చేనేత కార్మికులకు మంత్రి హరీష్ రావు శుభవార్త వినిపించారు. చేనేత కార్మికులు త్విఫ్టు ఎంత కడితే అంతకు డబుల్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. త్విఫ్టు కోసం త్వరలోనే రూ. 30 కోట్లు మంజూరు చేస్తామని హరీశ్రావు పేర్కొన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల కోసం రూ. 70 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో చేనేత కార్మికులకు నూలు, విక్రయాలకు సంబంధించిన రిబెట్ …
Read More »తెలంగాణలో కొత్తగా 329 కొత్త కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 329 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,60,471కు పెరిగింది. తాజాగా 307 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,51,085 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24గంటల్లో ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,889కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.57శాతం, మరణాల …
Read More »తెలంగాణలో 3.37లక్షల మంది టీచర్లు, సిబ్బందికి వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ టీచర్లకు వందశాతం వ్యాక్సినేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశారు. మిగతా వారందరికీ ఈ నెల 10లోపు పూర్తి చేసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని టీచర్లు, సిబ్బంది అంతా వ్యాక్సిన్లు వేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 10లోపు వందశాతం వ్యాక్సినేషన్‌ను చేరుకోవాలని ఆదేశించింది. కనీసం సింగిల్‌డోస్ వ్యాక్సిన్ …
Read More »ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం.. ఇక తగ్గేదేలేదు
విపక్షాల నాయకుల మాటలకు ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం. ఇగ చాలు..బరాబర్ ఇకనుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లే సమాధానం చెబుదాం. వెనక్కు తగ్గేదేలేదు’ అని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్.అన్నారు. జలవిహార్‌లో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో కేసీఆర్‌కు మనీ పవర్ లేదు, …
Read More »పెళ్లైన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి
పెళ్లైన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి స్నేహితుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన ఘటన నగరంలోని చోటు చేసుకుంది. పాతబస్తీ రియాసత్ నగర్‌కు చెందిన అక్బర్ ఖాన్ పెళ్ళైన మహిళతో ప్రేమ అంటూ వెంటపడ్డాడు. విషయం తెలిసిన ఆమె భర్త…అక్బర్ స్నేహితుడైన మహమ్మద్ ఈస సహాయం కోరాడు. తన భార్య వెంటపడవద్దని అక్బర్‌కు చెప్పాలని ఈసను కోరాడు. దీంతో మహిళ వెంటపడవద్దని ఈస నచ్చ చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం …
Read More »తెలంగాణ కమలనాథుల్లో ఆధిపత్య పోరు
తెలంగాణ రాష్ట్ర బీజేపీలో వర్గపోరు ముదిరిపాకానపడుతున్నది. పార్టీపై పట్టు సాధించేందుకు ఎవరికివారే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులాఉన్న ఆధిపత్యపోరు.. ఇప్పుడు బహిర్గతమైంది. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ చేపడుతున్న యాత్రలే దీనిని రుజువుచేస్తున్నా యి. ఇప్పటికే కిషన్‌రెడ్డి ప్రజా ఆశీర్వాదయాత్రను చేపట్టగా.. బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్రకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి బండి సంజయ్ యాత్ర ముందే ప్రారంభం కావాల్సి …
Read More »సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు
ఈ నెల 16న హుజూరాబాద్‌లో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. శాలపల్లి గ్రామంలో జరిగే సభలో దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ వివరించనున్నారు. ఈ క్రమంలో సభ ఏర్పాట్లను గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు.. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, పాడి కౌశిక్‌రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు …
Read More »అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్ ప్రత్యేకత
స్వయం పాలనా పోరాటంలో యువత పాత్ర గొప్పది అని ముఖ్యమంత్రి అనేకసార్లు చెప్పారు. యూనివర్సిటీ విద్యార్థులను తమ రాజకీయ అవసరాల కోసం వాడుకొని వదిలేసిన చరిత్ర రాష్ట్రంలోని ప్రతిపక్షాలది. కానీ కేసీఆర్ ఆ తొవ్వలో లేరు. 2014 నుంచి చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించే వారిలో సీనియర్లతో పాటు 30+ ఫార్ములాను అమలు చేస్తున్నారు. రాజకీయాలలోకి వచ్చి నిలదొక్కుకోవాలంటే అంతా ఈజీ కాదు. అంగ బలం, అర్ధ బలం ఉన్న …
Read More »తీన్మార్ మల్లన్న కేసు- ఆ “యువతి” ఎవరు..?
చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్ యూట్యూబ్ చానెల్ కార్యాలయంలో హైదరాబాద్ సీసీఎస్ సైబర్‌క్రైమ్స్ పోలీసులు మంగళవారం రాత్రి 8.30 గంటలకు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లను, హార్డ్ డిస్క్‌లను సీజ్ చేశారు. తీన్మార్ మల్లన్నపై సోమవారం ఓ యువతి ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆఫీసులో సోదాలు నిర్వహించారని అంటున్నారు. దాంతోపాటు చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో తీన్మార్ మల్లన్నపై నమోదైన మరో కేసు దర్యాప్తులో భాగంగా …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ హీరో ఆది పినిశెట్టి
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రంగస్థలం సినిమాలో తన సహచర నటుడు శత్రువు (విలన్ పాత్ర) ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు రామోజీ ఫిలింసిటీలో మొక్కలు నాటిన ప్రముఖ హీరో ఆది పినిశెట్టి. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం సోషల్ మీడియాలో మనం వివిధ రకాల …
Read More »