ప్రయాణికుల కోసం వాటర్ బాటిళ్లు తయారు చేసి విక్రయించేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. దీని కోసం మంచి డిజైన్‌ను సూచించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మంచి వాటర్ బాటిల్ డిజైన్ సూచించి ప్రైజ్ మనీ గెలుచుకోవాలని సజ్జనార్ కోరారు. ప్రయాణికుల కోసం అరలీటర్, లీటర్ పరిమాణాల్లో ఈ వాటర్ బాటిళ్లను అందజేయనున్నారు. ఆర్టీసీ తీసుకొస్తున్న ఈ మార్పులకు తోడ్పాటు అందించాలని ప్రజలకు …
Read More »మోడీ పనిచేస్తోంది దేశం కోసమా? దోస్తుల కోసమా?: బాల్క సుమన్
దేశచరిత్రలో మోడీలాంటి అసమర్థ ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. ఆయన నియంతృత్వ పాలన చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు. కరోనా సమయంలో అసమర్థ పాలనను ప్రపంచమంతా చూసిందన్నారు. తెలంగాణకు మోడీ పచ్చి వ్యతిరేకి అని సుమన్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రజలతో నేరుగా ఎన్నికయ్యారని.. తెలంగాణ ఉద్యమంలో ఆయన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని …
Read More »అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నాం: దావోస్‌లో కేటీఆర్
వరల్డ్ లెవల్లో పోటీని తట్టుకుని నిలబడాలంటే ఇండియన్ లైఫ్ సైన్సెస్ రంగం బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనాతో ఏర్పడిన సంక్షోభ సమయంలో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత మరింత పెరిగిందని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ సిటీ ఈ రంగంలో తన బలాన్ని మరింతగా …
Read More »బీబీ నగర్ ఎయిమ్స్‌పై కిషన్‌రెడ్డి దృష్టిపెట్టాలి: హరీశ్‌రావు
బీబీ నగర్ ఎయిమ్స్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పలుమార్లు సందర్శించినా ఇక్కడి సదుపాయాలపై కేంద్రాన్ని ఏనాడూ అడగలేదని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఎయిమ్స్ నిర్మాణానికి భూములు, భవనాలు ఇచ్చి అన్నిరకాలుగా సహకారం అందించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలకు ఉపయోగం కలగడం లేదన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్‌కు హరీశ్‌రావు పరిశీలించి అందుతున్న వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం …
Read More »లండన్ కింగ్స్ కాలేజ్‌తో కేటీఆర్ ఒప్పందం
హైదరాబాద్ ఫార్మాసిటీలో ఏర్పాటు చేయనున్న ఫార్మా యూనివర్సిటీకి సహకారం అందించేందుకు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ముందుకొచ్చింది. లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో కింగ్స్ కాలేజ్ ప్రతినిధులు అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. ఫార్మా యూనివర్సిటీకి సంబంధించి పరిశోధన, అకడమిక్ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కింగ్స్ కాలేజ్ పనిచేయనుంది. ఈ ఒప్పందంతో ఫార్మా రంగంలో ఉన్నత విద్యావకాశాలు, పరిశోధన, పాఠ్యాంశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్ కాలేజ్ తన …
Read More »వరల్డ్ బాక్సింగ్‌లో తెలంగాణ అమ్మాయికి గోల్డ్ మెడల్
యువ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది. బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయి నిఖత్ జరీన్. థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌తో జరిగిన ఫైనల్‌లో 5-0తో ఆమె జయకేతనం ఎగురవేసింది. గేమ్‌లో తొలి నుంచి దూకుడుగా ఉన్న ఆమె ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా అదరగొట్టేసింది. నిఖత్ జరీన్ గెలుపుతో హైదరాబాద్‌లోని …
Read More »టీఆర్‌ఎస్ రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ.. ఆశావహులు వీళ్లే!
టీఆర్‌ఎస్ పార్టీలో రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. బండ ప్రకాశ్ రాజీనామాతో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీనికి రేపటిలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అభ్యర్థిని ప్రకటించేందుకు టీఆర్‌ఎస్ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థిత్వంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావుకు రాజ్యసభ …
Read More »మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. బీరు రేటు పెంపు?
మందుబాబులకు ఇది కాస్త చేదు వార్తే. రాష్ట్రంలో బీరు రేట్లను పెంచాలని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నిర్ణయించినట్లు సమాచారం. రేట్లు పెంచాలని కొంతకాలంగా డిస్టలరీ యజమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రేట్లు పెంచాలని ఎక్సైజ్ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బీరుపై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం లైట్ బీరు రూ.140 ఉండగా దాన్ని రూ.150కి, స్ట్రాంగ్ రూ.150 ఉండగా దాన్ని రూ.170కి పెంచనున్నట్లు తెలిసింది. దీనికి …
Read More »తీన్మార్ మల్లన్నకు మంత్రి పువ్వాడ అజయ్ షాక్!
తీన్మార్ మల్లన్నకు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ షాక్ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మల్లన్నకు న్యాయవాదితో మంత్రి లీగల్ నోటీసు పంపించారు. ఏప్రిల్ 17న మల్లన్న తన యూట్యూబ్ ఛానల్‌లో మంత్రి అజయ్‌పై అసత్య ఆరోపణలు చేశారని ఆయన తరఫు లాయర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. మంత్రి పరువుకు భంగం కలిగించినందున వారంలోపు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మంత్రి తరఫున న్యాయవాది మల్లన్నను డిమాండ చేశారు. అంతేకాకుండా …
Read More »హైదరాబాద్‌లో ఈనెల 19న ఆటోలు, క్యాబ్‌లు బంద్!
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు సంబంధించి గోడపత్రికను హైదరాబాద్, హైదర్‌గూడలో జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను 714 తీసుకొచ్చి ఫిట్‌నెస్ రెన్యువల్ రోజుకు రూ.50 పెనాల్టీ …
Read More »