తాము మర్యాద ఇచ్చి పుచ్చుకుంటామని.. ఎవరు ఎవరికీ భయపడని టీఆర్‌ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళితే తాము కూడా సిద్ధమేనని చెప్పారు. మహారాష్ట్ర తరహా రాజకీయాలు చేస్తే ఒప్పుకోబోమని.. సై అంటే సై అంటామన్నారు. బీజేపీ నేతలు ఆ పార్టీ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ వచ్చారని.. …
Read More »కేసీఆర్‌లాంటి నాయకుడు దేశానికి కావాలి: యశ్వంత్‌సిన్హా
దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ వచ్చిన యశ్వంత్ సిన్హా.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జలవిహార్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటం కాదని.. గుర్తింపు కోసం జరిగేది అసలే కాదన్నారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే …
Read More »కులాన్ని తక్కువ చేసే కుసంస్కారిని కాదు: కేటీఆర్
విశ్వబ్రాహ్మణులను తాను కించపరిచినట్లు కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం అవాస్తవమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిని ఉద్దేశించి అన్న మాటలు ఎవరినైనా నొప్పిస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. కులాన్ని తక్కువ చేసే కుసంస్కారిని తాను కాదని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read More »కిషన్‌రెడ్డి చేతగాని దద్దమ్మ: బాల్క సుమన్
విభజన చట్టం ప్రకారం కేంద్రం ఒక్క హామీ నెరవేర్చకున్నా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌నిలదీశారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి తెలంగాణకు కిషన్‌రెడ్డి ఒక్క మంచి పనైనా చేయించారా? అని ప్రశ్నించారు. చేతగాని దద్దమ్మగా ఆయన మిగిలిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డిని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో ఉన్న గుమస్తాలు కూడా గుర్తు పట్టరన్నారు. ‘‘కిషన్‌రెడ్డి తెలంగాణ ద్రోహి. …
Read More »మీ రియల్ అజెండా విద్వేషం.. అసలు సిద్ధాంతం విభజనే: కేటీఆర్
హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష అజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఆయనకు మంత్రి లేఖ రాశారు. పార్టీ డీఎన్‌ఏలోనే విద్వేషాన్ని నింపుకొన్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం తమ అత్యాశే అవుతుందన్నారు. మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం.. అసలు …
Read More »రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు లేవు: నిరంజన్‌రెడ్డి
అర్హులైన లబ్ధిదారులందరికీ ‘రైతుబంధు’ కింద ఆర్థికసాయం జమ చేస్తున్నామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. ఎక్కువ భూమి ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుందనేది అవాస్తమని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో మీడియాతో మంత్రి మాట్లాడారు. రైతుబంధుపై ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదో విడత రైతుబంధు కింద రూ.7,508కోట్లు అందిస్తున్నామని మంత్రి …
Read More »రాష్ట్రపతి ఎన్నిక.. కేసీఆర్ మద్దతు ఆయనకేనా!
రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతు ఎవరికి ఉంటుంది? ఈ విషయంలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయాలపై ఆసక్తి ఉన్న అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి, కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతిస్తారని శరద్ పవార్ చెప్పారు. ముంబయిలో …
Read More »దేశంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు: కేటీఆర్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన ఈ 8 ఏళ్లలో హైదరాబాద్‌లో 30 ఫ్లైఓవర్లు నిర్మించిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. మరో 17 ఫ్లైఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి సూచిక ప్రజా రవాణా, రహదారులేనని చెప్పారు. కూకట్‌పల్లిలోని కైతలాపూర్ వద్ద రూ.84 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. …
Read More »కులపిచ్చోడు, మత పిచ్చోడు మనకొద్దు: కేటీఆర్
బీజేపీ నేతలు మాట్లాడితే విషం చిమ్ముతున్నారని.. హిందూ ముస్లిం మాటలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉందని, ఎవరెన్ని కూతలు కూసినా పట్టించుకోవద్దని ప్రజలకి సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అనాలోచితమైన నిర్ణయాలతో దేశాన్ని రావణకాష్టంగా మార్చేసిందని తీవ్రస్థాయిలో ఆయన …
Read More »దాని అర్థం ‘విశ్వగురు’కే తెలుసు: కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’పై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన దైన శైలిలో వ్యంగ్య్యాస్త్రాలు సంధించారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన పలు కార్యక్రమాలపై విమర్శలు చేశారు. ‘‘రైతు చట్టాలు రైతులకు అర్థంకావు.. సాధారణ ప్రజలకి నోట్ల రద్దు అర్ధం కాదు.. వ్యాపారులకు జీఎస్టీ అర్థం కాదు.. ముస్లింలకు సీఏఏ అర్థం కాదు.. గృహిణులగా ఉన్న మహిళలకు ఎల్‌పీజీ …
Read More »