తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగాన్ని 2 గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11:30 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1:30 గంటలకు హరీశ్‌రావు తన ప్రసంగాన్ని ముగించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలను హరీశ్‌రావు వివరంగా చదివి వినిపించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు పోతున్నదని స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు లేని …
Read More »బీజేపీ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ.. బడ్జెట్ సెషన్స్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక మంత్రి హరీష్‌రావు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా బీజేపీ సభ్యులు ఈటల రాజేదర్, రఘునందన్‌రావు, రాజాసింగ్ పదేపదే అడ్డుతగిలారు. బడ్జెట్ ప్రసంగం సజావుగా సాగేందుకు ఇబ్బంది కావడంతో బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వారిని సస్పెండ్ చేశారు. బడ్జెట్ …
Read More »అసెంబ్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ ఛాంబర్‌లో పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం కలిశారు. సీఎం వెంట మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్‌ను మంత్రి హరీశ్‌రావు సభలో ప్రవేశపెట్టనున్నారు.
Read More »ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హారీష్ రావు ప్రత్యేక పూజలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హరీశ్‌రావుతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ్నుంచి నేరుగా హరీశ్‌రావు అసెంబ్లీకి బయల్దేరనున్నారు.కోకాపేట్‌లోని తన నివాసం వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని …
Read More »నేటి నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్‌కు టీఆర్ఎస్ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయా నియోజకవర్గాల్లో వారి మద్దతుదారులు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
Read More »