హుజురాబాద్‌లో కాంగ్రెస్ లేనే లేదని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ దేశంలోని బీజేపీ పాలిత 18 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తేనే హుజురాబాద్‌లో రాష్ట్ర బీజేపీ నేతలు ఓటు అడగాలన్నారు. బీజేపీ నేతలు మాయ మాటలు చెప్తున్నారని, వారి మాటలు నమ్మవద్దన్నారు. ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్‌కు మధ్యనే పోటీ అన్నారు. ప్రజలు ఓటు వేసేందుకు వెళ్తున్నప్పుడు సిలిండర్‌కు దండం పెట్టండని …
Read More »రిజర్వేషన్లకు బీజేపీ సర్కారు ఎసరు పెడుతుంది
బీజేపీ విధానాలను ఆ పార్టీ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ మోర్చా వంటి సంఘాలే తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే..ఆ పార్టీకి మనమేందుకు ఓటెయ్యాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మొద్దని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ఆ సంఘాల నాయకులు డిమాండ్‌చేసినా మోదీ ప్రభుత్వం లెక్కచేయలేదని విమర్శించారు. దొడ్డువడ్లు కొనని, ఉద్యోగాలు ఊడబీకే బీజేపీకి ఓటెందుకు వేయాలని నిలదీశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైకోర్టు లో రివ్యూ పిటీషన్
వినాయక చవితి కి ఒక రోజు ముందు కోర్టు తీర్పు వచ్చిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైకోర్టు లో రివ్యూ …
Read More »వేల చేతులు, లక్షల ఆలోచనలతో సురవరం పనిచేశారు
వేల చేతులు, లక్షల ఆలోచనలతో సురవరం పనిచేశారు.తెలంగాణ సమాజం మీద ఆయన తనదైన ముద్ర వేశారు.దీనజనోద్దరణ, సమాజ అభ్యున్నతి కోసం సురవరం చిరకాలం కృషిచేశారు.దాదాపు 80 ఏళ్ల క్రితమే దళితుల దండోరా పేరుతో సామూహిక భోజనాలు ఏర్పాటు చేసిన చైతన్యశీలి సురవరం ప్రతాపరెడ్డి గారు. ఒక వ్యక్తి బహుముఖంగా పనిచేయడం చరిత్రలో అరుదుగా కనిపిస్తుంది అలాంటి అరుదయిన వ్యక్తి ప్రతాపరెడ్డి గారు.గత ఏడాది సెప్టెంబరు 9న సురవరం ప్రతాపరెడ్డి గారి …
Read More »అన్ని ఆలయాల్లో సదుపాయాలను మెరుగుపరుస్తాం
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సదుపాయాలను మెరుగుపర్చాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం బొగ్గులకుంటలో దేవాదాయశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల్లో భక్తుల సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల విషయంలో రాజీపడకుండా పనిచేయాలని అధికారులకు సూచించారు. సమస్యలుంటే ఉన్నతాధికారులకు కానీ..లేదంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఇతర ఆలయాలను ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం …
Read More »అటవీ అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రద్ధాంజలి
అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలొదిలి అమరులైన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటించారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ప్రాణాలను సైతం వదిలిన వీరి స్ఫూర్తి మనకు ఆదర్శం అని సీఎం అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశం ఇచ్చారు. సీఎం కేసీఆర్ సందేశం.. అనాది కాలం నుంచి మనుషులు, అడవులది విడదీయరాని బంధం. ప్రకృతి, పర్యావరణం …
Read More »కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి కొండంత అండ – మంత్రి కొప్పుల
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట TRS గ్రామశాఖ అధ్యక్షుడి గా ఎన్నికైన బండి విజయ్ ఈరోజు కరీంనగర్ క్యాంప్ కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్దెంకి నర్సయ్య, MPTC గోస్కుల రాజన్న, ఉప సర్పంచ్ కిషోర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మల్లారెడ్డి, TRSV మండల అధ్యక్షుడు అవారి చందు,సీనియర్ నాయకులు కడమండ వెంకటి, …
Read More »సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించిన మంత్రి తలసాని
శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వినాయకుడి దయవల్ల సాయిధరమ్ తేజ్‌కు ఎం కాలేదని, త్వరలోనే కోలుకుంటారని అన్నారు. చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని తెలిపారు. హెల్మెట్, షూస్, జాకెట్ వేసుకోవడం వల్ల ఎం కాలేదని చెప్పారు. సాయి తేజ్‌పై అసత్య ప్రచారాలు …
Read More »మరోమారు చరిత్ర సృష్టించనున్న తెలంగాణ
తెలంగాణ మరోమారు చరిత్ర సృష్టించనుంది. దేశంలో డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా నిలవనుంది. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టు శనివారం ప్రారంభం కానుంది. డ్రోన్ల ఫ్లైట్లతో అటవీ ప్రాంతాల ప్రజలకు ఔషదాలు సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. …
Read More »వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు
వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ సందర్భంగా చారిత్రాత్మక వేయిస్తంభాల గుడిలో వినాయకుడికి పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని, తెలంగాణ ప్రజలు …
Read More »