తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి విధితమే. ఇప్పటికే ఈ ఎన్నిక గురించి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నది. ఇరవై నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున …
Read More »రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గం భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రేపు అక్టోబర్ ఒకటో తారీఖున మంత్రి వర్గం భేటీ కానున్నది. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రగతిభవన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో సాయంత్రం నాలుగంటలకు ఈ భేటీ జరగనున్నది. ఈ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొనున్నట్లు సమాచారం. ఇందులో చర్చించి కొత్త రెవిన్యూ చట్టం గురించి కీలక నిర్ణయం తీసుకుంటారని అధికారక వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి రెవిన్యూ …
Read More »ఏ దేశమేగినా తెలుగును మరువకండి
మాతృభాష పరిరక్షణ కు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ఇంగ్లీష్ మోజులో తెలుగు భాష ప్రాధాన్యత తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివారం మధ్యాహ్నం సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని గొట్టిపర్తి గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూరేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జిల్లా …
Read More »హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు జరగనున్నది. వచ్చే నెల అక్టోబర్ 11,12వ తారీఖుల్లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ పేరిత అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానున్నది హైదరాబాద్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని హ్యూమనైజింగ్ డిజైన్ థీమ్ తో భారతదేశంలోనే తొలిసారిగా హెచ్ఐసీసీలో జరుగుతుంది. ఈ సదస్సు ద్వారా …
Read More »తెలంగాణలో ముందే దసరా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చాలా విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 56.4లక్షల మంది బతుకమ్మ చీరలను అందుకున్నారు. అయితే బతుకమ్మ చీరల పంపిణీ దసరా పండుగకు ముందు రోజు వరకు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మంత్రుల దగ్గర నుండి కార్యకర్తల వరకు …
Read More »బతుకమ్మ చీరెలను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీహెచ్ మల్లారెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జవహార్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులు ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలు ఎంతో సంబురంగా బతుకమ్మ వేడుకలను …
Read More »చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందాం
చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని రాష్ట్ర శాఖ మంత్రి హరీశ్‌రావు గారు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ మహిళ ఉక్కు మహిళని కొనియాడారు. ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు …
Read More »సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28నుంచి అక్టోబర్ 13వ తారీఖు వరకు పాఠశాలలకు దసరా సెలవులు. మొత్తం పదహారు రోజులు సెలవులిస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. జూనియర్ కళాశాలలకు మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ 9వరకు మాత్రమే సెలవులు. డిగ్రీ కళాశాలలకు మాత్రం ఈ నెల 28నుంచి సెలవులను ఇస్తున్నట్లు …
Read More »త్వరలో తెలంగాణలో నీరాస్టాల్
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతికై పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది. గత ఆరేళ్ళుగా టీఆర్ఎస్ సర్కారు అమలుచేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు ప్రతి గడపకు చేరుతున్నాయి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో నీరా స్టాల్ ఏర్పాటు చేయబోతున్నాం. అందుకు తగ్గట్లు …
Read More »అంబరాన్ని అంటిన బతుకమ్మ చీరెల పంపిణీ సంబురం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గత మూడేండ్లుగా చీరెలను పంపిణీ చేస్తున్న సంగతి విధితమే. అందులో భాగంగా ఈ ఏడాది కూడా మొత్తం పది రకాల డిజైన్లతో.. వంద రకాలతో కోటీకి పైగా బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు,ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు,కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చీరెలు అందుకుంటున్న ఆడబిడ్డలు పండక్కి పెద్దన్నలా చీరెలను పంపిణీ చేస్తున్నారు అని …
Read More »