హైదరాబాద్ జేఎన్టీయూలో ఈనెల 15, 16 తేదీల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సురేష్ వెల్లడించారు. ఆసక్తిగల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. పదో తరగతి నుంచి టెక్నాలజీ విద్య వరకు అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. అన్ని రకాల కంపెనీలు పాల్గొంటున్నాయని, ఈ అవకాశాన్ని …
Read More »మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో కిడ్నాప్ కలకలం
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ,బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్ సంఘటన సంచలనం సృష్టించింది. సోమవారం రాత్రి ఎనిమిదిన్నరకు జరిగిన ఈ ఘటనలో సౌత్ అవెన్యూలో ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసం ముందు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా ,మహబూబ్ నగర్ కు చెందిన మున్నూరు రవితో పాటు మరో ఇద్దరు గుర్తు …
Read More »ఎన్నికల్లో గెలవకున్నా పరిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ
ఎన్నికల్లో గెలవకున్నా పరిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రాజకీయాలు అన్నంక గెలుపోటములు ఉంటాయని.. వాటన్నిటిని సమానంగా తీసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే పేదల నోరు కొడుతున్న బీజేపీ.. యూపీ ఎన్నికలు అయిన తెల్లారే పెట్రోల్ రేట్లు పెంచుతుందని అన్నారు.సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవకున్నా పరిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ . కర్ణాటకలో వీళ్లు గెలవలేదు. కానీ పరిపాలిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో గెలవలేదు …
Read More »ఓవైసీకి జడ్ కేటగిరి భద్రత
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.నిన్నటి కాల్పుల ఘటన నేపథ్యంలో భద్రతపై సమీక్ష చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. తక్షణమే సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల పాటు వ్యక్తిగత భద్రతా అధికారితో పాటు 22 మంది సీఆర్పిఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించారు. …
Read More »తెలంగాణలో కొత్తగా 2,319కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 90,021 టెస్టులు చేయగా కొత్తగా 2,319 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్నటితో పోలిస్తే 399 కేసులు పెరిగాయి. మంగళవారం 1,920 కేసులు నమోదయ్యాయి. ఇక మహమ్మారితో ఇద్దరు మరణించారు. మరోవైపు కరోనా నుంచి 474 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,339 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు గత 24 గంటల్లో GHMC పరిధిలో 1,275 …
Read More »గ్రేటర్ లో కొత్తగా 1,015 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,015 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,56,344 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read More »తెలంగాణలో కొత్తగా 1,920కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 83,153 టెస్టులు చేశారు. 1,920 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే 100కేసులు పెరిగాయి. ఇక మహమ్మారితో ఇద్దరు మరణించారు. మరోవైపు కరోనా నుంచి 417 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,496 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
Read More »సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపు
తెలంగాణలో ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపు ఖాయం కాగా, ప్రజలపై మరో భారం పడనుంది. సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పల్లెవెలుగు బస్సులకు కి.మీ.కు 25 పైసలు, ఎక్స్ప్రెస్ ఆ పైన బస్సులకు కి.మీ.కు రూ.30 పైసల చొప్పున పెంచాలన్న TSRTC ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, అనుమతి రావాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత దీనికి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం.
Read More »తెలంగాణలో కొత్తగా 177కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38,219 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 177 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు వైరస్ తో మరణించారు. మొత్తం 190 మంది కోలుకున్నారు.మొత్తం కేసుల సంఖ్య- 6,80,251 .మరణించిన వారి సంఖ్య – 4,018. ప్రస్తుతం యాక్టివ్ కేసులు – 4,470.మొత్తం ఒమిక్రాన్ కేసులు- 38
Read More »ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారి-WHO
ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రాథమిక ఆధారాల మేరకు.. దీని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సభ్య దేశాలకు అప్రమత్తత లేఖలు జారీ చేసింది. ఇది ప్రపంచమంతటా విస్తరించేందుకు అత్యధిక అవకాశాలున్నాయని పేర్కొంది. భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను కలిసికట్టుగా పోరాడేందుకు సభ్యదేశాలు ఓ ఒప్పందం చేసుకోవాలని సూచించింది.
Read More »