జోగినిలకు ఉపాధి కల్పించే విషయమై చొరవ చూపుతామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. జోగినిల సమస్యలపై నివేదికలు ఇవ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు కమిషన్ తరఫున ఇప్పటికే లేఖలు రాశామని వెల్లడించారు. పలువురు జోగినిలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. జోగినిల స్థితిగతులు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Read More »సచివాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు
కొత్త సచివాలయ భవనాన్ని ఏడాది కాలంలోనే సిద్ధం చేయాలన్న లక్ష్యంతో వేగంగా పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే దసరా రోజున పనులు ప్రారంభించి తదుపరి దసరా వరకు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది. దాదాపు 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడంతస్తుల భారీ భవనం, చుట్టూ పచ్చికబయళ్లు, రోడ్లు.. ఇంత పెద్ద ప్రాజెక్టు 12 నెలల్లో పూర్తి చేయటం అంత సులభం కానప్పటికీ, వీలైనంత తొందరలో …
Read More »తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన నిర్ణయాలివే…!
కేబినెట్ నిర్ణయాలు 1. తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టిఎస్ ఐపాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది. దీని వల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే ఇలా వస్తున్న పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని …
Read More »హైదరాబాద్ నుంచే కరోనాకు టీకా-మంత్రి కేటీఆర్
తెలంగాణ నుంచే కరోనా వైరస్‌కు తొలి టీకా వస్తుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న భారత్‌బయోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇవాళ సందర్శించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు డాక్టర్ ఎల్లా, శ్రీమతి సుచిత్రా ఎల్లా కూడా పాల్గొన్నారు. భారత్ బయోటెక్ …
Read More »కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనా వైరస్ సోకి మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు కుటుంబీకులు కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో పాజిటివ్‌గా రావడంతో విజయవాడ దవాఖానకు తరలించగా, అక్కడే కన్నుమూశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడుసార్లు ఆయన సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని తన సొంత గ్రామంలోనే …
Read More »మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం కృషి చేసిన రాజయ్య, అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా పనిచేశారు. ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని సిఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »వంగపండు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు- సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాశారు.. రాసి పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం…
కరోనా చికిత్స పేరుతో ప్రజల నుంచి సోమాజిగూడ డెక్కన్ ఆస్పత్రి లక్షల్లో వసూలు చేసింది. ఇప్పటికే ఈ ఆస్పత్రికి సంబంధించిన పలు సంఘటనలు వెలుగు చూశాయి. అయితే ఇలా పదే పదే కరోనా రోగులను ఇబ్బంది పెట్టడం, లక్షల రూపాయిలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆ ఆస్పత్రి యాజమాన్యానికి కేసీఆర్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. కరోనా వైద్యం అనుమతి రద్దు.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు డెక్కన్ ఆస్పత్రికి …
Read More »మంత్రి హారీష్ రావుకు రాఖీ కట్టిన టీఆర్ఎస్ మహిళ నేతలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి హరీష్‌రావుని కొండాపూర్‌లోని ఆయన నివాసంలో కలిసి టీఆర్‌ఎస్ మహిళా నేతలు రాఖీ కట్టారు. రాష్ట్ర ప్రజలకు హరీష్‌రావు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం సోదర సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని హరీష్‌రావు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఆత్మీయ రక్ష బంధన్‌తో పాటు, స్వీయ రక్షణ పాటించాలని హరీష్‌రావు సూచించారు.
Read More »మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన టీఆర్ఎస్ మహిళ నేతలు
రక్షాబంధన్ సందర్భంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు పార్టీ మహిళఆ నేతలు రాఖీ కట్టారు. మంత్రి సత్యవతి రాథోడ్, లోక్‌సభ సభ్యురాలు కవిత మాలోత్, ఎమ్మెల్యే సునీత రెడ్డి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు గుండు సుధారాణి తదితరులు మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి రాఖీ కట్టారు.
Read More »