తెలంగాణలోకి వచ్చే దక్షిణ కొరియా పెట్టుబడులకు పూర్తి సహాకారం ఉంటుందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామరావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లో కొరియా దేశ ప్రతినిధి బృందం “ కొరియా కారవాన్”తో సమావేశం అయ్యారు. ప్రతి ఎడాది దేశంలోని రెండు మూడు రాష్ట్రాలను ఎంచుకుని స్ధానిక కొరియా రాయభార కార్యాలయం ఈ కొరియా కారవాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈసారి తెలంగాణను ఎంచుకుని ఇక్కడి పెట్టుబడి అవకాశాలు, …
Read More »తగిన జాగ్రత్తలు పాటించాలి
తాజాగా భారి వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులకు రాష్ట్ర ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశించారు. సితఫల్మందు డివిజన్ పరిధిలోని మేడి బావి, అన్నానగర్ ప్రాంతాల్లో రూ.40 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం పనులను అయన బుధవారం ప్రారంభించారు. అనంతరం పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షాల వల్ల కలిగిన ఇబ్బందుల పై ఆరా తీశారు. అధికారులతో సమీక్షించారు. ఈ …
Read More »నాందేడ్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున మహారాష్ట్రలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగడానికి తమకు అనుమతినివ్వాలని నాందేడ్ జిల్లాకు చెందిన పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, పలువురు రైతులు ఇటీవల ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సమావేశమై తమ అభిప్రాయాన్ని తెలిపిన సంగతి విదితమే. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వారికి హామీచ్చారు. ఈ క్రమంలో …
Read More »కాళేశ్వరంతో బంగారు తెలంగాణ ఖాయం
తెలంగాణలో కోటీ ఎకరాలకు సాగునీళ్ళివ్వడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించతలపెట్టిన మహోత్తర కార్యం కాళేశ్వరం నిర్మాణం.. అప్పటి నీళ్ల మంత్రి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో కేవలం మూడేళ్లలోనే నిర్మించిన అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరం. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొంబై తొమ్మిది శాతం పనులు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ప్రాజెక్టులు,పంపుహౌస్ లు నీళ్లతో కళకళలాడుతున్నాయి. ఇంతటి గొప్ప ప్రాజెక్టు …
Read More »తెలంగాణ హరితహారం భేష్-ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పాయెంగ్
తెలంగాణలో అటవీ శాతాన్ని.. పచ్చదనాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం హరితహారం. ఇప్పటికే కొన్ని కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటారు. నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే చర్యలను కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో విజయవంతమైన హరితహారం కార్యక్రమంపై ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పాయెంగ్ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ” తెలంగాణ …
Read More »టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పనితీరు భేష్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల టీటీడీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డిపై ప్రశంసలు కురిపించారు. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కల్సి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. వైవీ సుబ్బరెడ్డి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా రావాలని …
Read More »పోలవరం రివర్స్ టెండరింగ్ సాహసోపేతం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నిన్న సోమవారం హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరు రాష్ట్రాల గురించి.. మధ్య నెలకొన్న పలు అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్యాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి బాగా పనిచేస్తోన్నారు. రాష్ట్రానికి …
Read More »దేశంలో ఏకైక సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం సిద్దిపేట జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ లో పర్యటించారు. ఈ పర్యటనలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు మంత్రి హారీష్ రావు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,కలెక్టర్ వెంకట రెడ్డి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” వృద్ధులకు,వితంతువులకు ఆసరా రెండు వేల …
Read More »మంత్రి కేటీఆర్ భరోసా
తెలంగాణ రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలానికి చెందిన మేఘన అనే బాలిక గత కొంత కాలంగా వెన్నుముక సమస్యతో తీవ్రంగా బాధపడుతుండేది. తంగళపల్లిలోని ఇందిరానగర్లో సాంచాలు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆశోక్ కు లహారి అనే భార్య, భావన మరియు మేఘన ఇద్దరు కూతుళ్లు. భావన తొమ్మిది… మేఘన ఏడో తరగతి చదువుతున్నారు. …
Read More »తెలంగాణ,ఏపీ సీఎంల భేటీ అందుకేనా.?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న గోదావరి జలాలను తరలింపు విషయంపై చర్చించనున్నారు. శ్రీశైలానికి గోదావరి నీళ్లు తరలిస్తే అక్కడ నుంచి రాయలసీమకు పంపించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు కృష్ణా గోదావరి జలాలు …
Read More »