టీఆర్‌ఎస్ పార్టీలో రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. బండ ప్రకాశ్ రాజీనామాతో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీనికి రేపటిలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అభ్యర్థిని ప్రకటించేందుకు టీఆర్‌ఎస్ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థిత్వంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావుకు రాజ్యసభ …
Read More »అమిత్‌షాజీ.. వీటికి సమాధానం చెప్పగలరా?: కవిత ప్రశ్నల వర్షం
కేంద్రంహోమంత్రి, బీజేపీ సీనియర్‌నేత అమిత్‌షా తెలంగాణ పర్యటన సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరగనుంది. ఈ సభకు అమిత్‌షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా సమాధానం చెప్పాలంటూ ట్విటర్ వేదికగా కకవిత ప్రశ్నల వర్షం కురిపించారు. వెనుకబడిన ప్రాంతాల కింద తెలంగాణకు రావాల్సిన రూ.1,350 కోట్లు, …
Read More »ఎప్పటికే టీఆర్‌ఎస్సే ప్రజలకు శ్రీరామరక్ష: హరీశ్‌రావు
తెలంగాణకు మేలు చేసే టీఆర్‌ఎస్ కావాలో.. నష్టం చేకూర్చే విపక్ష పార్టీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో హరీశ్ మాట్లాడుతూ తెలంగాణలో 24 గంటలూ కరెంట్ ఉంటుందని ఊహించామా? అని ప్రశ్నించారు. ఎప్పటికీ టీఆర్‌ఎస్సే రాష్ట్ర ప్రజలకు …
Read More »మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాలేవీ?: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉందంటూ బీజేపీ నేతలు తమ పాదయాత్రలో చెప్తున్నారని.. అలాంటప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలు ఉండాలని కదా? అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నారాయణపేటలో సుమారు రూ.90కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఉత్తమ పంచాయతీలుగా తెలంగాణ గ్రామాలే …
Read More »పొలిటికల్ టూరిస్టులకు కేసీఆర్ భయం పట్టుకుంది: ప్రశాంత్‌రెడ్డి
హనుమకొండ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ చూస్తే జాలేస్తుందని.. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివి ఆయన తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కంటే గొప్పగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో చెబితే బాగుండేదని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. రాహుల్‌పర్యటనతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదీమీ లేదన్నారు. రైతుల పక్షపాతి ఎవరనే విషయం దేశ …
Read More »పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు: రాహుల్
ఎంతోమంది యువత, తల్లుల రక్తం, ఆయా కుటుంబాల కన్నీళ్లతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ మాట్లాడారు. ఏ కలలు నెరవేర్చుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవని.. అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుతో …
Read More »బండి సంజయ్ కౌన్సిలర్‌గా కూడా పనికిరారు: శ్రీనివాస్‌గౌడ్
ఎన్నికలు వస్తున్నాయని పాదయాత్రలు మొదలుపెట్టి.. మతం, కులం పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. పచ్చని పాలమూరు జిల్లాలను ఆయన విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.20వేల కోట్లతో పూర్తయ్యేదంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌కు కాళేశ్వరం …
Read More »వ్యవసాయంపై రాహుల్‌గాంధీకి అవగాహన ఉందా?: వినోద్ కుమార్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యవసాయంపై కనీస అవగాహనైనా ఉందా అని మాజీ ఎంపీ, తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బి.వినోద్‌కుమార్ ప్రశ్నించారు. వరంగల్‌లో రేపు రాహుల్ ప్రకటించనున్న వ్యవసాయ విధానం రాష్ట్రానికా? దేశానికా? అని నిలదీశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వినోద్ మాట్లాడారు. రాష్ట్రంలో పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ విధానం దేశంలోని …
Read More »అర్వింద్.. పసుపు బోర్డు ఏదీ?.. ఇంకెన్నాళ్లు మాయమాటలు?: కవిత
అబద్ధాలు చెప్పి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైస్పీడ్‌లో అబద్ధాలు చెప్పడం తప్ప బీజేపీ నేతలు చేసిందేమీ లేదని మండిపడ్డారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. బీజేపీ నాయకులు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో, కేంద్రం జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మూడేళ్ల క్రితం పసుపు …
Read More »రాహుల్ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి
నిరుద్యోగుల మద్దతు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ కలలు కంటోందని టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. హైదరాబాద్‌లో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు రావడంతో కాంగ్రెస్ నేతల్లో భయం పట్టుకుందని.. అందుకే యూనివర్సిటీల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతర్గ కుమ్ములాటలో తెరాసపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. …
Read More »