ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆపద్భాందవుడని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఆపదలో ఉన్న అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్ధిక భరోసా కలుగుతున్నదని అన్నారు. బాధితులు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిర్యాలగూడ పట్టణంలోని నెహ్రూ నగర్ కు చెందిన శ్రీనివాస్ కు రూ.48వేలు, ఈదులగూడెం కు చెందిన గంగమ్మ కు రూ.60వేలు, అశోకనగర్ కాలనీకి చెందిన శబరీనాథ్ కు రూ. 34వేలు …
Read More »శ్రీశైలం నుంచి నీటి విడుదల … 2007 తర్వాత ఇదే మొదటిసారి …
శ్రీశైలం జలాశయం నుంచి నేడు నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జలాశయం గేట్లను పైకెత్తి సాగర్‌కు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. 2007 తర్వాత జులైలో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్ …
Read More »మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరుదైన కానుక
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవల పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి భవన్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ,శోభమ్మ ఉన్న పంచలోహ చిత్రపటాన్ని మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కుమార్తెలు శ్రీహిత,శ్రీహర్శిత లతో కల్సి బహుకరించారు. ఈ …
Read More »మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం
ఇటీవల తెలంగాణ రాష్ట్ర గురుకుల సంస్థల కార్యదర్శి పోస్టుకు రాజీనామా చేసిన తాజా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. బీఎస్పీ పార్టీ వేదికగా తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఆగస్టు ఎనిమిదో తారీఖున నల్లగొండ జిల్లాలో ఎన్.జి కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు …
Read More »టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే నెల 5 నుంచి తొలివిడత కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆగస్టు 6 నుంచి 10 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 6 నుంచి 12 వరకు వెబ్ …
Read More »మరో ముందడుగు వేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్
దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపటమే లక్ష్యంగా పనిచేస్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవాళ మరో మైలురాయిని సాధించింది. వెండితెర బిగ్ బీ, పద్మవిభూషణ్ అమితాబ్ బచ్చన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న అమితాబ్ అక్కడే మొక్కలు నాటారు.ప్రస్తుత తరుణంలో అందరికీ ఉపయోగకరమైన, భావి తరాలకు అవసరమైన మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ …
Read More »BJPకి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా
మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కమలం పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇటీవల దళిత బంధుపై కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి పలువురు దళిత నేతలతో పాటు మోత్కుపల్లి కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అల్పపీడన ద్రోణి బలహీనపడింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని చెప్పింది. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉందని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా …
Read More »ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ-ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర,ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. గత 26 సంవత్సరాలుగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయనకు 6 సంవత్సరాల సర్వీస్ ఉంది. కొన్ని రోజుల క్రితం ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఓ …
Read More »తెలంగాణలో కొత్తగా 749 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 749 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,33,895కు పెరిగింది. కొత్తగా 605 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు 6,19,949 మంది కోలుకున్నారు. మరో ఐదుగురు వైరస్ బారినపడి మృతి చెందారు. ఇప్పటి వరకు 3,743 మంది ప్రాణాలు కోల్పోయారు. …
Read More »