కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణకు వచ్చి రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ కంటే సింధియా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో మెరుగైన అభివృద్ధి జరిగి ఉంటే చూపించాలని కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జనాభా. దేశానికి …
Read More »ఆ స్టిక్కర్ ఎవరో పెట్టుకుంటే నాకేం సంబంధం?: మంత్రి మల్లారెడ్డి
క్యాసినో కేసులో నిర్వాహకులు మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. అయితే ఈడీ తనిఖీల సమయంలో మాధవరెడ్డి కారుకు మేడ్చల్ ఎమ్యెల్యే, మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉన్న అంశం చర్చనీయాంశమైంది. బోడుప్పల్లో ఓ స్కూల్‌కు వెళ్లి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ మాధవరెడ్డి కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అంశంపై స్పందించారు. అది మార్చి 2022 నాటి స్టిక్కర్ అని.. దాన్ని మూడునెలల క్రితమే …
Read More »మరో మూడు రోజులు భారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకి వద్దు!
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. మంగళవారం అతిభారీ, బుధవారం, గురువారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని తెలిపింది. మరోవైపు సోమవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు పలు కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరింది. ఆ నీరు …
Read More »ఓటీటీలో భారీ బడ్జెట్ సినిమాలు.. ఇకపై అన్ని రోజులు ఆగాల్సిందే!
ఇకపై థియేటర్లో విడుదలయ్యే భారీ సినిమాలు అంత త్వరగా ఓటీటీలోకి రావు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. థియేటర్లో విడుదలయ్యే భారీ బడ్జెట్ సినిమాలు 10 వారాల తర్వాతే ఓటీటీలో వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు పరిమిత బడ్జెట్‌తో రిలీజ్ అయిన సినిమాలు 4 వారాల తర్వాత ఓటీటీకి ఇచ్చేలా నిర్ణయించారు. మరోవైపు టికెట్ ధరలు కూడా సాధారణ థియేటర్లు, సి క్లాస్‌లో …
Read More »కేసీఆర్ నిప్పు.. ఆయన్ను ఎవరూ టచ్ చేయలేరు: జగదీష్‌రెడ్డి
కేసీఆర్ సీఎం అయ్యాకే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో దేశం తలసరి ఆదాయం తగ్గిపోయిందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బాధ్యతా రాహిత్యమైన, విచిత్ర ప్రతిపక్షాలు ఉన్నాయని మండిపడ్డారు. వార్తల్లో ట్రెండింగ్ అయ్యేందుకు ప్రతిపక్ష నేతలు పోటీపడుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు …
Read More »మరో మూడు రోజులు తెలంగాణకు భారీ వర్షసూచన
రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగానూ 19 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీ సహా 19 రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. గుజరాత్లో అతిభారీ వర్షాలు కురిసే …
Read More »హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో రెండు రోజులూ ఇంతే!
హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి చిరుజల్లులు పడుతూనే ఉండగా.. సాయంత్రం నుంచి భారీ వర్షం పడింది. ఇటు పటాన్ చెరు నుంచి అటు అబ్దుల్లాపూర్‌మెట్ వరకు వర్షం కురుస్తూనే ఉంది. అమీర్‌పేట్, నాంపల్లి, కోఠి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, జీడిమెట్ల, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో …
Read More »ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం
ములుగుకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాలతో వచ్చి వరదల్లో పలు గ్రామాలు ముంపులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంపు గ్రామాల పర్యటనకు సీతక్క వెళ్లారు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి వద్ద వాగు ఉండటంతో పడవలో ఆమె అవతలి ఒడ్డుకు బయల్దేరారు. ఈ క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న పడవ ఆగిపోయి ఓ చెట్టుకు ఢీకొట్టింది. వాగు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ …
Read More »ఎగ్‌ఫ్రైడ్ కలుషితం.. ట్రిపుల్ ఐటీలో 600 మందికి అస్వస్థత!
బాసర ట్రిపుల్ ఐటీలో భోజనం వికటించి సుమారు 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలతో పలువురు విద్యార్థులు సృహతప్పి పడిపోయారు. మధ్యాహ్న భోజనంలో వడ్డించిన ఎగ్‌ఫ్రైడ్ రైస్ కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. పీయూసీ-1, పీయూసీ-2 మెస్‌లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు మెస్‌లకు ఒకే చోట భోజనం తయారు చేస్తుంటారు. అప్రమత్తమైన అధికారులు …
Read More »మరో ఐదు గంటల్లో.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. పలు జిల్లాల్లో నదులు, చెరువుల్లోకి వరదనీరు చేరడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రానున్న ఐదు గంటల్లో ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ …
Read More »