యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై ఏర్పాటుచేసి న అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక సంస్కరణలు, పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని స్పష్టం చేశారు. సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టడంతో …
Read More »కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి జానారెడ్డి షాక్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కాగా పీఏసీ సమావేశానికి హాజరైన సీనియర్ నేత జానారెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. నల్గొండలో స్నేహితుడి అంత్యక్రియలకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. ‘‘ప్రతి సారి సమావేశానికి రాను.. నా అవసరం ఉన్నప్పుడే వస్తా’’ అంటూ వెళ్లిపోయారు. రాష్ట్ర ప్రజలకు జానారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పీఏసీ సమావేశంలో హుజురాబాద్ ఫలితంపై సమీక్ష, వరి సాగు, నిరుద్యోగ …
Read More »TPCC చీఫ్ రేవంత్ పై కాంగ్రెస్ నేతలు అగ్రహాం
తెలంగాణలో నిన్న మంగళవారం ఫలితాలు విడుదలైన హుజురాబాద్ ఉప ఎన్నికలో 3112 ఓట్లకే ఎందుకు పరిమితమైంది? కాం గ్రెస్‌కు సంస్థాగతంగా ఉన్న ఓటింగ్ అంతా ఎక్కడికి పోయింది? రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఈ ప్రశ్న అనేక ఊహాగానాలకు తెర తీస్తున్నది. శత్రువు శత్రువు మిత్రుడైనట్టు.. ఢిల్లీలో పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమని మండిపోయే బీజేపీ కాంగ్రెస్‌లు.. హుజూరాబాద్ ఎన్నికల్లో చెట్టపట్టాలేసుకొని తిరిగాయ ని, తద్వారా కాంగ్రెస్ ఓట్లు సాలీడ్‌గా బీజేపీకి పడ్డాయని పలువురు …
Read More »కాంగ్రెస్ టికెట్ 25 కోట్లకు తాకట్టు పెట్టిన రేవంత్
హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కుమ్మ క్కు కావడం వల్లే బీజేపీ గెలిచిందని టీఆర్‌ఎస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హుజూరాబాద్ కాంగ్రెస్ టికెట్‌ను రూ.25 కోట్లకు లోపాయికారిగా బీజేపీకి అమ్ముకొన్నారని ఆరోపించారు. మంగళవారం కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో హుజూరాబాద్ ఉప ఎన్నిక లెక్కింపు కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న హయాంలో గత హుజూరాబాద్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి 62 …
Read More »NEET లో తెలంగాణ గురుకులం సత్తా
జాతీయస్థాయిలో వైద్య విద్యాప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గతేడాది 135 మంది విద్యార్థులు నీట్‌లో అర్హత సాధించగా.. ఈ సారి ఏకంగా 305 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 35 మంది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అర్హతను సాధించగా.. ఈ ఏడాది ఏకంగా 65 మంది వివిధ రిజర్వేషన్ …
Read More »లైఫ్ సైన్సెస్ ఆర్ అండ్ డీలో హైదరాబాద్ హవా
లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలకు భారతీయ నగరాలు ప్రపంచంలోనే అత్యంత కీలకంగా మారాయి. వీటిలో హైదరాబాద్ ప్రపంచ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్నట్టు అంతర్జాతీయ అధ్యయన సంస్థ ‘ఎఫ్‌డీఐ బెంచ్‌మార్క్’ వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్‌లో నోయిడా అగ్రస్థానంలో నిలిచిందని, హైదరాబాద్ తర్వాత 3 నుంచి 6 స్థానాల్లో వరుసగా చెన్నై, గుర్గావ్, పుణే, బెంగళూరు ఉన్నాయని తాజా నివేదికలో పేర్కొన్నది. కొవిడ్ వ్యాప్తితో వైద్యారోగ్య …
Read More »Huzurabad By Poll Results-రోటీ మేకర్ గుర్తుకు 280 ఓట్లు..
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌కు తొలి రౌండ్‌లో 122 ఓట్లు ,సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి 280ఓట్లు వచ్చాయి. శ్రీకాంత్ గుర్తు రోటి మేకర్.. ఇది కారు గుర్తును పోలి ఉండటం పెద్ద కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.తొలి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ 166 ఓట్ల ఆధిక్యంలో …
Read More »Huzurabad By Poll Results-తొలి రౌండ్ లో BJP ముందంజ
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ముగిసిన వెంటనే హుజురాబాద్ మండల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. తొలిరౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 166 ఓట్లతో ముందజలో ఉన్నారు. బీజేపీకి 4610 ఓట్లు, టీఆర్ఎస్‌కు 4,444 ఓట్లు వచ్చాయి
Read More »ప్రపంచ విత్తన గని “తెలంగాణ”
తెలంగాణ కిరీటంలో మరో అరుదైన, అద్భుతమైన కలికితురాయి వచ్చి చేరింది. ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన రాష్ర్టాన్ని ‘ప్రపంచ విత్తన భాండాగారం’గా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ నెల 4, 5 తేదీల్లో ఇటలీ రాజధాని రోమ్ నగరం వేదికగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) అంతర్జాతీయ విత్తన సదస్సును నిర్వహించనున్నది. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ర్టాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. …
Read More »తెలంగాణలో మొత్తం ఓటర్లు 3.03 కోట్లు
తెలంగాణలో ఓటర్ల ముసాయిదా జాబితా-2022ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో రాజకీయ పార్టీలతో ఓటర్ల జాబితాపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానంతరం జిల్లాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశామని, వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామని తెలిపారు. బూత్ …
Read More »