Home / Tag Archives: telangana (page 38)

Tag Archives: telangana

హైద‌రాబాద్‌కు చేరుకున్న క‌రోనా టీకా

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకా రాష్ర్టానికి రానే వ‌చ్చింది. మంగ‌ళ‌వారం ఉద‌యం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ట్ర‌క్కుల్లో పుణె ఎయిర్‌పోర్టుకు త‌ర‌లించారు. అక్క‌డ్నుంచి ప్ర‌త్యేక కార్గో విమానంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను శంషాబాద్ విమాన‌శ్ర‌యానికి త‌ర‌లించారు. 6.5 ల‌క్ష‌ల డోసుల కొవిడ్‌ టీకాలు ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో రాష్ర్టానికి చేరుకున్నాయి. మ‌రికాసేప‌ట్లో శంషాబాద్ నుంచి కోఠిలోని శీత‌లీక‌ర‌ణ కేంద్రానికి టీకా డోసుల‌ను త‌ర‌లించ‌నున్నారు. కోఠి ఆరోగ్య కార్యాల‌యంలో …

Read More »

ఈనెల 16 నుంచి తెలంగాణలో వ్యాక్సినేషన్

తెలంగాణలో ఈనెల 16 నుంచి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్‌ తర్వాత రియాక్షన్‌ ఉంటే వైద్య చికిత్స అందిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రజలకు కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. వ్యాక్సిన్‌ వేయించే బాధ్యత సర్పంచ్‌లు, కార్యదర్శులు తీసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. ముందుగా ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది, పోలీసు, భద్రతా బలగాలకు టీకా వేయనున్నారు.  ఆ తర్వాత 50ఏండ్లు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధులతో …

Read More »

హైద‌రాబాద్‌లో మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ భారీ పెట్టుబ‌డులు

హైద‌రాబాద్‌లో మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. న‌గ‌రంలో గ్లోబ‌ల్ కేప‌బిలిటీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు మాస్ మ్యూచువ‌ల్ సంస్థ ప్ర‌క‌టించింది. అమెరికా వెలుపల రూ. వెయ్యి కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది.

Read More »

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ నిరాకరణ

ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవీణ్ రావు కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి,టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు బెయిల్ నిరాకరించింది. సికింద్రాబాద్ కోర్టు. 3 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది అఖిలప్రియ. సీన్ రీ- కక్షతో పాటు, కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కోర్టు బెయిల్ …

Read More »

తెలంగాణలో కొత్తగా 351 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 351 కరోనా కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,784కు చేరగా, 1565 మంది మరణించారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 2,83,463 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 4756 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, నిన్న కొత్తగా 415 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2584 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. …

Read More »

నిమ్స్ లో మేఘా ఆధునిక సదుపాయాలతో అంకాలజీ

పేద, మధ్యతరగతి ప్రజల కోసం మేఘా ఇంజనీరింగ్‌ నిమ్స్ లోని అంకాలజీ భవనాన్ని అభివృద్ధి చేసింది. కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద తన వంతు బాధ్యతగా క్యాన్సర్‌తో బాధపడే వారికోసం అత్యాధునిక సదుపాయాలతో కార్పోరేట్‌ హాస్పిటల్స్ కు దీటుగా అంకాలజీ భవనాన్ని తీర్చిదిద్దింది. ప్రభుత్వ వైద్య సంస్థ నిమ్స్ లో క్యాన్సర్‌ చికిత్స విభాగం పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి అవసరమైన భవన, వైద్య యంత్రాలు, బెడ్లు తదితర సౌకర్యాలను ఎంఈఐఎల్‌ …

Read More »

గ్రేటర్లో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న

తెలంగాణ రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ శ‌నివారం న‌గ‌రంలో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా దోమ‌ల‌గూడ‌లో జోన‌ల్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ప‌నుల‌కు, నారాయ‌ణ‌గూడ‌లో మోడ్ర‌న్ మార్కెట్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో క‌లిసి శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ రెడ్డి, ‌ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, అంబ‌ర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్‌, జీహెచ్ఎంసీ మేయ‌ర్ …

Read More »

తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా హిమా కోహ్లీ ప్ర‌మాణం

తెలంగాణ రాష్ర్ట‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లీ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భ‌వ‌న్‌లో జ‌స్టిస్ హిమా కోహ్లీ చేత‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరుకాగా, శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో పాటు హైకోర్టు న్యాయ‌మూర్తులు హాజ‌ర‌య్యారు. ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం ముగిసిన అనంత‌రం జ‌స్టిస్ హిమా …

Read More »

జనం పాటల జజ్జనకరి జనారే.. సిరిసిల్ల శిరీష మనోగతం మీకోసం..!

మూడేండ్ల కిందట.. ఆమె ఒక సాధారణ యువతి. వాడకట్టు దోస్తులతో అచ్చెనగూళ్లో అష్టాచెమ్మో ఆడుకుంటా ముచ్చటపడే అమ్మాయి. కానీ ఇప్పుడు.. ‘సెల్ఫీ ప్లీజ్‌’ అని సెలబ్రిటీలు సైతం అడుగుతుండ్రు. ఇంతలో ఎంత మార్పు కదా? పల్లె పాటలే ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టినయి. ‘అత్తగారింటికీ కొత్తగా వోతున్నా ఉయ్యాలో టుంగుటుయ్యాలో’ అంటూ తీరొక్క పాటలతో తీన్మార్‌ ఆడిస్తున్నది పల్లె పాటల ఆణిముత్యం శిరీష.  శిరీష పాట వింటే పల్లెదనం కండ్ల …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గా ఎన్నికైన మొదటి సారి నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఆనాడు అశోక చక్రవర్తి చెట్లు నాటితే ఈనాడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటించి దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat