తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలో దిగారు. ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొదటి రౌండ్ నుండి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి …
Read More »కాంగ్రెస్ కంచుకోటకు కారు బీటలు
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు అడ్డా.. అందులో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే కాంగ్రెస్ ఇలాఖా. అందులోనూ ఆ పార్టీ తెలంగాణ విభాగ అధ్యక్షుడు.. నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలుపొందడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో …
Read More »హుజూర్ నగర్ ఫలితాలపై కన్పించని ఆర్టీసీ సమ్మె ప్రభావం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత ఇరవై రోజులుగా పలు డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆర్టీసీ సిబ్బంది సమ్మె ప్రభావం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ గెలుపు కష్టమే అని పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మొదలైన ఉప ఎన్నికల …
Read More »హుజూర్ నగర్ లో చేతులెత్తేసిన కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ చేతులెత్తేసినట్లే కన్పిస్తుంది. ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరిగిన ఉప ఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగారు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. మొదటి రౌండ్ …
Read More »హుజూర్ నగర్లో దుమ్ము లేపుతున్న టీఆర్ఎస్
హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో కారుదే ప్రభంజనం. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి రౌండ్ నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై తన అధిక్యాన్ని ప్రదర్శిస్తునే ఉన్నాడు. ఇప్పటివరకు వెలువడిన ఆరు రౌండ్లు ఓట్ల లెక్కింపులో శానంపూడి సైదిరెడ్డి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై పదకొండు వేల ఓట్ల మెజారిటీతో …
Read More »మూడో రౌండ్లో అధిక్యంలో టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్లో అధిక్యం దిశగా దూసుకుపోతుంది. మొదటి రౌండ్లో 2,580ఓట్ల మెజారిటీని సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో రౌండ్ ముగిసే సరికి మొత్తం నాలుగు వేల ఓట్ల అధిక్యంలో ఉన్నాడు. తాజాగా మూడో రౌండ్ ముగిసే సరికి శానంపూడి సైదిరెడ్డి 6,500 ఓట్ల అధిక్యంతో టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు.
Read More »తెలంగాణ హోమ్ శాఖ కార్యదర్శి మార్పు
తెలంగాణ రాష్ట్ర హోం శాఖలో రెండు కీలక పదవుల్లో మార్పులు జరిగాయి. అందులో భాగంగా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిగా రవిగుప్తాను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత జైళ్ల శాఖ డీజీ సందీప్ శాండిల్య బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాజీవ్ త్రివేది ను నియమించింది. అయితే ప్రస్తుతం రవి గుప్తా తెలంగాణ అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్(టెక్నాలజీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Read More »ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పంతొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కార్మికుల డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ ఈడీలతో కూడిన ఆరుగురు అధికారులతో పాటుగా హైకోర్టు సూచించిన ఇరవై ఒక్క అంశాలను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ ఒకటి రెండ్రోజుల్లో అధ్యయనం …
Read More »యువతకు రోల్‌మోడల్‌గా మంత్రి కేటీఆర్
సోషల్‌మీడియాను సామాజిక మేల్కొలుపు కోసం వినియోగిస్తున్నారు ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనే కాదు, ప్రజాచైతన్య కార్యక్రమాలకు పిలుపునివ్వడంలోనూ ముందువరుసలో ఉంటున్నారు. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. అభాగ్యులకు అండగా నిలుస్తూ.. యువతకు రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు. మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. ట్విట్టర్‌లో క్రియాశీలకంగా ఉండే మంత్రి కేటీఆర్ సమాజంలో పొంచిఉన్న ప్రమాదాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల …
Read More »సీఎం కేసీఆర్ కు గుడి.. ఆపై సినిమా..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుడి కట్టించనున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో తాను ఈ మేరకు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని అవసరాల కోణంలో తాను మంత్రి హరీశ్‌రావుతో సఖ్యతగా ఉంటున్నట్లు తెలిపారు. త్వరలో ఓ సినిమా కూడా తీయబోతున్నట్లు …
Read More »