కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వంపై,సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు కూడా చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో …
Read More »దేశానికి కావాల్సింది కశ్మీర్ ఫైల్స్ కాదు.. డెవలప్‌మెంట్ ఫైల్స్ -సీఎం కేసీఆర్
తెలంగాణ భవన్ లో గులాబీ దళపతి,సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులతో సహా పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కాశ్మీర్ ఫైల్స్ …
Read More »Big Breaking News-ఈ నెల 21న TRSLP భేటీ.. ఎందుకంటే..?
ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరపాలని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో యాసంగి …
Read More »తెలంగాణలో యథావిధిగా రైతుబంధు.. దశల వారీగా దళిత బంధు..
తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ధాన్యం కొనుగోళ్లు, గనుల ప్రయివేటీకరణ, ఇతర అంశాలపై చర్చించారు. కేంద్రంపై పోరులో భవిష్యత్ కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా సీఎం ఎమ్మెల్యేలతో చర్చించారు.రైతుబంధు పథకం యథావిధిగా కొనసాగుతోందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇతర పంటలు వేసేలా రైతుల్లో చైతన్యం తేవాలని సూచించారు. దళిత బంధుపై విపక్షాల ప్రచారం తిప్పికొట్టాలి. ఈ పథకాన్ని …
Read More »నేడు టీఆర్‌ఎస్ కీలక భేటీ -పార్టీ ప్రజాప్రతినిధులతో గులాబీ దళపతి కేసీఆర్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం శుక్రవారం తెలంగాణభవన్‌లో జరుగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు జరుగనున్న ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి జిల్లా కమిటీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లతోపాటు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా …
Read More »టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం : TRS Wp కేటీఆర్
ఈ నెల 25న హైటెక్స్ వేదికగా జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.అక్టోబర్ 25న ఉదయం 10 గంటలకు ప్లీనరీ ప్రారంభం అవుతుంది అని కేటీఆర్ తెలిపారు. 6 వేల పైచిలుకు ప్లీనరీ ప్రతినిదులకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీ ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ …
Read More »రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మనదే కీలక పాత్ర
గతంలో మాదిరిగా అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు వెళ్లే ఆలోచన లేదు. మన ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నది. ఈలోపు మనం చేయాల్సిన పనులున్నాయి. వీటిని పూర్తి చేసుకుందాం. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో మనమే కీలకపాత్ర పోషించేస్థాయికి ఎదుగుతాం. అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు. గతంలో అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరగడం వల్ల కొన్ని సీట్లు కోల్పోయాం. ఈసారి ఆ ప్రసక్తే ఉత్పన్నం కానివ్వం. అనేక …
Read More »పీసీసీ కొనుక్కున్నోడు.. టికెట్లు అమ్ముకోడా.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌కు వచ్చాడా.. ఫామ్ హౌస్‌లో ఉన్నాడా కాదు.. పనులు అవుతున్నాయా? లేదా? చూడాలన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకొని తాగుబోతు అనడం సరికాదన్నారు. ఎవర్నీ వదిలి పెట్టం.. వాళ్ళ బాగోతం మొత్తం తెలుసు బయట పెడతాం.. అవసరమైతే రాజద్రోహం కేసులు పెడుతామని …
Read More »ఢిల్లీలో నూతన TRS భవనం తెలంగాణ ఆత్మ గౌరవ, అస్తిత్వ చిహ్నం- మంత్రి కేటీఆర్
రెండు దశాబ్దాల క్రితం జలదృశ్యం వద్ద ఉద్యమ నాయకుడు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా ఊపిరి పోసుకున్న టీఆర్ఎస్ ఇవ్వాళ అదే నాయకుడి చేతుల మీదుగా దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరగడం ఒక చారిత్ర సన్నివేశమని, ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రతోపాటు టిఆర్ఎస్ పార్టీ చరిత్రలోనూ శాశ్వతంగా నిలిచిపోతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు అన్నారు. ఈ సందర్భంగా …
Read More »తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గులాబీ జెండా పండుగ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా పండుగను టీఆర్‌ఎస్ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించాయి. పల్లెపల్లెనా, వాడవాడనా నేతలు టీఆర్‌ఎస్ జెండాలను ఎగుర వేసి.. మిఠాయిలు పంచిపెట్టారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జరిగిన వేడుకల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొని, టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. 4వ, 23, 24వ వార్డుల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. నల్లగొండలో గుత్తా.. నల్లగొండ జిల్లాలో జరిగిన వేడుకల్లో మాజీ శాసనమండలి చైర్మన్ …
Read More »