Home / Tag Archives: telanganacm (page 414)

Tag Archives: telanganacm

రేపు కరీంనగర్ కు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు కరీంనగర్ వెళ్లనున్నారు. కరోనా నివారణ చర్యలను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షించనున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ పై నగర ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలపై అధికారులతో చర్చించనున్నారు. మరోవైపు ఇండోనేషియా నుండి వచ్చిన కొందరు కరోనా బాధితులు కరీంనగర్ లో పర్యటించిన నేపథ్యంలో నగరంలోని ప్రజలందరికీ ప్రస్తుతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Read More »

అంగన్ వాడీలలో కరోనా వైరస్ నివారణ చర్యలు

పిల్లలు, బాలింతలు, గర్భిణీలుండే అంగన్ వాడీ కేంద్రాలలో, మినీ అంగన్ వాడీలలో కరోనా వైరస్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించాలని, ఎలాంటి నిర్లక్యానికి తావివ్వకూడదని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్  ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మీ పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9 గంటల నుంచి 11 గంటలలోపు వండి, వేడి, వేడిగా తల్లులకు, …

Read More »

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురండి.. మోదీకి కేటీఆర్‌ ట్వీట్‌

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు. విదేశాల్లోని భారతీయులంతా విమానాశ్రయాల్లోనే ఉండిపోయినట్లు సమాచారం అందుతోందని కేటీఆర్‌ తెలిపారు. మనీలా, రోమ్‌, సింగపూర్‌, కౌలాలంపూర్‌ విమానాశ్రయాల్లో ఉన్నట్లు సందేశాలు వచ్చాయి. వారందరినీ స్వస్థలాలకు పంపించేలా ఏర్పాట్లు చేయాలని కేటీఆర్‌ ప్రధాని మోదీకి వినతి చేశారు.

Read More »

తెలంగాణలోనే తొలిసారి

తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంటిఇంటికెళ్లి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇండోనేషియా నుండి కరీంనగర్ కు వచ్చిన పదకొండు మంది ప్రచారకుల్లో ఏడుగురికి కరోనా పాజిటీవ్ అని తేలడంతో అధికారులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి రామగుండం వచ్చిన సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్లో వాళ్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఎస్ 9 బోగీలో ఉన్నవాళ్లందరూ పరీక్షలు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. అటు నగరంలో 144సెక్షన్ …

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకి ఘన స్వాగతం

తెలంగాణ లో కామారెడ్డి జిల్లా టేక్రియాల్ క్రాస్ రోడ్డులో మాజీ ఎంపీ కవితకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు నిజామాబాద్‌కు బయలుదేరిన కవితకు దారిపొడవునా టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ కౌన్సిలర్లు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందల్వాయి వద్ద కూడా పార్టీ శ్రేణులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కవిత …

Read More »

తెలంగాణలో మరో కరోనా కేసు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదైంది. బ్రిటన్ దేశం నుండి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు రీపోర్ట్ వచ్చిందని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇప్పటికే ఐదు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక వ్యక్తి కోలుకుని గాంధీ ఆస్పత్రి నుండి డిశార్జి అయ్యాడు.

Read More »

హైదరాబాద్లో పలు పార్కులు మూసివేత

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌ పరిధిలోని దాని చుట్టుపక్కల ఉన్న పలు జిల్లాల్లో ఉన్న పార్కులు మూసివేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. లంబినీపార్క్‌, ఎన్టీఆర్‌గార్డెన్‌, ఎన్డీఆర్‌ మెమోరియల్‌, సంజీవయ్య పార్క్‌లను ఈ నెల 21వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలోని సభలు, సమావేశాలకు అనుమతులు రద్దు చేశారు. జలగం వెంగళరావు పార్కు, పబ్లిక్ గార్డెన్, జలవిహార్‌, నెహ్రూ …

Read More »

మంత్రి కేటీఆర్ పై కేంద్ర మంత్రి ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయంలో మూడో జరిగిన‘వింగ్స్‌ ఇండియా-2020’కార్యక్రమానికి సంబంధించి మినిస్టీరియల్‌ ప్లీనరీలో హర్దీప్‌సింగ్‌పూరి పాల్గొన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పూరి ప్రశంసల జల్లు కురిపించారు. కేటీఆర్‌ను యంగ్‌ అండ్‌ డైనమిక్‌ మినిస్టర్‌గా అభివర్ణించారు. నవభారత నిర్మాణానికి కేటీఆర్‌ ప్రతినిధిగా నిలుస్తారని కొనియాడారు. ‘వింగ్స్‌ ఇండియా’ నిర్వహణకు మంత్రి కేటీఆర్‌, ఆయన అధికారుల బృందం తమకు ఎంతగానో …

Read More »

సోషల్ మీడియాలో అతి చేస్తే చర్యలు తప్పవు-సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు. ఎవరు భయపడాల్సినవసరం లేదు. ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో మాత్రమే ఈ వైరస్ సోకుతుంది. ఇక్కడున్నవారికి అది సోకకుండా ఉండేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” సోషల్‌మీడియాలో కొందరు అతిగాళ్లు కరోనా వైరస్ గురించి తమ ఇష్టారీతిన ప్రచారంచేస్తున్నారని, అలాంటివారిపై కఠినచర్యలు తీసుకొంటామని సీఎం హెచ్చరించారు. వారిని …

Read More »

మార్చి 31 వరకు అన్ని మూసివేయాలి

తెలంగాణ రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మార్చి 31 వరకు మూసివేయాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు.నిన్న శనివారం సాయంత్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” ఈ నిర్ణయం శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందన్నారు. ఈ నిర్ణయాన్ని ఎవరు అధిగమించినా కఠినంగా వ్యవహరిస్తామని, ఆ విద్యాసంస్థ గుర్తింపు కూడా రద్దుచేస్తామని హెచ్చరించారు. వీటితోపాటు కోచింగ్‌సెంటర్లు, సమ్మర్‌క్యాంపులు మూసివేయాలని చెప్పారు. విద్యాసంస్థలను మూసివేసినప్పటికీ, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat