వర్దన్నపేట కోనారెడ్డి పెద్ద చెరువు గండిని పరిశీలించి, అధికారులను ఆదేశించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.అనంతరం “ప్రజలు ఇళ్ళను ఖాళీ చేయాలి. అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వరద ఉధృతి తగ్గే వరకు అంతా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్దన్నపేట కోనారెడ్డి పెద్ద చెరువుకు గండి పడిన నేపథ్యంలో …
Read More »తెలంగాణలో కొత్తగా 1967 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 1967 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటీవ్ కేసుల సంఖ్య 99,391. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు వరకు మృతి చెందిన వారి సంఖ్య 737 మంది.మొత్తం డిశ్చార్జ్ అయినవారు 76967 మంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 21,687 గా ఉంది.హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు 15332 మంది.
Read More »మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్.. తెలంగాణ ప్రజాప్రతినిధులను వెంటాడుతూనే ఉంది.. ఇప్పటికే హోంమంత్రి, మంత్రులు, డిప్యూటీ స్పీకర్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. ఇలా చాలా మంది కరోనాబారినపడ్డారు.. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే సురేందర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఇవాళ ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో.. అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇక, మూడు, నాలుగు రోజుల క్రితం కూడా ఆయన …
Read More »వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన
వరుసగా కురిసిన వర్షాల వల్ల ఓరుగల్లు నగరం జలమయం కావడంతో అక్కడి పరిస్థితులను ను సమీక్షించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఓరుగల్లు నగరం లో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి శ్రీ కేటీఆర్, వైద్య – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, …
Read More »అక్రమ నిర్మాణాలతోనే వరంగల్ కు ముంపు సమస్య
వరంగల్ అర్బన్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్, సహచర మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి వరంగల్ నగరాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో దిగారు. అక్కడి నుంచి నయీం నగర్, కేయూ 100ఫీ ట్ రోడ్ మొదలైన వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. …
Read More »ప్రగతి భవన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హైదరాబాద్లోని ప్రగతి భవన్‌లో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ ముఖ్యనాయకులు, అధికారులతో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారి చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఆయన వెంట పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ …
Read More »రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ
రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాలు ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ జిల్లాకే కాక తెలంగాణకే తలమానికం అని పేర్కొన్నారు. అనంతరం శంకర్ పల్లి మండలంలోని మొకీల చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను మంత్రి ఎగురవేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్ …
Read More »జలవనరుల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని సాగునీటి వసతులు పెరిగాయని సీఎం అన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపు హౌజులు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిందని సీఎం అన్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జల …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డీజీపీ మహెందర్ రెడ్డి విజ్ఞప్తి
సోషల్ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో తప్పడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తినష్టానికి కారణమయ్యాయో తెలుసుకోవాలని కోరారు. శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని ప్రజలను కోరుతున్నామని అన్నారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తారని, అలాంటివారిపై …
Read More »ప్రయివేట్ ఆసుపత్రులకు తెలంగాణ సర్కారు కీలక ఆదేశాలు
కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని పేర్కొంది. పీపీఈ కిట్లు, మందుల ధరలు ఆసుపత్రిలో డిస్ ప్లే చేయాలంది. డిశ్చార్జ్ సమయంలో పూర్తి వివరాలతో బిల్లు ఇవ్వాలి నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Read More »