Home / Tag Archives: Telangana News (page 9)

Tag Archives: Telangana News

యాదాద్రి జిల్లాలో కుళ్లిపోయిన స్థితిలో యువతీ యువకుల డెడ్‌బాడీలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో గుర్తుతెలియని యువతీ యువకుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో నగ్నంగా పడి ఉన్న యువతి, యువకుడి డెడ్‌బాడీలను అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించారు. అవి కుళ్లిపోయిన స్థితితో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. పోలీసులు క్లూస్‌ టీమ్‌తో అక్కడికి చేరుకుని ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సమీపంలో దొరికిన బ్యాగ్‌లోని వివరాల ఆధారంగా మృతులను హైదరాబాద్‌ నగర …

Read More »

గూగుల్‌తో ఒప్పందం.. మరింత మెరుగైన సేవలకు అవకాశం: కేటీఆర్‌

అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్‌కు గూగుల్‌ సంస్థ శ్రీకారం చుట్టింది. అమెరికాలోని మౌంటెన్‌వ్యూలోని తమ హెడ్‌క్వార్టర్‌ తర్వాత హైదరాబాద్‌లో 3.3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను స్థాపించనుంది. ఈ క్యాంపస్‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, గూగుల్‌ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. విద్య, పౌరసేవలతో పాటు ఇతర రంగాల్లో గూగుల్‌ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి టెక్నికల్‌ …

Read More »

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. ఉక్కపోత నుంచి కాస్త రిలీఫ్‌

ఎండల వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్‌ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. నగరంతో పాటు చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. సికింద్రాబాద్‌, ఈస్ట్‌ మారేడ్‌పల్లి, వెస్ట్‌ మారేడ్‌పల్లి,తిరుమలగిరి, అల్వాల్‌, బోయిన్‌పల్లి, చిలకలగూడ,బేగంపేట్‌, లంగర్‌హౌస్‌, కార్వాన్‌, గోల్కొడ ప్రాంతాల్లో వర్షం పడింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, కవాడిగూడ, విద్యానగర్‌, భోలక్‌పూర్‌, బీఆర్కే భవన్‌, ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌, సోమాజిగూడ, పంజాగుట్ట, బేగంబజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, హిమాయత్‌నగర్‌ మొదలైన చోట్ల …

Read More »

మొదటి 20లో 19 తెలంగాణ గ్రామాలే.. కంగ్రాట్స్‌ సీఎం గారూ: కేటీఆర్‌ ట్వీట్‌

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సంసద్‌ ఆదర్శ గ్రామీణ యోజనలో దేశవ్యాప్తంగా మొదటి 10 స్థానాలతో పాటు మొదటి 20లోనూ 19 తెలంగాణ గ్రామాలే ఉండటం గర్వకారణమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పల్లె ప్రగతి లాంటి ప్రత్యేక కార్యక్రమాలు అమచేస్తున్న సీఎం కేసీఆర్‌కు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన బృందానికి అభిందనలు తెలిపారు. …

Read More »

బండి సంజయ్‌.. నీకు దమ్ముంటే ఆ నిధులు రప్పించు: హరీశ్‌ సవాల్‌

తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన నిధులు ఇవ్వకుండా బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రం ఏదో నిధులు ఇచ్చేస్తున్నట్లు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌ మాట్లాడారు. తెలంగాణ నిధులతో బిహార్‌, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆక్షేపించారు. బీజేపీ నేతలు ఉల్టా మాటలు కప్పిపెట్టి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.7,183కోట్లు …

Read More »

కల్తీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోండి: కేసీఆర్‌

ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసి తీరతామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పంట ఉత్పత్తి తగ్గించే తీరుపై తిరోగమన విధాలను అవలంభిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని.. ఏఈవోలకు నిరంతర ట్రైనింగ్‌ క్లాసులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ అధికారులు …

Read More »

కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. మూడు రోజులుగా రేప్‌

కోదాడలో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడురోజులుగా అత్యాచారం చేశారు. కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆ అమ్మాయికి ఇచ్చారు. మూడు రోజుల తర్వాత సదరు యువతి తమ బంధువులకు విషయాన్ని చెప్పడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై యువతి పోలీసులకు కంప్లైంట్‌ చేసింది. దీంతో విచారణ చేపట్టిన కోదాడ పోలీసులు …

Read More »

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌

తెలంగాణలోని నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌ వచ్చేసింది. రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌ ప్రకటించింది. ఇంటర్వ్యూలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పోలీసు ఉద్యోగాలకు ఏజ్‌ లిమిట్‌ను మరో మూడేళ్లకు పెంచింది. టీఎస్‌పీఎస్సీ తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది నిరుద్యోగులకు ప్రయోజనం కలగనుంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూల ఎత్తివేతపై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat