బొజ్జ గణపతులందు ఖైరతాబాద్ గణపతి వేరు! ఏడాదికొక అడుగు చొప్పున ఎత్తు పెరుగుతూ తొండమునేకదంతంతో.. కొండంత రూపంతో భక్తులను కాచేభవహరుడు ఆ స్వామి!! 2019లో అక్కడ 65 అడుగుల ఎత్తైన గణేశుడి ప్రతిమను రూపొందించిన నిర్వాహకులు.. ఈసారి కరోనా నేపథ్యంలో కేవలం 9 అడుగుల ఎత్తుతో ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా తీర్చిదిద్దుతున్నారు. ఆ స్వామికి అటూ ఇటూ లక్ష్మి, సరస్వతి అమ్మవార్లు కొలువుదీరనున్నారు
Read More »తెలంగాణలో 80వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 389 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 80,751కి చేరాయి. వైరస్ ప్రభావంతో మరో 10 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 637కి చేరింది. ప్రస్తుతం 22,528 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజు 11,609 …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కరోనా పాజిటీవ్
తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌కు కరోనా సోకింది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ సతీమ ణి, కుమారుడికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే, తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని వీజీ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నామని పేర్కొన్నా రు. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్నానని, అక్కడకు వచ్చిన మరో ఎమ్మెల్సీ నిమ్స్‌లో చేరినట్లు తెలియడంతో తనతో పాటు కుటుంబ సభ్యులు …
Read More »తెలంగాణలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరగుతున్నాయి.. వరుసగా మూడో రోజు 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. కరోనా నుంచి కొత్తగా 1091 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య …
Read More »మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా
తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబసభ్యులకు, పనిమనిషికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు
Read More »కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. జూలై 29న అనారోగ్యంతో నిమ్స్‌లో చేరిన నంది ఎల్లయ్య.. శనివారం ఉదయం 10.30 గంటలకు తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్‌లో చేరగా పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. 10 రోజుల పాటు చికిత్స అనంతరం మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నంది ఎల్లయ్య లోక్‌సభ ఎంపీగా ఆరు సార్లు గెలుపొందారు. …
Read More »తెలంగాణలో 75వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 2,207 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 75,257కు చేరింది. కరోనా నుంచి కొత్తగా 1136 మంది పూర్తిగా కోలుకున్నారు .. డిశ్చార్జి అయినవారి సంఖ్య 53,239గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 12 మంది మృతి చెందడంతో.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 601కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,417 …
Read More »తెలంగాణలో కొత్తగా 1,286 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,286 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 391, రంగారెడ్డి జిల్లాలో 121 నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 68,946 కేసులు నిర్ధారణ కాగా, ఇందులో 18,708 యాక్టివ్ కేసులు ఉండగా, 49,675 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 563కు …
Read More »తెలంగాణలో కరోనా కేసులెన్ని?
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1891 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,677కి చేరింది.. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 18,547కి చేరింది. ఇప్పటివరకు గడిచిన 24 గంటల్లో 10 మంది కరోనా వల్ల మరణించారు.. మొత్తం మృతుల సంఖ్య 540కి చేరింది. మొత్తం 47,590 మంది వైరస్ నుంచి కోలుకున్నారు ..గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో 19,202 టెస్టులు చేయగా మొత్తం …
Read More »తెలంగాణ బీజేపీ కమిటీ ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర బీజేపీ శాఖ కొత్త పదాధికారులను, మోర్చా రాష్ట్ర అధ్యక్షులను నియమించింది. మాజీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు వివిధ జిల్లాల బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు జనరల్ సెక్రటరీలను, సెక్రటరీలను నియమించింది. యువ మోర్చాకు భాను ప్రకాశ్, మహిళా మోర్చాకు గీతా మూర్తి కిసాన్ మోర్చాకు శ్రీధర్ రెడ్డితో పాటు ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ మైనార్టీ మోర్చాలకు అధ్యక్షులను నియమించింది.
Read More »