తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 33,236 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 184 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఒకరు మృతి చెందారు. వైరస్ నుంచి 137 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,75,798కి చేరింది. మృతుల సంఖ్య 3,990కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,581 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈమేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
Read More »బీపీ, షుగర్ పేషెంట్లకు డిసెంబర్ నుంచి ఉచితంగా మెడిసిన్ కిట్లు
తెలంగాణ రాష్ట్రంలో బీపీ, షుగర్ పేషెంట్లకు డిసెంబర్ నుంచి దశల వారీగా ఉచితంగా మెడిసిన్ కిట్లు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 20 లక్షల మంది బీపీ రోగులు, 7 లక్షల మంది షుగర్ రోగులు ఉన్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ సర్వేలో తేలింది. వీరికి ప్రభుత్వం ఇచ్చే కిట్లో నెలకు సరిపడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకునే బీపీ, షుగర్ మందులు ఉంటాయి. గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్ …
Read More »స్టార్టప్లకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం
స్టార్టప్లకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానంగా నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 400 స్టార్పలు పని చేస్తున్నాయని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ప్రభుత్వం స్టార్ట్ సేవలను వినియోగించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. అదే విధంగా కంపెనీలు కూడా స్టార్టీల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఔత్సాహికులను ప్రోత్సహించాలన్నారు.
Read More »ఓయూలోకి రావాలంటే పైసలు కట్టాల్సిందే..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న ఓయూలోకి ఇక నుంచి వెళ్లాలంటే డబ్బులు కట్టాల్సిందే. స్టాఫ్, స్టూడెంట్లు మినహా మిగతా ఎవరు వచ్చినా పాస్ తీసుకోవాల్సిందేనని యూనివర్సిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వాకర్స్ నుంచి నెలకు రూ.200, గ్రౌండ్ వాడుకునేందుకు రూ.500, జిమ్ వాడేందుకు రూ. 1,000 యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి.
Read More »Carona Vaccine కోసం పరుగులెడుతున్న జనాలు.. ఇందుకే..?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారిలో చాలా మంది రెండో డోసు తీసుకోలేదు. అయితే కరోనా కొత్త వేరియంట్ (ఒమిక్రాన్)పై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాలతో ప్రజలు రిస్క్ ఎందుకని టీకా కేంద్రాలకు పరిగెత్తుతున్నారు. గత 2 రోజులుగా రెండో డోసు తీసుకునే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు.
Read More »MLC ఎన్నికలకు BJP దూరం.
తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇతర ముఖ్యనేతలతో సమావేశమై ఈమేరకు చర్చించినట్లు సమాచారం. అభ్యర్థులను నిలబెట్టినా పార్టీకి జిల్లాల్లో ఓట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండటమే ఉత్తమమని బీజేపీ భావిస్తోంది. కాగా, మొత్తం 12 స్థానాల్లో డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి.
Read More »ప్రపంచ విత్తన గని “తెలంగాణ”
తెలంగాణ కిరీటంలో మరో అరుదైన, అద్భుతమైన కలికితురాయి వచ్చి చేరింది. ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన రాష్ర్టాన్ని ‘ప్రపంచ విత్తన భాండాగారం’గా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ నెల 4, 5 తేదీల్లో ఇటలీ రాజధాని రోమ్ నగరం వేదికగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) అంతర్జాతీయ విత్తన సదస్సును నిర్వహించనున్నది. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ర్టాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. …
Read More »‘దేశాన్ని సాకుతున్న నాలుగైదు అతిపెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి’
‘దేశాన్ని సాకుతున్న నాలుగైదు అతిపెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి’ అని సీఎం కేసీఆర్ పదేపదే చెప్తుంటారు.కేంద్ర ప్రభుత్వ నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ పత్రిక చేసిన విశ్లేషణలో సైతం ఆర్థిక శక్తులుగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణను ఒకటిగా తేల్చింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ర్టాలతో పోల్చితే దక్షిణాది రాష్ర్టాలు బలంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ విశ్లేషణలో దేశాన్ని తూర్పు, పశ్చిమ, మధ్య (సెంట్రల్), దక్షిణ, …
Read More »కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ అనుకూల స్టాండ్ తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ అడుగుజాడల వెంటే నడిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇంకా చాలాకాలం పడుతుందని కుండబద్దలు కొట్టా రు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా తో చిట్‌చాట్ చేసిన జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు …
Read More »హైదరాబాద్ పై నాయినిది చెదరని ముద్ర
హైదరాబాద్ నగరంపై దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి మహానేత ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నడిచేవని ఆయన గుర్తుచేశారు. దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రధమ వర్థంతి ని పురస్కరించుకుని లోయర్ ట్యాన్క్ బండ సమీపంలోనీ పింగళి వెంకటరామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లోజరిగిన కార్యక్రమంలో మంత్రి …
Read More »