తెలంగాణలోకరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పడకలు, ఆక్సిజన్, మందులు, పరీక్ష కిట్లు అవసరం మేరకు సమకూర్చుకోవాలన్నారు. అన్ని దవాఖానాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని, ఖాళీలు ఉంటే 15 రోజుల్లోగా భర్తీ చేసుకునేలా విధివిధానాలు రూపొందించాలని కేసీఆర్ సూచించారు.
Read More »15-18 ఏళ్ల మధ్య వయసు వారికి నేటి నుంచి వ్యాక్సిన్లు
దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి నేటి నుంచి వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు ఏర్పాట్లు చేయగా.. కొవిన్ యాప్, పోర్టల్ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా.. వ్యాక్సిన్ కేంద్రానికి నేరుగా వెళ్లి టీకా తొలి డోసు తీసుకున్న 4 వారాలకు వీరికి రెండో డోసు ఇస్తారు. కాగా ప్రస్తుతం ఈ వయసు వారికి కొవాగ్జిన్ టీకా ఒక్కటే అందుబాటులో ఉంది.
Read More »ఈ నెల 10వరకు రైతుబంధు ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 వానకాలంలో ప్రారంభించిన రైతుబంధు ద్వారా ఈ యాసంగి దాకా నాలుగేండ్లలో 8 సీజన్లకు రైతాంగానికి రూ.50,682.30 కోట్లు పంట పెట్టుబడిగా ఇచ్చింది. ప్రస్తుతం 8వ విడత సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది. ఈ సీజన్‌లో గత నెల 28న ప్రారంభమైన రైతుబంధు పంపిణీ ఈ నెల 10 వరకు కొనసాగుతుంది.సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు అత్యంత వైభవంగా …
Read More »తెలంగాణలో కొత్తగా 317 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో ఇద్దరు మరణించారు. గడిచిన 24గంటల్లో కరోనా నుంచి మరో 232 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,733 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా నేడు 28,886 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు.
Read More »తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 12కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది. వీరిలో 27మంది బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Read More »బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ సెటైర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలో షేక్‌పేట్-రాయదుర్గం ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్ రాయదుర్గం వైపు నుంచి ఫ్లై ఓవర్ ఎక్కి షేక్‌పేట వైపు వెళ్లారు. ప్రయాణంలో వంతెనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీసి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఎస్‌ఆర్‌డీపీ ఇంజనీరింగ్ అధికారుల బృందం గొప్పగా కృషి చేసిందని కొనియాడారు. అదే సమయంలో, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో దయచేసి ఈ ఫొటోలను …
Read More »మరోసారి మానవత్వం చాటుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి….
పర్వతగిరి మండల కేంద్ర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్వతగిరి గ్రామ శివారులో కారు, బైక్ ఢీకొని ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు వెంటనే క్షతగాత్రుల వద్దకు వెళ్లి అంబులెన్సు ఫోన్ చేసి బాధితులను పరామర్శించారు. అంబులెన్స్ వచ్చే వరకు అక్కడే ఉండి, ఎంజీఎం సూపరేంటెండ్ గారికి ఫోన్ చేసి రోడ్డు …
Read More »హైదరాబాద్ ప్రజలకు న్యూ ఇయర్ కానుక
న్యూ ఇయర్ కానుకగా హైదరాబాద్ ప్రజల కోసం షేక్ పేట్ ఫ్లైఓవర్ ను ఈ రోజు మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. రూ. 333.55 కోట్ల అంచనాతో నిర్మించిన 2.8కి.మీ ఈ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి JNTU జంక్షన్ వరకు 17 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులభతరం చేయనుంది.
Read More »కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వస్త్రాలపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనలు విరమించుకోవాలని లేఖలో కోరిన ఆయన.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించాలన్నారు. జీఎస్టీ పెంపుతో వస్త్ర పరిశ్రమ కుదేలవుతుందన్న మంత్రి కేటీఆర్ కోట్లాది మంది చేనేతల జీవితాలు దెబ్బతింటాయన్నారు. వస్త్రాల ధరలు పెరిగి సామాన్యులు కూడా ఇబ్బంది పడతారన్న మంత్రి.. రైతుల మాదిరిగా నేతన్నలు కూడా కేంద్రంపై తిరగబడతారన్నారు.
Read More »సొంతగూటికి మాజీ మేయర్ రవీందర్ సింగ్
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ సీఎం కేసీఆర్ ను కలిశారు. దీంతో ఆయన మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవీందర్ సింగ్ టీఆర్ఎస్కు రెబెల్ గా పోటీ చేశారు. ఈ క్రమంలోనే పార్టీపై, మంత్రి గంగులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు బీజేపీ కూడా మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. కానీ తాజాగా సీఎం …
Read More »