Home / Tag Archives: Telangana News (page 6)

Tag Archives: Telangana News

మిగతా వాళ్లకీ బూస్టర్‌ డోసు ఇవ్వండి: కేంద్రాన్ని కోరిన మంత్రి హరీష్‌

18 ఏళ్లు నిండిన వారందరికీ గవర్నమెంట్‌ హాస్పిటళ్లలో బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరీష్‌ మాట్లాడారు. ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పెరుగుతున్నందన అర్హులైన వారంద‌రికీ బూస్ట‌ర్ డోస్ ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రాష్ట్రంలోని అన్ని …

Read More »

నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వైఎస్సారే: కొండా సురేఖ

ఈరోజుల్లో తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి దివంగత సీఎం, ప్రజానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వల్లేనని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందిన ‘కొండా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వెళ్లిన ఆమె.. అక్కడ కంట్రోల్‌రూమ్‌ ఎదురుగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉందని.. వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ …

Read More »

మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియాపై కేసు నమోదు.. ఎందుకంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలైన  మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియాపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు న‌మోదైంది. ఈ నెల 9వ తేదీన అంటే సుంద‌రానికి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మ‌దాపూర్ శిల్ప‌క‌ళా వేదిక‌లో మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియా క‌లిసి నిర్వ‌హించాయి. ఈ ఈవెంట్‌కు ఆ సంస్థ‌లు ఎలాంటి అనుమ‌తి తీసుకోలేదు. దీంతో …

Read More »

పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష.. సీపీజీఈటీ-2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి దీన్ని విడుదల చేశారు. దీని ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూ హైదరాబాద్‌,మహిళా యూనివర్సిటీల్లో పీజీ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారు. జులై 4 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. లేట్‌ ఫీతో జులై 15 వరకు అవకాశముంది. జులై 20న ఆన్‌లైన్‌లో ప్రవేశ …

Read More »

నేను చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తా: కేటీఆర్‌

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు జాతీయ హోదా ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పిందని.. కానీ ఈ ఎమిదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన.. భూత్పూర్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. వికారాబాద్‌-కర్ణాటక, గద్వాల-మాచర్ల మార్గాల్లో రైలు కేటాయించమన్నా చేయలేదని …

Read More »

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కేటీఆర్‌ టూర్‌.. పేరూరు లిఫ్ట్‌కి శంకుస్థాపన

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలు అభివృద్ధి పథకాలకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా దేవరకద్ర, భూత్పూర్‌, కోసిగి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. దేవరకద్ర మండలం వెంకపల్లిలో రూ.55కోట్ల వ్యయంతో చేపట్టనున్న పేరూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. వర్ని-ముత్యూలపల్లి రోడ్డుపై వంతెన, గుడిబండకు రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత భూత్పూర్‌ చేరుకుని మున్సిపాలిటీలో మినీ స్టేడియం నిర్మాణానికి …

Read More »

నిఖత్‌ జరీన్‌, ఇషా సింగ్‌కు కేసీఆర్‌ భారీ నజరానా

వరల్డ్‌ ఉమెన్స్‌ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు సీఎం కేసీఆర్‌ భారీ నజరానా ప్రకటించారు. ఆమెతో పాటు ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఇషా సింగ్‌కు కూడా నజరానా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరికీ చెరో రూ.2కోట్ల చొప్పున నగదు.. జూబ్లీహిల్స్‌ లేదా బంజారాహిల్స్‌లో ఇంటి లం కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

Read More »

తెలంగాణలో 2.5లక్షల ఎకరాల్లో ఆలుగడ్డలు పండించాలి: నిరంజన్‌రెడ్డి

తెలంగాణలో తినేందుకు ఆలుగడ్డను అధికమొత్తంలో వినియోగిస్తారని.. ఇక్కడ ప్రజల అవసరాలకు సరిపోయేలా ఉండాలంటే 2.5లక్షల ఎకరాల్లో పండించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వానాకాలం పంటలసాగుపై సంగారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కేవలం ఐదారు వేల ఎకరాల్లోనే ఆలుగడ్డలను పండిస్తున్నారని.. అందుకే యూపీ, గుజరాత్, పంజాబ్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. 65 నుంచి 70 రోజుల్లోనే ఆలు …

Read More »

టీఆర్‌ఎస్‌ ఎంపీగా గాయత్రి రవి ప్రమాణస్వీకారం

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ సచివాలయంలో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి కడియం శ్రీవారి, టీఆర్ఎస్‌ నేతలు గాయత్రి రవికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలన్నీ అమలయ్యేవరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం ఆపేది లేదన్నారు. తెలంగాణపై …

Read More »

అమరుల స్మారక చిహ్నంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: ప్రశాంత్‌రెడ్డి

తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ అని.. ఆ నిర్మాణంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ విధించిన గడువులోపు ఆ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అతిథులు నివాళులర్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని.. అమరుల త్యాగాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat