తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో గోదావరి ఉద్ధృతి, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. విద్యుత్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి వస్తున్న వరదను అంచనా వేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా మరో నెలరోజులకు సరిపడా బొగ్గు నిల్వలను సిద్ధం …
Read More »హైదరాబాద్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ జరిగింది. మొత్తం 69 మందిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు వ్యవహారం చర్చనీయాంశం అయిన నేపథ్యంలో భారీగా బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌గా రాపోలు శ్రీనివాస్‌రెడ్డి, సైఫాబాద్‌కు కె.సత్తయ్య, శాలిబండకు జి.కిషన్, బేగంబజార్‌కు ఎన్.శంకర్, ఆసిఫ్‌నగర్‌కు శ్రీనివాస్, రాంగోపాల్‌పేటకు జి.లింగేశ్వరరావు, మొగల్పురాకు శివకుమార్‌ను నియమించారు. ఈ మేరకు …
Read More »అత్యంత భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
భారీ వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్‌ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. సెక్రటేరియట్‌లో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది.
Read More »తెలంగాణలో మూడు రోజులు స్కూళ్లు బంద్: కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటామని.. దీనికి యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. సహాయ చర్యల కోసం హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. మరో 4, 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షసూచన ఉందని.. …
Read More »ప్రజలు అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు: సీఎం కేసీఆర్
భారీ వర్షాలు కురుస్తున్నందున మహారాష్ట్రతో పాటు తెలంగాణకు రెడ్‌అలర్ట్ ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్‌ను అలర్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు సాయపడుతూ నష్టం జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలు, వరదల …
Read More »తడి చెత్తతో రూ.6లక్షల ఆదాయం: కేటీఆర్ అభినందన
పంచాయతీలో తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేసి రూ.6లక్షల ఆదాయాన్ని సంపాదించిన ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామ సర్పంచ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ అందిన సంక్షేమ నిధుల వివరాలతో బోర్డు ఏర్పాటు చేయడం.. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకుంటూ ముఖ్రాకే ఆదర్శంగా …
Read More »జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు: కేసీఆర్ ఆదేశం
రాష్ట్రంలోని భూముల సమస్య పరిష్కారానికి జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి మూడురోజులకు ఒక మండల కేంద్రం చొప్పున 100 టీమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సదస్సుల్లో జేసీ, డీఆర్వో, ఆర్డీవో, స్థానిక ఎమ్మెల్యే పాల్గొనాలని ఆదేశించారు. మరోవైపు ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించిన అవగాహన సదస్సును ఈనెల 11న నిర్వహించనున్నారు. …
Read More »కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమినరీ టెస్ట్ తేదీలివే..
తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమినరీ రిటెన్ టెస్ట్ తేదీలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆగస్ట్ 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎస్సై అభ్యర్థులు ఈనెల 30 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్ట్ 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ప్రభుత్వం …
Read More »నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. 1,663 ఉద్యోగాల ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఇంజినీరింగ్‌విభాగానికి చెందినవే 1,522 ఉన్నాయి. ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ శాఖల్లోని ఇంజినీరింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇరిగేషన్‌లో 704 ఏఈఈ పోస్టులు, 227 ఏఈ, 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, 95 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. తాజా అనుమతులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం …
Read More »మీ రియల్ అజెండా విద్వేషం.. అసలు సిద్ధాంతం విభజనే: కేటీఆర్
హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష అజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఆయనకు మంత్రి లేఖ రాశారు. పార్టీ డీఎన్‌ఏలోనే విద్వేషాన్ని నింపుకొన్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం తమ అత్యాశే అవుతుందన్నారు. మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం.. అసలు …
Read More »