ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం …
Read More »తెలంగాణొస్తే ఏమొచ్చింది? అంటే..?
నీళ్లు ఆ గ్రామస్వరూపాన్ని మార్చివేశాయి. కరువు ఛాలయను కడిగేశాయి. ప్రజల జీవన స్థితి గతులను మార్చివేశాయి. వలసలకు అడ్డుకట్ట వేశాయి. రెండేండ్లలోనే ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది తుంగతుర్తి నియోజకవర్గంలోని వర్ధమానుకోట గ్రామం. దశాబ్దాల తరబడి ఎండిపోయిన చెరువులు, నెర్రెబారిన నేలలు.. కరువు కాటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆ గ్రామం నేడు ఊహించనిస్థాయిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఉపాధి కోసం వలసబాట పట్టిన వారంతా తిరిగి సొంతగూడుకు చేరి …
Read More »సోమవారం నుండి రైతుబంధు
యాసంగి సీజన్ రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,300 కోట్ల నిధులు జమ చేయడానికి సిద్ధమైంది. ఈ యాసంగిలో దాదాపు 59.32 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేయనున్నారు. గతేడాది 57.62 లక్షల మంది పట్టాదారులకు రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయగా.. ఈ సీజన్‌లో 1.70 లక్షల మంది …
Read More »మానవాళికి మార్గదర్శకం భగవద్గీత : ఎమ్మెల్సీ కవిత
నిత్యం గీతా పఠనం చేయడం ద్వారా జీవితంలో సన్మార్గంలో పయనిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరిగిన ‘గీతాజయంతి మహోత్సవం’లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ముందుగా గో మాతను పూజించిన ఎమ్మెల్సీ కవిత, భారతీయ సంస్కృతిలో గో పూజకు ఎంతో విశిష్టత ఉందన్నారు. భగవద్గీతలోని ఎన్నో సూక్ష్మమైన, ఆధ్యాత్మికమైన అంశాలను వివరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలున్నా …
Read More »యాసల బాలయ్యమృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించిన బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య(82) మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాలయ్య మరణం చిత్రకళారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బాతిక్ చిత్ర కళ ద్వారా బాలయ్య పల్లె జీవన సౌందర్యాన్ని కళ్ళకు కట్టారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు, గ్రామీణ జానపద చిత్రాలను తన …
Read More »పశుసంవర్ధక శాఖ అధికారులతో మంత్రి తలసాని ఉన్నతస్థాయి సమీక్ష
జీవాలకు మరిన్ని మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ది, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా 1962 టోల్ ఫ్రీ తో సంచార పశువైద్య శాలల ద్వారా జీవాలకు అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. ఈ …
Read More »డబుల్ బెడ్రూం ఇండ్లపై మంత్రి హారీష్ శుభవార్త
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంటి స్థలం ఉన్న పేదలు, గుడిసె వాసులు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బుధవారం జిల్లాలోని నారాయణ ఖేడ్ నియోజక వర్గంలో పర్యటించారు. శంకరంపేట మండల కేంద్రం తిరుమలాపూర్ శివారులో ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలతో నిర్మించనున్న వంద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి భూమి పూజ …
Read More »మానవత్వం చాటుకున్న క్వాలిస్ డ్రైవర్ మల్లేశం
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు హైవేపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. కొండగట్టు హై వే పైన ఉన్న మారుతీ టౌన్ షిప్ వద్ద ఎదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొనడంతో ఖానాపూర్ కు చెందిన మొగిలి అనే డ్రైవర్ మృతి చెందగా మరో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స …
Read More »పీవీ దేశ చరిత్రలో నిలిచిపోతారు : సీఎం కేసీఆర్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనను కేసీఆర్ స్మరించుకున్నారు. నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో పీవీ చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాలలో పీవీ ప్రవేశపెట్టి, అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారతదేశం అనుభవిస్తున్నదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అంతర్గత భద్రత వ్యవహారాల్లోనూ, విదేశాంగ వ్యవహారాల్లోనూ మాజీ ప్రధాని …
Read More »రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటాం: సీపీ సజ్జనార్
బీజేపీ నాయకులు పోలీసుల నైతికత దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. పోలీసుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదుర్కోక తప్పదన్నారు. పోలీసుల మీద, డీజీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మహారాష్ట్ర నుంచి …
Read More »