధ్యక్షుడు బోయిని చంద్రమౌళితోపాటు కమిటీ సభ్యులు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతూ తీర్మానం చేశారు. ఈ ప్రతిని శనివారం …

Read More »

పత్తి అమ్మకాల్లో తెలంగాణ సరికొత్త రికార్డు

పత్తి అమ్మకాల్లో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిన్న మొన్నటి వరకు ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌ను వెనక్కినెట్టి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నది. 2020-21లో దేశవ్యాప్తంగా పత్తి అమ్మకాల్లో తెలంగాణ నంబర్‌ 1గా నిలిచింది. ఒక్క మన రాష్ట్రం నుంచే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఏకంగా 1.78 కోట్ల క్వింటాళ్ల (178.55 లక్షల క్వింటాళ్లు) పత్తిని కొనుగోలు చేయటం గమనార్హం. దేశంలో ఇదే అత్యధికమని సీసీఐ ప్రకటించింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat