దస్తురబాద్ మండలంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు.ఈ సందర్భంగా దేవునిగుడెం లో 20 లక్షల రూపాయలతో నిర్మించే గ్రామ పంచాయతీ నూతన భవనానికి భూమి పూజ చేశారు.అనంతరం ఆకొండపెట్ లో చెరువు మత్తడి మరమ్మత్తు పనులను ప్రారంభించి మున్యల్ లో మనా ఊరు మన బడి పథకం ద్వారా మంజూరైన ప్రభుత్వ పాటశాల అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ …
Read More »ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహా …
Read More »ఫ్లై ఓవర్, రోడ్ల అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే Kp సమీక్ష
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్-కొంపల్లి మున్సిపాలిటీలలో సుమారు రూ.205 కోట్లతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫ్లై ఓవర్, రోడ్ల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండిఏ, మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి, ఎస్.ఎన్.డి.పి, అర్బన్ ఫారెస్ట్, టీఎస్పిడిసీఎల్, కన్స్ట్రక్షన్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత భరోసా
చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్‌గూడకు చెందిన హారికకు అండగా నిలిచారు. ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న కవిత తక్షణమే స్పందించారు. నిజామాబాద్ పర్యటన సందర్భంగా హారికను కలిసిన ఆమె ఎంబీబీఎస్ కోర్సును పూర్తి …
Read More »నిజాం కాలేజీ ఇష్యూపై మంత్రి కేటీఆర్ స్పందన
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నిజాం కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్ అలాట్‌మెంట్ సమస్యపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బాసటగా నిలిచారు మంత్రి కేటీఆర్… ఈ విషయంలో జోక్యం చేసుకొని.. వెంటనే సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి సూచించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం.. హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత …
Read More »సోమా భరత్ కుమార్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనలు
తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన సోమా భరత్ కుమార్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం కు ముందు నష్టాలలో ఉన్న విజయ డైరీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవ, ప్రభుత్వం చేపట్టిన …
Read More »నవభారతానికి బోణీ-మునుగోడు విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ఆరంభం
ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్న వేళ.. చట్టాలు చట్టుబండలవుతున్న తరుణాన.. రాజ్యాంగబద్ధ సంస్థలు నిర్వీర్యమవుతున్న సమయాన.. ఆరాచక శక్తుల వికృత చేష్ఠలకు భారతీయ సమాజం విచ్ఛిన్నమవుతున్న పరిస్థితుల్లో ఆ కుట్రలకు చెల్లుచీటీ పలికేందుకు.. రక్కసి మూకలను తరిమికొట్టేందుకు పిడికిలి బిగించి జాతీయ రాజకీయాల బరిలో దూకిన భారత్ (తెలంగాణ) రాష్ట్ర సమితి.. మునుగోడులో విజయకేతనం ఎగరేసి బోణీ కొట్టింది. నవభారతానికి నాంది పలుకుతూ గులాబీ దండు జైత్రయాత్రను ప్రారంభించింది. కారు దూసుకెళ్లింది. మోదీ …
Read More »ప్రభుత్వానికి ప్రజాబలంతోపాటు దైవబలం తోడయింది- వినోద్ కుమార్
టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజాబలంతోపాటు దైవ బలం కూడా ఉన్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. తమకు మునుగోడులో గతంలోకంటే 25 వేల ఓట్లు అధికంగా వచ్చాయని చెప్పారు. ఉపఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ తన సాంప్రదాయ ఓట్లను కోల్పోయిందన్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్‌కు కనీసం డిపాజిట్ వస్తే తాను …
Read More »మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేపల పంపిణీ కార్యక్రమం
దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల ఆర్థిక పురోగతి కోసం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు.వర్దన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ చెరువులో ప్రభుత్వం 100శాతం సబ్సిడీతో అందిస్తున్న 1లక్షా 76వేల చేప పిల్లలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు వదిలారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు …
Read More »నాలా పనులు వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కెపి వివేకానంద్ కు విన్నపం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కౌసల్య కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద స్థానిక కార్పొరేటర్ ఆగం రాజు గారి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న వర్షపు నీటి నాలా పనులు వేగంగా పూర్తి చేయాలని, కాలనీ ఎంట్రెన్స్ నుండి మొదలుకొని మియాపూర్ మెయిన్ రోడ్డు వరకు బాక్స్ నాలాను …
Read More »