వైఎస్ఆర్డీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలవనున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆమె ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభించాలని వైఎస్ షర్మిల భావించినప్పటికీ గవర్నర్ ను కలుస్తున్న దృష్ట్యా మంగళవారానికి వాయిదా వేసుకున్నారు.
Read More »కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం ఈ రోజు సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలో చేరడంతో ఆ పార్టీ …
Read More »కోమటిరెడ్డి బ్రదర్స్ కు అదిరిపోయే కౌంటరిచ్చిన రేవంత్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ చేరనున్న సంగతి విదితమే. అయితే ఈ ఉదాంతం తర్వాత రాజగోపాల్ రెడ్డి సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు.. మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిపై ఏ రేంజ్ లో విమర్షల వర్షం …
Read More »పాడి కౌశిక్ దెబ్బకు తోక ముడిచిన ఈటల
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు రావాలని ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిన విషయం విదితమే. కౌశిక్ రెడ్డి సవాల్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తోక ముడిచారు. ఈటల బహిరంగ చర్చకు రాకుండా.. వెనుకడుగు వేశారు. ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరిన మేరకు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం ఉదయం హుజురాబాద్ పట్టణంలోని …
Read More »తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు.
తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు. తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం పేట్ల బురుజు ప్రభుత్వ దవాఖానలో తల్లి పాల బ్యాంక్‌ను ప్రారంభించి మంత్రి మాట్లాడారు. తల్లిపాలు అంత శ్రేష్టమైనది ఏదీలేదు. అవి అమృతంతో సమానం. వీటిని మరి దేంతో పోల్చలేం అని మంత్రి స్పష్టం చేశారు. ఎన్.ఎస్.యూలో రోజుల …
Read More »కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికి మణిహారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికి మణిహారం.. అత్యాధునిక టెక్నాలజీతో ఈ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ రోజు మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి పర్యవేక్షించారు. దాదాపు సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని రూపొందించామని మంత్రి తలసాని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా …
Read More »వజ్రోత్సవాలు నిర్వాహణపై సీఎం కేసీఆర్ సమీక్ష
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుకల కార్యాచరణను మంగళవారం నాడు సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 2 వారాలపాటు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ప్రతిపాదనలను కేశవరావు కమిటీ సిద్ధం చేసింది. ఈ కమిటీతో నేడు కేసీఆర్ సమావేశం కానున్నారు. కమిటీ ప్రతిపాదనలను …
Read More »లోక్‌సభలో గళమెత్తిన ఎంపీ నామా నాగేశ్వరరావు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇవాళ లోక్‌సభలో మాట్లాడారు. ధరల పెరుగుదల అంశంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వంద శాతం ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. ధరల పెరుగుదల వల్ల కామన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారన్నారు. గోధుమ, బియ్యం. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గిందని, కానీ కానీ తెలంగాణలో వంద శాతం పెరిగిందన్నారు. ఎరువులపై మరింత భారం పెంచినట్లు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు …
Read More »Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం చెప్పిన డీకే అరుణ
Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం ఎంటో చెప్పారు మాజీ మంత్రి,బీజేపీ నేత డీకే ఆరుణ . ఆమె మీడియా తో మాట్లాడుతూ “కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య అవగాహన ఉంది.. ఎన్నికల సమయంలో మాత్రమే వారు ఓట్ల కోసం వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు గ్రామాల్లో కనీస వసతులు …
Read More »ఆగస్టు 2 న పింగళి పేరిట తపాల స్టాంప్ విడుదల
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతివేడుకల సందర్భంగా ఆగస్టు 2 న ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పింగళి రూపొందించిన ఒరిజనల్ జెండాను ఆరోజున ప్రదర్శించనున్నామని పేర్కొన్నారు. ఇవాళ పింగళి వెంకయ్య స్వగ్రామాన్ని సందర్శిస్తున్నానని వివరించారు.శత జయంతి వేడుకలకు పింగళి సభ్యులను ప్రధాని తరుఫున ఢిల్లీకి ఆహ్వానిస్తున్నట్లు, …
Read More »