స్వచ్ఛభారత్ మిషన్ కింద స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతాలను గుర్తించాలన్న ప్రధాని మోదీ సూచనతో అధికారులు 12 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేశారు. సాంచీ స్థూపం (MP), గోల్కొండ కోట(TS), దాల్ సరస్సు (శ్రీనగర్), అజంతా గుహలు (MH), ఆగ్రా కోట(UP), కాళీ ఘాట్(WB) కుంభల్ కోట(RJ), జైసల్మేర్ కోట (RJ), రామ దేవా (RJ), రాక్ గార్డెన్ (చండీగఢ్), బాంకే బిహారీ ఆలయం(UP), సూర్య దేవాలయం (OD)ను గుర్తించారు.
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి టీటీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో మద్దతు అంశంపై అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే హైదరాబాద్ – రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు …
Read More »మళ్లీ కరోనా గజగజ
హమ్మయ్య.. కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరిపీల్చుకొనేలోపే మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. ప్రజల అలసత్వాన్ని ఆసరాగా, అజాగ్రత్తను ఆయుధంగా చేసుకొని విజృంభిస్తున్నది. ఫలితంగా దేశంలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఒక్కరోజే (శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు) దేశంలో 13,993 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 22 రోజులతో పోల్చితే ఒక్కరోజులో వైరస్ బారిన పడ్డవారి సంఖ్యాపరంగా ఇదే …
Read More »తెలంగాణలో హిందూ రాజ్యం స్థాపిస్తాం -బండి సంజయ్
2023లో తెలంగాణలో హిందూ రాజ్యాన్ని స్థాపిస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ అన్నారు. భవిష్యత్ లో గోల్కొండ కోటపై ఎగిరేది కాషాయ జెండానేనన్నారు. తెలంగాణలో ఖాసీం రజ్వీ వారసుల రాక్షస పాలన సాగుతుందన్న ఆయన.. హిందువులందరూ ఓటు బ్యాంకుగా మారాలన్నారు. నిఖార్సైన హిందువుననే సీఎం కేసీఆర్ శివాజీ జయంతి వేడుకలు ఎందుకు జరపలేదని ఆయన ప్రశ్నించారు
Read More »సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో తెలుగోళ్లుండరా..?
సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) లోకల్ ప్లేయర్లను పట్టించుకోవట్లేదు. కేవలం పేరులో మాత్రమే హైదరాబాద్ ఉంది కానీ తెలుగు ఆటగాళ్లకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ప్రతి టీం తమ రాష్ట్రానికి చెందిన ప్లేయర్లను తీసుకుంటే హైదరాబాద్ మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. ఇటీవల వేలంలో 14 మంది తెలుగు ప్లేయర్లు పోటీ పడితే ఒక్కరినీ తీసుకోలేదు. భగత్ వర్మ హరిశంకర్ రెడ్డిని CSK, యుధ్ వీర్ సింగు MI, భరత్ ను …
Read More »తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,113కి చేరింది. ఇందులో 1,700 యాక్టివ్ కేసులు ఉండగా.. 658 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటివరకు 2,93,791 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఇద్దరు చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 1,622కి చేరింది.
Read More »గ్రేటర్ మేయర్ మద్ధతుదారులకు రూ.6లక్షలు జరిమానా
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కొత్త మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె మద్దతుదారులు పలువురు నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనధికారికంగా వాటిని ఎలా పెడతారంటూ నెటిజన్లు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు. ఈవీడీఎం విభా గం శనివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తించారు. మొత్తం 30 …
Read More »డబ్బు ఆశచూపి బాలికపై
డబ్బుల ఆశచూపి ఓ బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం …ఉత్తరప్రదేశ్‌కు చెందిన దంపతులు 10 ఏండ్ల క్రితం నగరానికి వలసవచ్చి, నగరశివారు సూరారం సిద్ధ్దార్థనగర్‌లో స్థిరపడ్డారు. రోజూ వారి కూలీపనులు చేసుకుని జీవిస్తున్నారు. వారికి ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు. తల్లిదండ్రులు ఇద్దరు రోజూ కూలీపనులకు వెళుతుండగా.. …
Read More »నేడే మేయర్ ఎన్నిక
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు వేళయింది. గురువారం ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఎన్నికకు సంబంధించి టీఆర్‌ఎస్ విప్ జారీచేసింది. జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌తో కలిసి తలసాని …
Read More »రేవంత్ అరెస్ట్ తప్పదా…?
తెలంగాణ ,ఏపీ రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణకు హాజరుకాకపోతే వారెంట్ జారీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ఏసీబీ కోర్టు హెచ్చరించింది. నిన్న విచారణకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ ఉదయ్ సింహ హాజరుకాగా, పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి రాలేదు. ఇవాళ మాత్రం తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలతో వీలైనంత వేగంగా విచారణ చేపట్టాలని పేర్కొంది
Read More »