తెలంగాణలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ సర్కార్.. మరో గుడ్ న్యూస్ చెప్పింది. రీవాల్యూ యేషన్, రీకౌంటింగ్ కోసం అప్లై చేసిన వారు.. తమ దరఖాస్తును శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి రద్దు చేసుకునే అవకాశం కల్పించింది. విద్యార్థులు చెల్లించిన ఫీజు తిరిగి పొందవచ్చని పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి తమ కళాశాల ప్రిన్సిపాళ్ల ద్వారా నగదు తీసుకోవచ్చని తెలిపింది.
Read More »తెలంగాణలో కొత్తగా 1913 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు నాలుగు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది… తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1,913 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాకుండా గత ఇరవై నాలుగంటల్లో కరోనా బారీన పడి ఇద్దరు మరణించారు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 1,214 కేసులు ఒక్క రాజధానిమహానగరమైన హైదరాబాద్ పరిధిలోనే ఉండటం విశేషం. నిన్న గురువారం కొత్తగా …
Read More »వలస పాలకులు ఓడించిన రైతన్నను గెలిపించిన CM KCR
2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర వ్యవసాయ రంగ స్థితి, రైతాంగ పరిస్థితి అగమ్యగోచరం. సాగునీరు లేదు. కరంటు రాదు. విత్తనాలు కావాలంటే పోలీస్ స్టేషన్ల ముందు బారులు తీరి నిలబడాల్సిన అగత్యం. ఎరువులు కావాలంటే లాఠీఛార్జీలో దెబ్బలు తినాల్సిన రోజులు. భూగర్భజలాలు అడుగంటిపోయిన పరిస్థితి. తాగునీటికి కూడా గడ్డుకాలం. కరంటు అడిగితే కాల్చిచంపిన పరిస్థితులు. కరంటు బిల్లులు కట్టలేదని కోతకు వచ్చిన పొలాల దగ్గర నుండి …
Read More »‘తెలంగాణ బంద్’ను ఉపసంహరించుకున్న బీజేపీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా,ఈ నెల 10న తలపెట్టిన ‘తెలంగాణ బంద్’ను ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. అలాగే ఈ నెల 8 నుంచి BJP తలపెట్టిన కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు జీవో 317తో అన్యాయం జరుగుతోందని, దానికి సవరణలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతోపాటు అక్రమ అరెస్టులను నిరసిస్తూ తొలుత బంద్ కి …
Read More »కొల్లాపూర్లో మామిడి మార్కెట్ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోనే అత్యధికంగా మామిడి పంట కొల్లాపూర్ ప్రాంతంలోనే పండుతుంది.. ఇక్కడ్నుంచి దేశవిదేశాలకు ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇక్కడ మార్కెట్ లేకపోవడంతో స్థానిక రైతులు తమ పంటను అమ్ముకునేందుకు రాష్ట్ర …
Read More »తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కల్గిస్తోంది. మరోసారి భారీగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 42,531 టెస్టులు చేయగా 1,520 పాజిటివ్ కేసులు వచ్చాయి. నిన్నటితో (1,052) పోలిస్తే ఏకంగా 500 కేసులు ఎక్కువగా వచ్చాయి. ప్రస్తుతం 6,168 యాక్టివ్ కేసులుండగా, కరోనాతో ఒకరు మరణించారు. అయితే ఇవాళ ఒమిక్రాన్ కేసులేవీ రాలేదని వైద్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఒమిక్రాన్ …
Read More »బీజేపీ అంటే భకవస్ జుమ్లా పార్టీ.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి అనుకున్నాం. బండి సంజయ్ కు …జేపీ నడ్డాకు పెద్ద తేడా లేదు. బీజేపీ అంటే భకవస్ జుమ్లా పార్టీ. యూపీలో బీజేపీ సర్కార్ చేసింది ఏమి లేదు…అంతా చిల్లర రాజకీయం. దేశంలో చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని బిజెపి ఆలోచనగా వుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వామ్య పక్షాలు ఎవరు అంటే …
Read More »తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా-2022 ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈమేరకు మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474, మహిళా ఓటర్లు 1,50,98,685, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారు. ఇక 18-19 ఏళ్ల మధ్య ఓటర్ల సంఖ్య 1,36,496గా ఉండగా.. 2021తో పోలిస్తే మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 2 లక్షలు పెరిగింది.
Read More »నడ్డా నక్రాలు ఆపు… ఈడ నిన్ను నమ్మే బక్రాలు ఎవ్వరూ లేరు’
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పచ్చి అబద్ధాల బిడ్డ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ లో నీళ్లు రాలేవంటున్నారని, ఇంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేల, ఎంపీ ల నియోజవర్గాల్లో ఎక్కడికైనా వెళ్దామని, మిషన్ భగీరథ నీళ్లు రాలేదంటే దేనికైనా సిద్ధమని నడ్డాకు సవాల్ విసిరారు. నీతి ఆయోగ్ నివేదికలు చదివితే తెలంగాణ, కేసీఆర్ గొప్పతనాలు తెలుస్తాయని …
Read More »తెలంగాణలో లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ..?విధిస్తారా..?
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలు ప్రసారమవుతున్నాయి.ఈ వార్తలపై సీఎం కేసీఆర్ క్లారిటీచ్చారు.లాక్డౌన్ ప్రస్తుతం అవసరం లేదని అధికారులు నివేదిక ఇచ్చినట్లు సీఎం కేసీఆర్ అన్నారు. వైద్యారోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన.. ఒమిక్రాన్ పట్ల భయం వద్దని, అదే సమయంలో అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. అందరూ మాస్కు ధరించాలన్నారు. కాగా, విద్యాసంస్థలకు ఈనెల 8 నుంచి 16 వరకు …
Read More »