బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనల వెనుక టీఆర్‌ఎస్ ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలు సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని చెప్పారు. దేశ రక్షణ కోసం సేవ చేయాలనుకునే యువతను బీజేపీ అవమానిస్తోందని విమర్శించారు. గతంలో రైతన్నలు, ఇప్పుడు సైనికులను నిర్లక్ష్యంగా చూడటం హేయమైన …
Read More »కేసీఆర్‌ను కించపరుస్తూ స్కిట్.. బీజేపీ నేతలు అరెస్ట్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. జూన్ 2న నాగోల్ బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ‘అమరుల యాదిలో’ సభను నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరుస్తూ ఓ స్కిట్ వేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేతలు రాణిరుద్రమ, దరువు ఎల్లన్నను పోలీసులు అరెస్ట్ చేయగా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి …
Read More »నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వైఎస్సారే: కొండా సురేఖ
ఈరోజుల్లో తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి దివంగత సీఎం, ప్రజానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్లేనని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందిన ‘కొండా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వెళ్లిన ఆమె.. అక్కడ కంట్రోల్‌రూమ్ ఎదురుగా వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉందని.. వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ …
Read More »రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చేశారు: జీవన్‌రెడ్డి
గవర్నర్ తమిళిసై ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని.. రాజ్‌భవన్‌ను ఆమె రాజకీయ భవన్‌గా మార్చేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. అది ప్రజాదర్బార్ కాదని.. పొలిటికల్ దర్బార్ అని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసైకి రాజకీయాలు చేయాలని ఉంటే బండి సంజయ్ స్థానంలో బీజేపీ అధ్యక్షురాలిగా రావాలని ఆయన …
Read More »మంత్రులు, ఎంపీలతో కేసీఆర్ కీలక భేటీ..
రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పాలన. రాజకీయ పరమైన అంశాలపై నేతలతో సీఎం చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నేతల అభిప్రాయాలను కేసీఆర్ తెలుసుకుంటున్నట్లు సమాచారం.
Read More »దాంతో తెలంగాణకు కేంద్రం పెద్ద దెబ్బ కొట్టింది: కేటీఆర్
ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో హామీ ఇచ్చారని.. అది ఏమైందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32లక్షల జాబ్స్ భర్తీ చేసిందని.. త్వరలో మరో లక్ష చేస్తుందని చెప్పారు. ప్రైవేట్ …
Read More »నేను చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తా: కేటీఆర్
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు జాతీయ హోదా ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పిందని.. కానీ ఈ ఎమిదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన.. భూత్పూర్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. వికారాబాద్-కర్ణాటక, గద్వాల-మాచర్ల మార్గాల్లో రైలు కేటాయించమన్నా చేయలేదని …
Read More »నా హత్యకు రేవంత్‌రెడ్డి కుట్ర: మంత్రి మల్లారెడ్డి
తనను హత్య చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని.. అందుకే రెడ్ల సింహగర్జన సభలో దాడికి యత్నించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. మేడ్చల్‌లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఎనిమిదేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. రేవంత్‌రెడ్డి నేరాలపై విచారణ జరిపి జైల్లో పెడతామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ పథకాలు రెడ్లకు అందుతున్నాయని తాను చెప్పానన్నారు.
Read More »రెండు మూడు నెలల్లోనే సంచలన వార్త వింటారు: కేసీఆర్
కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికే సాగునీరు, తాగునీరు, విద్యుత్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. బెంగళూరులో జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో ఆయన భేటీ అయ్యారు. వారి నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత వివిధ …
Read More »ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కోమటిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదంతో ఘర్షణ జరిగింది. జహీరాబాద్ లోక్‌సభ ఇన్‌ఛార్జ్ మదన్‌మోహన్‌రావు, ఎల్లారెడ్డి అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ సుభాష్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గల నేతలు ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. ఇలాంటి …
Read More »