తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రేటు ఘాటెక్కింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం తేజా రకం, డీలక్స్ రకం మిర్చి గరిష్టంగా క్వింటాల్ రూ.13,700 పలికింది. నిన్న ఒక్కరోజే రైతులు 50 వేల మిర్చి బస్తాలను మార్కెట్ కు తీసుకొచ్చారు. దీంతో మార్కెట్ మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. మరోవైపు పత్తిని గరిష్ఠంగా క్వింటాల్ రూ.6 వేలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్వింటాల్ పత్తికి కేంద్రం మద్దతు ధర రూ. 5,825గా …
Read More »తెలంగాణలో కందులకు రికార్డు ధర
తెలంగాణలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో కందులకు రికార్డు స్థాయి ధర పలికింది . ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ కు రూ.6 వేలు ఉంటే ట్రేడర్లు రూ.7,129 చెల్లించి కొనుగోలు చేశారు రాష్ట్రంలో ఇదే రికార్డు ధర అని అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో క్వింటాల్‌కు రూ.6,675, ఏనుమాములలో రూ.6,476 ధర పలికింది. సకాలంలో వానలు పడటం, వాతావరణం అనుకూలించడంతో పంట దిగుబడి పెరిగింది
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘కోటి వృక్షార్చన’ పోస్టర్ విడుదల
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న , రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు, ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్.సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం కేసీఆర్ గారి సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు కోటి మొక్కలను నాటే ‘కోటి వృక్షార్చన’ …
Read More »ప్రేమ పేరుతో నరకం
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు బాలికను బలి తీసుకున్నాడు. బండి రాజు అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఓ బాలికను వేధించేవాడు. ఆమెపై అత్యాచారం చేసి.. పురుగుల మందు తాగించాడు. అనంతరం తానూ తాగాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది. ప్రేమ పేరుతో నరకం చూపించాడు’ అంటూ ఆ బాలిక చివరిమాట చెప్పి ఊపిరి వదిలింది.
Read More »హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగర వాసులకు త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు కనువిందు చేయనున్నాయి. మరో రెండు నెలల్లో సిటీ రోడ్లపై దూసుకుపోనున్నాయి. ప్రయోగాత్మకంగా డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈనెల 18న ప్రీ బిడ్ నిర్వహించి, బస్సులు ఎలా ఉండాలన్న విషయాన్ని ఆ సమావేశంలో తయారీదారులకు వివరించనుంది.
Read More »పెద్దపల్లి కి అత్యవసర ప్రతిస్పందన అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ” GIFT A SMILE ” లో భాగంగా తన స్వంత డబ్బులతో అందించిన అత్యాధునిక అంబులెన్స్ ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ కేటీఆర్ గారు ప్రారంభించారు. శుక్రవారం ప్రగతిభవన్ లో అంబులెన్స్ ను గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసరి పెద్దమనసుతో నియోజక …
Read More »తెలంగాణలో కొత్తగా 147 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 147 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,93,737కు పెరిగింది.మహమ్మారితో ఒకరు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 1593 మంది చనిపోయారు. తాజాగా 399 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఆరోగ్యవంతులైన వారి సంఖ్య 2,89,325కు చేరింది. ప్రస్తుతం 2,189మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా GHMC పరిధిలో 32, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు నమోదు అయ్యాయి. 8 జిల్లాల్లో పాజిటివ్ కేసులు లేవు.
Read More »తిరుమలలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బుధవారం దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. తన మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలను పొంగులేటి గారి దంపతులకు అందజేశారు. స్వామివారి దర్శనం …
Read More »తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,93,590కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 1,589కి చేరింది. ఇప్పటివరకు 2,88,926 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 3,072 యాక్టివ్ కేసులు ఉన్నాయి వీరిలో 1,543 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.
Read More »తెలంగాణలో కొత్తగా 148 కరోనా కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 148 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,93,401కి చేరింది. తాజాగా కరోనాతో ఒకరు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,590కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 3,234 ఉండగా వీరిలో 1,697 మంది హోంఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,88,577 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Read More »