ఆ లేడీ.. ఓ దొంగను ప్రేమ పెండ్లి చేసుకున్నది. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది. అతడిని వదిలేసి, మరో దొంగతో సహజీవనం చేసింది. అతడినీ వదిలేసి ఇంకో దొంగతో రిలేషన్‌షిప్‌లో ఉంటూ విలాసాలకు అలవాటుపడింది. చివరికి నకిలీ పోలీస్ అవతారం ఎత్తి కిలేడీగా మారింది. ఆమె ఆటలు పసిగట్టిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకెళితే.. గుడిసెల అశ్విని ఇంటర్ వరకు చదివి, ఇండ్లలో దొంగతనాలు చేసే రోహిత్‌శర్మ అనే ఒక …
Read More »మాదాపూర్ ఎస్‌ఐ రాజేంద్రకు జైలు శిక్ష
ప్రస్తుతం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న రాజేంద్రకు ఏసీబీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. గతంలో రాయదుర్గంలో ఎస్‌ఐగా పనిచేసిన రాజేంద్ర లంచం తీసుకుంటూ దొరికిపోయారు. 2013లో ఇర్షాద్ ఖురేషీ బైక్‌ను తిరిగి ఇచ్చేందుకు రాజేంద్ర రూ.10 వేలు డిమాండ్ చేశారు. దీనిపై అనీశాకు ఫిర్యాదు అందగా రాజేంద్ర లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన తీర్పును తాజాగా ఏసీబీ కోర్టు వెలువరించింది.
Read More »రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
మొహర్రం సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు నిర్వహించనున్నారు. డబీర్‌పురాలోని బీబీకా ఆలం నుంచి చాదర్‌ఘాట్ వరకు ఊరేగింపు కొనసాగనుంది. ఈ సమయంలో ట్రాఫిక్ మల్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Read More »