తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని ఆర్మూరు మండలానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లుగా వారు తెలిపారు
Read More »తెలంగాణలో పది పరీక్షల నిర్వాహణపై క్లారీటీ
తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా? అనే అంశంపై విద్యార్థుల్లో సందేహం ఉంది. అయితే మే 17వ తేదీ నుంచి పది పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించి, …
Read More »తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచించారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 214 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,92,835కి చేరింది. 1586 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 3,781 యాక్టివ్ కేసులున్నాయి.. చికిత్స నుంచి కోలుకుని 2,86,898 మంది డిశ్చార్జ్ అయ్యారని …
Read More »తెలంగాణలో కొత్తగా 256కరోనా కేసులు
తెలంగాణలో నిన్న 31,486 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,92,128కి చేరింది. ఇందులో 4,005 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 2,86,542 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు మృతిచెందగా, మొత్తం 1,581 కరోనా మరణాలుసంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 75,15,066 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.
Read More »తెలంగాణలో కరోన తగ్గుముఖం
తెలంగాణలో నిన్న 21,893 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య సంఖ్య 2,91,872కి చేరింది. ఇందులో 4,049 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 2,86,244 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు మృతిచెందగా, మొత్తం 1,579 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 74,83,580 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.
Read More »తెలంగాణలో 324కేంద్రాల్లో నేడు కొవిడ్ టీకాలు
తెలంగాణ వ్యాప్తంగా 324 కేంద్రాల్లో నేడు కొవిడ్ టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు ఉన్నతాధికారులు. ప్రతి సెంటర్లో 50 మంది వ్యాక్సిన్ వేసుకోనున్నారు. టీకా తీసుకొనే వైద్య సిబ్బంది వివరాలు ఇప్పటికే కొవిన్ సాఫ్ట్ వేర్ లో నమోదైయ్యాయి..
Read More »సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్(CDS) భవనాన్ని పరిశీలించిన మంత్రి కొప్పుల
హైదరాబాద్ రెహ్మత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణంలో ఉన్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం (CDS) ను భవన నిర్మాణాన్ని సందర్శించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా సీఎం కెసిఆర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీ సర్కిల్ కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రూ 26 కోట్ల వ్యయంతో …
Read More »భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కవిత పాల్గొన్నారు . అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. చెడు అంతా భోగి మంటల్లో కాలిపోవాలన్నారు. తెలంగాణలోనే కాదు, దేశం నుంచి కరోనా వెళ్లిపోవాలన్నారు. సంపదలను ఇచ్చే పండుగ సంక్రాంతి అన్నారు. ఇకపై ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు
Read More »తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కేసులతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,640కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. మంగళవారం కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,571కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 394 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి …
Read More »పంట దిగుబడి పెంచిన తమన్నా..కాజల్..?
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. కావాలంటే ఈ స్టోరీ చదవండి..పంట చేతికొచ్చే సమయానికి పక్షులు, పశువులు తినకుండా, నరదిష్టి తగులకుండా పంట చేలల్లో దిష్టిబొమ్మలు పెడుతుంటరు. రకరకాల బొమ్మలు తయారుచేసి చేన్లలో పెడితే మనుషుల దృష్టి వాటిమీద పడి పంట దిగుబడి పెరుగుతుందని నమ్ముతరు. కానీ సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు పంటకు దిష్టి తగులకుండా…ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Read More »