బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తయారీ పూర్తయిన బతుకమ్మ చీరల ప్యాకింగ్ కూడా మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని చంద్రయాణగుట్టలోని టెస్కో గోడౌన్లలో ఈ ప్రక్రియ చకచకా నడుస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అర్హులైన మహిళలందరికీ ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈసారి రూ.333 కోట్లు కేటాయించి టెస్కో ఆధ్వర్యంలో …
Read More »హుజూరాబాద్ నియోజకవర్గంలో అమల్లోకి ఎన్నికల కోడ్..
హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల …
Read More »ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణే- మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో పురోగమిస్తుందని, ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణే అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగాల ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టారు. సభ్యులు మాట్లాడిన అనంతరం కేటీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తెలంగాణ యొక్క పారివ్రామిక పురోగతి రెండు మాటల్లో చెప్పాలంటే.. ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా, ఎర్రబస్సు నుంచి …
Read More »నల్గొండ జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం
గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా పెట్టడం ద్వారా నల్గొండ జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టిన క్రమంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో జిల్లా పరిధిలో ఉన్న జాతీయ రహదారి – 65పై నిరంతరాయంగా నిర్వహిస్తున్న వాహనాల తనిఖిలలో ఒక …
Read More »మూడు తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ
మూడు తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. కన్న కల తీరకముందే తుదిశ్వాస విడిచారు. అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలచిన బాపూజీ.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా తన సర్వస్వం ధారబోసారు. తన జీవిత కాలం అంతా ప్రజల కోసమే పరితపించారు. ఎన్నో ఏండ్లు జైలు జీవితం గడిపారు. ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబర్ 27న జన్మించిన బాపూజీ.. …
Read More »నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
బిజినపల్లి మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన కాశీం అనే వ్యక్తి గత నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతనికి వెన్నుముక, మరియు నడుము భాగంలో ఎముకలు బాగా దెబ్బతినడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని నిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు సూచించడంతో అతని కుటుంబ సభ్యులు వెంటనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారిని కలవడంతో వెంటనే కాశీం ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నాలుగు లక్షల …
Read More »మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ
మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వకారణమని చెప్పారు. సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ …
Read More »ఈటల కంటే రెండేండ్లు ముందుగానే టీఆర్‌ఎస్‌లోకి గెల్లు
అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణతో పోటీపడే రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంటే చెప్పాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో వ్యవసాయాభివృద్ధికి ఏ పథకాలు అమలుచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నిర్మించనున్న రెడ్డి స్కిల్ డెవలప్‌మెంట్ భవనానికి శనివారం …
Read More »భవిష్యత్తులో రెడ్డి కార్పొరేషన్
తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండానే 10 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలుచేస్తున్నట్టుగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో భవిష్యత్తులో రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తామని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు హామీ ఇచ్చారు. రెడ్డి కులస్తుల్లోని పేదలకు కూడా కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్స్ వంటివి అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అన్ని వర్గాల్లోని పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. హుజూరాబాద్‌లో న్యాయానికీ అన్యాయానికీ.. ధర్మానికీ అధర్మానికీ మధ్య …
Read More »పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలి
ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌నగర్ జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు విజ్ఞప్తిచేశారు. తాము చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలని కోరారు. కేంద్రమంత్రితో సీఎం కేసీఆర్ శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ సాగునీటి పారుదలకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఏపీ …
Read More »